ఉదయం మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ చేసి జగన మోహన్ రెడ్డి, మళ్ళీ కక్ష సాధింపు రాజకీయలకు తెర లేపారు. అయితే పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీక్ వ్యవహారంలోనే నారాయణను అరెస్ట్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారం జరుగుతూ ఉండగానే, నారాయణను అరెస్ట్ చేసి తరలిస్తూ ఉండగానే, ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఏకంగా చంద్రబాబుని ఏ1 గా చేస్తూ, నారాయణను ఏ2 గా చేస్తూ, కొత్త కేసు పెట్టారు. ఈ కొత్త కేసులు, గతంలో అమరావతి రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో, మార్పు చేసి, ప్రభుత్వానికి నష్టం చేసారని, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో, ఈ కేసు పెట్టినట్టు ఎఫ్ఐఆర్ లో రాసారు. అయితే, నారాయణను ఏ కేసులో అరెస్ట్ చేసారు అనేది ఇంకా పోలీసులు చెప్పలేదు. ఈ కొత్త కేసులు అయితే, చంద్రబాబు ఏ1 కావటంతో, ఆయన్ను కూడా అరెస్ట్ చేస్తారా అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రకరకాల కొత్త కేసులతో, ఎలాగైనా చంద్రబాబుని అరెస్ట్ చేయటానికి, అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఏమి జరుగుతుందో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read