వైసీపీ వచ్చిన గత అయుదు నెలలుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు పై జరుగుతున్న దాడులతో పాటు, కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్న విధానం పై, తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా పోరాటం చేస్తుంది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పోరాటంతో పాటు, చంద్రబాబు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి ప్రెజంటేషన్ లు ఇచ్చి మరీ, వైసిపీ అరాచకాలను ఎండ గడుతున్నారు. అయినా, వైసీపీలో మార్పు రాకపోవటంతో, వివిధ ఫోరమ్స్ లో పోరాటానికి తెలుగుదేశం సిద్ధమైంది. ఇందులో భాగంగా, ముందుగా జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్లి, ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్నిటి పై ఆధారాలు ఇచ్చి, ఫిర్యాదు చేసింది తెలుగుదేశం. తెలుగుదేశం ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన, జాతీయ మానవ హక్కుల సంఘం, సానుకూలంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని, తమని వేధిస్తుంది అంటూ టిడిపి చేసిన ఆరోపణల పై, విచారణకు ఆదేశించింది.

jaydev 23102019 2

ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ, డీజీపీలకు, లేఖ రాస్తూ జాతీయ మానవ హక్కుల సంఘం, కీలక ఆదేశాలు జారీ చేసింది. టిడిపి ఎంపీ గల్లా జయదేవ్, ఇచ్చిన ఫిర్యాదు పై పూర్తి స్థాయి విచారణ జరిపి, ఆరు వారాల్లోగా, ఆ నివేదిక తమకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఈ లోపే, గుంటూరు జిల్లాలోని పిన్నెల్లి, ఆత్మకూరు, జంగమేశ్వరపాడు, పునుగుపాడు గ్రామాలకు, పోలీసు, న్యాయశాఖలకు చెందిన ఇద్దరు అధికారులును పంపించి, అక్కడ ఊళ్ళు వదిలి వెళ్ళిన బాధితుల పరిస్థితి పై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి, 2 పేజీల ఆదేశాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ఆదేశాలు జారీ చేసింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.

jaydev 23102019 3

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తూ, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, టిడిపి పార్టీకి ఓటేసిన సానుభూతిపరులను వేధిస్తూ, వారి పౌర హక్కులకు ఉల్లంఘన కల్గిస్తున్నట్లు తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత, జయదేవ్‌ గల్లా ఈనెల 15న, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కేసులు విచారణ పేరిట, బాధితులనే పోలీసులు వేధిస్తున్నారని, బాధితులను నిస్సహాయులుగా మార్చేస్తున్నారని, వీటికి సంబంధించి, 19 కేసుల వివరాలను, గల్లా జయదేవ్ సమర్పించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని గ్రామాల్లో, దళిత వర్గానికి చెందిన పౌరులను, ఊరి నుంచి వెళ్ళగొట్టిన విషయంలో, మానవ హక్కుల సంఘం పరిగణనలోకి తీసుకుని, చీఫ్ సెక్రటరీ, డీజీపీలను, విచారణ చేసి, నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read