మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డికి ప్రచారంలో తిరుగు ఉండేది కాదు. దీనికి కారణం, జగన్ వ్యూహాలు, వైసిపీ ప్రచారం కంటే, అప్పట్లో ప్రశాంత్ కిషోర్ పన్నిన వ్యూహాలు హిట్ అయ్యాయి. ప్రశాంత్ కిషోర్ తనకు ఉన్న పలుకబడితో, జాతీయ మీడియాలో సైతం జగన్ ను ఒక బాహుబలిగా చూపించే ప్రయత్నం చేసారు. అదే సమయంలో చంద్రబాబు పరిపాలన పై నెగటివ్ కధనాలు ఇప్పించటంలో సక్సెస్ అయ్యారు. అప్పట్లో చంద్రబాబు విధనాలు మెచ్చి దాదపుగా 600 పైగా అవార్డులు వచ్చినా కూడా, జాతీయ మీడియాలో ఎందుకు నెగటివ్ ప్రచారం జరుగుతుందో తెలుగుదేశం పార్టీకి అర్ధమయ్యేది కాదు. అయితే, తరువాత దానికి కారణం ప్రశాంత్ కిషోర్ అని టిడిపి నేతలకు అర్ధమైంది. అయితే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లేకపోవటంతో, నేషనల్ మీడియా ఉన్నది ఉన్నట్టు రిపోర్టింగ్ చేస్తుంది. వాస్తవ పరిస్థితులు చెప్తూ ఉండటంతో, జగన్ పరిపాలన పై జాతీయ మీడియాలో వ్యతిరేక కధనాలు వస్తున్నాయి.

jagan 14092019 1

నిన్న ఒక్క రోజే, ఏకంగా నాలుగు జాతీయ పత్రికల్లో జగన మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ ఎడిటోరియల్స్ వచ్చాయి. ఇందులో "ది ట్రిబ్యూన్" అనే పత్రిక రాష్ట్రంలో ప్రతిపక్షాల మీద జరుగుతున్న దాడుల పై రాసారు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ నేతల పై దాడులు చేస్తూనే, ఆ దాడులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఆందోళన చేపట్టాలని అనుకుంటే, ప్రభుత్వం నిరసన తెలిపే హక్కు కూడా చంద్రబాబుకు ఇవ్వలేదు అంటూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు రాసుకొచ్చాయి. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని, రాజకీయ హింస పెరిగిపోతుందని, మరో పత్రిక రాసింది. ఇక ఎకనామిక్ టైమ్స్ ఎడిటోరియల్ లో, జగన్ గారు, అమరావతిని చంపకండి అంటూ ఆర్టికల్ రాసారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి, అమరావతిని ఏమి చేసారు, ఎలా అన్ని పనులు ఆపి, ఈ రోజు అమరావతిని ఏ పరిస్థితికి తీసుకోవచ్చారో వివరిస్తూ రాసారు.

jagan 14092019 1

ఇక న్యూ ఇండియన్ ఎక్ష్ప్రెస్ కూడా, జగన్ విధానాల పై ఆందోళన వ్యక్తం చేస్తూ, చంద్రబాబు ముద్రలను చేరిపేయాలని కాకుండా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే ఆలోచన జగన్ మోహన్ రెడ్డి చెయ్యలని, రాస్తూ, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు వివరిస్తూ, రాసుకొచ్చారు. ఇలా అనేక విధాలుగా రాష్ట్రం ఎలా నష్టపోతుంది, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాన్ని ఎలా కిందకు పడేస్తుంది వివరిస్తూ కధనాలు రాసాయి. అలాగే గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన 75 శాతం లోకల్ రిజర్వేషన్ల పై, పెద్ద ఎత్తున జాతీయంగా విమర్శలు వచ్చాయి. మరో పక్క విద్యుత్ పీపీఏల విషయంలో కూడా, అన్ని బిజినెస్ ఛానెల్స్, జగన్ విధానం పై విమర్శలు గుప్పించాయి. రోజు రోజుకీ జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాల పై వ్యతిరేక వార్తలు ఎక్కువ అవుతూ ఉండటం పై, ప్రభుత్వ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read