ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, 2012 నుంచి అనేక అటుపోట్లు ఎదుర్కుంటుంది. విభజన సమయంలో ఈ దేశంలో ఉన్న మీడియా మన పక్షాన నిలవలేదు. రాజధాని లేకుండా రోడ్డున పడేస్తున్నా, సానుభూతి చూపించలేదు. ఇక విభజన తరువాత, విభజన హామీలు అమలు పరచకపోయినా, మన వైపు చూడలేదు. కేంద్రంతో, 5 కోట్ల మంది ఎందుకు పోరాడుతున్నారు అనేది ఎవరూ పట్టించుకోలేదు. కానీ, మోడీ చంద్రబాబుని, చంద్రబాబు మోడీని తిట్టినా, అది జాతీయ మీడియాను ఆకర్షించింది. అలాగే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, మీడియా గొంతు నొక్కేస్తూ, మా అనుకూల వార్తలే రాయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఊరుకునేది లేదు అంటూ జీవో 2430 ఇస్తే, ఒక్కరు కూడా జాతీయ మీడియా నుంచి మాట్లాడటలేదు. ఇదేమిటి అని ప్రశ్నించలేదు. కానీ కావాలని ఒక వ్యక్తిని, కొంత మంది జడ్జిలను ఇబ్బందులు పెట్టాలని, ఎలాంటి ఆధారాలు లేకుండా కేసులు వేసారని, హైకోర్టు చెప్తూ, ఆధారాలు లేని ఈ ఎఫ్ఐఆర్ ను ప్రచారం చెయ్యవద్దు అంటూ గ్యాగ్ ఆర్డర్ ఇవ్వగానే, ఎవరో స్పందించండి అని చెప్పినట్టే, వరుస పెట్టి జాతీయ మీడియాలోని కొంత మంది స్పందించిన తీరు చూస్తూ, ఆశ్చర్యం వెయ్యక మానదు.

ఈ పని చెయ్యటానికే, నెలకు 4 లక్షలు జీతం ఇచ్చి, జాతీయ మీడియా అడ్వైజర్ ని పెట్టారని, తెలుగుదేశం ఆరోపిస్తుంది కూడా. అయితే అమరావతి విషయంలో స్పందించిన ఈ జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వాటి పై ఎందుకు స్పందించలేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. జీవో 2430 పై కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ పై కుట్రలు కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఇలాంటి వాటి పై ఎవరూ స్పందించలేదు. అయితే కోర్టులు గ్యాగ్ ఆర్డర్ ఇవ్వటం అనేది కొత్త కాదు. ఎందుకంటే, గతంలో, గతంలో కాదు, ఏడాది క్రితమే, వైఎస్ వివేక కేసు పై ఎక్కడ ప్రచారం చెయ్యకుడు అని, కోర్టుకు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుంది, ఇదే వైసీపీ పార్టీ. ఇదే వైసీపీ పార్టీ ఎమ్మేల్యే అంబటి రాంబాబు పై, ఒక కేసులో, హైకోర్ట్ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది. అంత ఎందుకు ఈ రోజు ఢిల్లీ హైకోర్టు, అన్ని రాష్ట్రాల ఐ అండ్ పీఆర్ వాళ్లకు ఆదేశాలు ఇస్తూ, నటి రకుల్ ప్రీత్ సింగ్ విషయం మీడియాలో ప్రస్తావించవద్దు అని ఆదేశాలు ఇచ్చాయి. గతంలో అమిత్ షా కొడుకు, జే షా పై కూడా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్ వచ్చింది. మరి అప్పుడు లేని బాధ, ఈ సో కాల్డ్ నేషనల్ మీడియా జర్నలిస్టులకు, ఇప్పుడే ఎందుకు వచ్చిందో అనే ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read