ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, అత్యధిక కాంక్రీట్ ఒక్కరోజులో పోసి, ప్రపంచ రికార్డు నెలకొల్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గిన్నిస్ బుక్ లో ఎక్కించిన నవయుగ సంస్థని, కొత్తగా వచ్చిన జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నుంచి, అలాగే పోలవరం హైడల్ ప్రాజెక్ట్ నుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. నవయుగ పనులు అందుకున్న తరువాత, జెట్ స్పీడ్ తో దూసుకెళ్ళిన పనులు, 73 శాతానికి చేరుకున్నాయి. అయితే చంద్రబాబు, నవయుగ కంపెనీకి ఎక్కువ డబ్బులు ఇచ్చి, లంచాలు తీసుకున్నారని జగన్ ఆరోపిస్తూ వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన తరువాత, నవయుగని తప్పించి, రివర్స్ టెండర్ అని చెప్పి, మేఘా కంపెనీకి పనులు అప్పగించారు. అయితే, రివర్స్ టెండరింగ్ లో మేఘా ఒక్కటే పాల్గునటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది పక్కన పెడితే, తమను సరైన కారణం లేకుండా తప్పించారని, నవయుగ ఆరోపించింది.

navayuga 07112019 2

పోలవరం హెడ్ వర్క్స్ విషయంలో, ట్రాన్స్ ట్రాయ్ నుంచి నవయుగ సబ్ కాంట్రాక్టు తీసుకుంది కాబట్టి, ఆ వర్క్ విషయంలో ట్రాన్స్ ట్రాయ్ మాత్రమే కోర్ట్ కు వెళ్ళగలదు, కాని వారు వెళ్ళలేదు. అయితే పోలవరం హైడల్ పవర్ ప్లాంట్ విషయంలో మాత్రం, నవయుగ కంపెనీ డైరెక్ట్ గా తీసుకుంది కాబట్టి, ఆ విషయంలో కోర్ట్ కు వెళ్ళింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్ట్ లో కేసు వేసింది. ఏపి జెన్కో ఆగష్టు 14న ఒప్పందాన్ని రద్దు చేయటంతో, నవయుగ కోర్ట్ కు వెళ్ళటంతో, హైకోర్టు సింగిల్‌ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వుల పై స్టే ఇచ్చారు. అయితే ఆ ఉత్తర్వులు ఎత్తేయాలని, ప్రభుత్వం మరో పిటీషన్ వేయగా, గత 31న సింగిల్‌ జడ్జి స్టే ఎత్తేస్తూ, కొత్త కాంట్రాక్టర్ కు పనులు అప్పగించే విధంగా ఆదేశాలు ఇచ్చారు.

navayuga 07112019 3

అయితే సింగల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల పై, నవయుగ ధర్మాసనం ముందు అప్పీల్‌ కు వెళ్ళింది. ప్రభుత్వం మమ్మల్ని అకారణంగా తొలగించిందని, సరైన కారణాలు చెప్పలేదని, ప్రభుత్వాన్ని వదిలే పని లేదు అంటూ, హైకోర్ట్ ఫుల్ బెంచ్ ముందుకు వెళ్ళింది. తమకు తగిన కారణం చెప్పకుండా, ఏకపక్షంగా ఒప్పందం రద్దు చేసారని, జెన్కో ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్‌ జడ్జి సరిగ్గా పరిశీలించకుండా ఆదేశాలు ఇచ్చారని, నవయుగ పెర్కుంది. ఒప్పందంలో ఉన్న వాటికి విరుద్ధంగా ఈ తొలగింపు జరిగిందనే విషయాన్ని సింగిల్‌ జడ్జి గ్రహించలేదని పేర్కొన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టు పనులు సరిగ్గా జరగలేదన్న వంకతో జల విద్యుత్ కేంద్ర నిర్మాణ కాంట్రాక్టును రద్దు చేసారని, రెండూ వేరు వేరు ఒప్పందాలని, రెండు పనులకు తేడా ఉందని, నవయుగ పేర్కొంది. పూర్తి ఒప్పందాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, కేవలం మధ్యవర్తిత్వ నిబంధన కారణంతో గతంలో ఇచ్చిన స్టేను ఎత్తివేయడం సరికాదు అని అప్పీల్‌లో పేర్కొన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read