వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వ్యాఖ్యలకు సీరియస్ అయ్యారు, ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరిబాలకృష్ణ. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో, స్పీకర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ నేతల్ని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బంట్రోతు అని సంభోదించటాన్ని బాలకృష్ణ తప్పు పట్టారు. దీనికి బదులు ఇస్తూ, ప్రజల విషయంలో అధికార పక్షం అయినా, ప్రతిపక్షం అయినా సరే ప్రజలకు బంట్రోతులే అన్నారు. ప్రజల సేవ విషయంలో మేం బంట్రోతులమే అని, వైసీపీ వాళ్లు అనుకున్నట్లు కాదని, వాళ్ళు ఎవరికీ బంట్రోతులో వారే నిర్ణయించుకోవాలని చురకలంటించారు. వైసీపీ నాయకులు ఎవరికి బంట్రోతులుగా పని చేస్తున్నారో, వారికే తెలుసన్నారు బాలకృష్ణ. తెలుగుదేశం ఎమ్మల్యేలను చంద్రబాబు బంట్రోతులుగా సంభోదించటం కరెక్ట్ కాదన్నారు. అధికార నాయకులు అయినా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అయినా, ఎవరైనా సరే బంట్రోతులుగా మారి ప్రజలకు సేవ చేయాలన్నారు. అలాగే నిన్న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పై కూడా బాలకృష్ణ స్పందించారు . గవర్నర్ చేసిన ప్రసంగంలో అమరావతి ప్రస్తావన ఎక్కడా లేదని విమర్శించారు.

గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరుగుతున్న సందర్భంగా తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు చెప్పిన విషయం తెలిసిందే. కానీ, స్పీకర్ మీద ఉన్న గౌరవంతో ప్రతిపక్షం తరఫున డిప్యూటీ లీడర్ అయిన అచ్చెన్నాయుడును పంపామని చంద్రబాబు అన్నారు. ఇదే అంశం పై తరువాత మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తీవ్ర విమర్శలు చేసారు. చంద్రబాబు రాకుండా ఆయన బంట్రోతును పంపారు అంటూ అచ్చెన్నాయుడును ఉద్దేశించి అన్నారు. దీని పై అసెంబ్లీలో వాదోపవాదనలు జరిగాయి. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను అయిన తనను బంట్రోతు అనడం దారుణం అంటూ, అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలిపారు. ‘నేను చంద్రబాబు బంట్రోతు అయితే, మీ 151 మంది జగన్ బంట్రోతులా ?’ అంటూ అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. దీని పై బాలయ్య స్పందిస్తూ, వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read