ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ రోజు మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఉత్తర్వులను అమలు చేయక పోవటం పై, రాష్ట్ర ప్రభుత్వం పై సీరియస్ అయ్యింది. రాజమండ్రికి చెందిన బీఈడీ అధ్యాపకుడు రత్నకుమార్ అంశం పై, గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులు అమలు చేయకపోవటంతో, ఆయన ఇటీవల హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేసారు. అప్పట్లో విద్యా శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాద్ దాస్, అంటే ఇప్పటి చీఫ్ సెక్రటరీ, అలాగే పదవీ విరమణ చేసిన మరో అధికారి ఉదయలక్ష్మీని ఆ పిటీషన్ లో బాధ్యులుగా చేర్చారు. అయితే తాము ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవటం, ఇన్ని రోజులు అయినా నిర్ల్యక్షంగా వ్యవహరించటం పైన హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసులో రిటైర్డ్ అధికారి ఉదయలక్ష్మీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటమే కాకుండా, ఆమెను వచ్చే వాయిదా నాటికి కోర్టులో హాజరు పరచాల్సిందిగా హైకోర్టు, గుంటూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. అదే విధంగా నాటి విద్యాశాఖ ప్రినిసిపల్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాద్ దాస్ ను కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా, హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే వాయిదా నాటికి ఉత్తర్వులు అమలు చేయాలని , అమలు చేసి తీరాల్సిందే అని చెప్పి హైకోర్టు ఆదేశించింది.

hc 15062021 2

కోర్టు ధిక్కరణ పిటీషన్ కు సంబంధించి, అధికారులు నిర్ల్యక్షంగా వ్యవహరిస్తే సహించేది లేదని, హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను, అమలు చేయకుండా ఎలా ఉంటారని చెప్పి, అధికారులు తరుపున హాజరు అయిన న్యాయవాదిని ఈ రోజు ప్రశ్నించింది. ప్రభుత్వం తరుపున ఒక న్యాయవాది హాజరు కాగా, ఉదయలక్ష్మి తరుపున ఎవరూ హాజరుకాక పోవటంతో, హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇక మరో కేసులో, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నీలం సాహనీ నియామకం చెల్లదని పిటీషన్ దాఖలు అయ్యిన సందర్భంలో, ఈ పిటీషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో పాటు, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా ఉన్న నీలం సహానీ కి కూడా నోటీసులు జారీ చేసి, కేసుని వాయిదా వేసింది. ఈ పిటీషన్ ను విశాఖకు చెందిన ఒక వ్యక్తి వేస్తూ, నీలం సాహనీ రిటైర్డ్ అయిన వెంటనే, ఈ పదవిలో వచ్చారని, గతంలో ఉన్న తీర్పులు ఉదాహరించారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం, నీలం సాహనీకి నోటీసులు జారీ చేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read