ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి సమీర్ శర్మను నియమిస్తూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ నెల 30వ తేదీతో, ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాద్ దాస్ పదవీ విరమణ చేస్తున్నారు, ఆయన పదవీ కాలం ఇప్పటికే ముగిసినా, కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకుంది, మూడు నెలల పొడిగింపుని రాష్ట్ర ప్రభుత్వం పొందింది. అయితే ఆయనకు మరో మూడు నెలలు పొడగింపు ఇచ్చే అవకాసం ఉన్నా కూడా, ప్రభుత్వం ఆయనకు పొడిగింపు ఇచ్చేందుకు విముఖత చూపినట్టు తెలిసింది. దీంతో ఆయన ఈ నెల 30వ తేదీతో పదవీ విరమణ చేయనున్నారు. ఇటీవలే ఢిల్లీ నుంచి డెప్యుటేషన్ పై సమీర్ శర్మ , ఢిల్లీ నుంచి ఏపి సర్వీస్ లకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రణాళికా విభాగం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. దీంతో ఆయన్ను వచ్చే నెల ఒకటో తేదీ నుంచి, నూతన ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 1480ని ప్రభుత్వ ప్రినిసిపల్ సెక్రటరీ ముత్యాల రాజు విడుదల చేసారు. అయితే సమీర్ శర్మ కూడా ఈ ఏడాది నవంబర్ లోనే పదవీ విరమణ చేయబోతున్నారు. అయితే ఆయనకు కూడా కేంద్రం నుంచి అనుమతి తీసుకుని, మూడు నెలల వరకు పదవి పొడిగించే అవకాసం ఉంది.

sameer 10092021 2

లెక్క ప్రకారం చూస్తే, సమీర్ శర్మ కూడా కేవలం రెండు నెలల మాత్రమే ఆయన పదవీ బాధ్యతులు చేపట్టే అవకాసం ఉంది. ఆ తరువాత ప్రభుత్వం ఇష్టం మేరకు, మూడు నెలల వరకు పదవి పొడిగించే అవకాసం ఉన్నట్టు చెప్తున్నారు. సమీర్ శర్మ, ప్రస్తుతం చీఫ్ సెక్రటరీగా ఉన్న ఆదిత్యనాథ్‌ దాస్‌ కంటే రెండేళ్ళు సీనియర్. సమీర్ శర్మ 1985 బ్యాచ్‌కు చెందిన వారు. అయితే సమీర్ శర్మ మొన్నటి వరకు కేంద్ర సర్వీస్ లలో ఉండే వారు. కేంద్రంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ ఎఫైర్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పని చేసారు. అంత మంచి పదవిలో ఉన్న సమీర్ శర్మ, అకస్మాత్తుగా డిప్యుటేషన్ పై ఏపి రావటం, ఇప్పుడు కేవలం రెండు నెలల కాలానికి చీఫ్ సెక్రటరీ అవ్వటం పై, రాష్ట్ర ఐఏఎస్ క్యాడర్ లో చర్చ జరుగుతుంది. కేంద్ర సంస్థకు డైరెక్టర్‌ జనరల్‌ పదవిలో ఉండి, రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ చేయటం పై, చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కొత్త చీఫ్ సెక్రటరీకి ప్రస్తుతం అనేక సమస్యలు స్వాగతం పలుకున్తున్నాయి. ముఖ్యంగా అప్పుల విషయంలో ఆయనకు సవాల్ అనే చెప్పాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read