34 ఏళ్ళ తరువాత నూతన జాతీయ విద్యా విధానం తీసుకువచ్చింది కేంద్రం. జాతీయ విద్యా విధానంలో కీలక మార్పులు చేస్తూ, ఈ రోజు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 34 ఏళ్ళు తరువాత, అనేక కొత్త సంస్కరణలు తీసుకు వస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న 10+2+3 విధానంలో మార్పులు చేసారు. ఇప్పటి వరకు పదవి తరగతి, ఇంటర్, తరువాత డిగ్రీ మూడేళ్ళు ఉండేది. ఇక నుంచి డిగ్రీ నాలుగు ఏళ్ళు ఉంటుంది. అలాగే మూడేళ్ళ నుంచి 18 ఏళ్ళ వరకు విద్యను కంపల్సరీ చేసారు. ప్రతిభి ఉన్న వారిని వెలికి తీసేలా ఉండే గైడ్ లైన్స్ కూడా తెచ్చారు. ఇక మరో కీలకమైన విషయం ఏమిటి అంటే, 5వ తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధన ఉండాలని, కేంద్రం నిర్ణయం తీసుకుంది. మాతృ భాష, ప్రాంతీయ భాషల్లో విద్యా బోధన ఉండాలని, తన గైడ్ లైన్స్ లో కేంద్రం తెలిపింది. వీలు అయితే, 8వ తరగతి వరకు కూడా, మాతృ భాషలోనే విద్యా బోధన ఉండేలా చూడాలని, కేంద్రం స్పష్టం చేసింది.

మాతృ భాషలో విద్యా బోధన ద్వారానే, మరింత తేలికగా విద్యార్ధులకు సబ్జెక్ట్ వస్తుందని, పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జగన్ సర్కార్ కు ఇబ్బంది అనే చెప్పాలి. ఇప్పటికే ఈ విషయం పై చట్టాలు ఉన్నా, అవేమీ పట్టించుకోకుండా, అందరికీ ఇంగ్లీష్ విద్య అంటూ, తెలుగు మీడియం అనే ఆప్షన్ లేకుండా, ప్రభుత్వం వెళ్తున్న తీరు పై, ఇప్పటికే కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడు కేంద్రం కూడా, మాతృ భాషలో విద్యా బోధన గురించి కొత్త గైడ్ లైన్స్ ఇవ్వటంతో, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి. ఎవరి ఇష్టం వచ్చిన మీడియం వారు చదువుకోకుండా, మేము చెప్పినట్టే వినాలి అనే రాష్ట్ర ప్రభుత్వం ధోరణి, ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఎలా ఉంటుందో చూడాలి. కేంద్రం తెచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం మన రాష్ట్రంలో తెలుగు మీడియం ఉండాల్సిందే. తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, కేవలం ఇంగ్లీష్ పెట్టాలని, చూస్తున్న జగన్ ప్రభుత్వానికి, ఇది షాక్ లాంటిదే. అసలు ఇప్పటికీ అర్ధం కాని విషయం, తెలుగు, ఇంగ్లీష్ రెండు ఆప్షన్ ఎందుకు ఇవ్వరు ? ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకుంటారు కదా ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read