ఎప్పటి నుంచో వినిపిస్తున్న గవర్నర్ మార్పు, ఎట్టకేలకు కుదిరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా, విశ్వభూషణ్‌ హరిచందన్‌ను నియమిస్తూ, రాష్ట్రపతి రాంనాద్ కోవింద్ ఉత్తర్వవులు జారీ చేసారు. 1988 నుంచి ఆయన బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నారు. సంఘ్ పరివార్ తో కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది. రచయతగా కూడా ఆయన అనేక పుస్తకాలు రాసారు. విశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారు. అవినీతి పై పోరు, మొక్కలు పెంపకం పై తనకు ఎనలేని ప్రేమ అని, తనకు ఇష్టమైన టాపిక్స్ ఇవి అంటూ చెప్తూ ఉంటారు. అలాగే ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా సుశ్రి అనసూయను ఖరారు చేశారు. అయితే తెలంగాణా రాష్ట్రానికి మాత్రం ఎలాంటి మార్పు చెయ్యకపోవటంతో, నరసింహన్ గారే కొనసాగనున్నారు.

మరో పక్క నరసింహన్ సుదీర్ఘ కాలంగా ఉమ్మడి రాష్ట్రానికి, రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా గవర్నర్ గా పని చేసారు. అప్పట్లో సోనియా గాంధీతో కలిసి, రాష్ట్ర విభజన చేసారని, తరువాత మోడీతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసారనే, రాజకీయ విమర్శలు తరుచు వస్తు ఉండేవి. చంద్రబాబుని ఓడించటం కోసం, ముఖ్య పాత్ర అంతా గవర్నర్ దే అన్న వాదన కూడా వినిపిస్తూ ఉండేది. చంద్రబాబు కూడా ఒకానొక సమయంలో నరసింహన్ పై బహిరంగ విమర్శలు కూడా చేసారు. మోడీకి, చంద్రబాబుకి చెడటానికి కూడా కారణం నరసింహన్ అనే వాదన కూడా వినిపిస్తూ ఉండేది. మొత్తానికి, చాలా ఏళ్ళ తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్ వస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read