అమరావతికి వ్యతిరేకంగా నిన్న కొంత మంది వేరే ప్రాంతం వారు, ఆటల్లో వచ్చి, అమరావతిలో ధర్నా కార్యక్రమం చేస్తున్న క్రమంలో, అమరావతి రైతులు, మహిళలు వారిని అడ్డుకుని, మీరు ఎవరు ? మా ఊరు వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు ? మిమ్మల్ని ఎవరు ఆటోల్లో తోలోకోస్తున్నారు, అంటూ వారిని అడ్డుకున్న సంగతి తెలిసిందే. నిన్న మరో పక్క ఒక వీడియో కూడా, వీరికి ఏమి మాట్లాడాలో ట్రైనింగ్ ఇస్తున్న వీడియో బయట పడటంతో, వీళ్ళు పైడ్ బ్యాచ్ అని తేలిపోయింది. ఇక మరో పక్క నిన్న కృష్ణాయపాలెంలో వీరిని అడ్డుకున్న వారి పై, ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు. మొత్తం 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ 11 మందిలో కొంత మంది దళితులు కాగా, మరి కొంత మంది బీసిలు. అమరావతి రైతులను అరెస్ట్ చేయటంతో, పెద్ద ఎత్తున దళిత సంఘాలు, అమరావతి రైతులు, పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. బయట నుంచి మా ప్రాంతంలో అల్లర్లు చేయాలనీ చూస్తున్న వారిని కాకుండా, మా పై కేసులు పెట్టటం ఏమిటి అంటూ, ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీరికి తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలిచింది. స్థానిక నాయకులు వారికి మద్దతు తెలిపారు. రైతుల పై అక్రమంగా కేసు పెట్టటం పై, నిరసన తెలిపారు. డీఎస్పీ వాహనానికి కూడా అడ్డు తగిలి, దళిత సంఘాలు నిరసన తెలిపాయి. అయితే ఈ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు పెట్టిన ఈపూరి రవి అనే వ్యక్తీ పోలీస్ స్టేషన్ కు వచ్చి, తాను కేసు వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు.

ఈపూరి రవి అనే వ్యక్తి కూడా కృష్ణాయపాలెంకు చెందిన వ్యక్తే. అయితే తాను కేసు వెనక్కు తీసుకుంటున్నానని ఆయన ముందుకు వచ్చారు. తాను ఫిర్యాదులో కూడా, ఆటోలను ఆపారు అని, వారి పై చర్యలు తీసుకోండి అని మాత్రమే తాను ఫిర్యాదు చేసానని, ఎక్కడా ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టమని కోరలేదని, పోలీసులే నమోదు చేసారని, అందుకే ఈ కేసు అనవసరంగా పక్కదోవ పడుతుందని కాబట్టి, తాను వెనక్కు తీసుకుంటానని కోరారు. సాధారణంగా అటోలను ఆపారు అని మాత్రమే కంప్లైంట్ ఇచ్చానని, తెలిపారు. ఇదే విషయం ఆయన లేఖ రాసి, పోలీసులకు ఇచ్చారు. అయితే పోలీసులు మాత్రం ఈ విషయం పై, స్పందించటం లేదు. మీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఇప్పటికే కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేసామని, ఇక మేము కేసు వెనక్కు తీసుకునేది ఉండదని, మీరు ఇరు వర్గాలు వెళ్లి కోర్టులో తేల్చుకోండి అంటూ పోలీసులు తేల్చి చెప్పారు. అయితే తానూ ఎస్సి, ఎస్టీ కేసు పెట్టమని తాను కోరలేదని, మీరు కేసు పెట్టారు కాబట్టి, తాను వెనక్కు తీసుకుంటాను అని చెప్పినా, పోలీసులు మాత్రం కోర్టులోనే తేల్చుకోవాలని చెప్పారు. పోలీసులు ఇలా చేయటంతో, మంగళగిరి అంబేడ్కర్ విగ్రహం వద్ద, పోలీసుల తీరుకు నిరసనగా దళిత సంఘాలు నిరసన చేపట్టాయి. మరి ఈ కేసు ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read