మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై, వైసిపి శ్రేణులు, సానుభూతి పరులు చేసిన దా-డికి సంబంధించి ఇప్పటికే అనేక వీడియోలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన సిసి ఫూటేజ్ లో చాలా దృశ్యాలు అందరూ చూసారు. అవి సిసిటీవీ ఫూటేజ్ కావటంతో, దూరం నుంచి ఆ దృశ్యాలు చూస్తుంటే, ఆ దా-డి జరిగిన తీరు చూసి అందరూ షాక్ అయ్యారు. అయితే, ఇప్పుడు ఒక వీడియో బయటకు వచ్చింది. అది మామూలు వీడియో కాదు. కోపం ఉంటేనో, లేక బాధ ఉంటేనో, లేదా బీపీ పెరిగితేనో ఇలా దా-డి చేయరు అని ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. ఈ కొత్త వీడియో ఈ రోజు విడుదల అయ్యింది. ఆ వీడియోలో ఉన్మాదులు ఉన్నారు. ఉగ్రవాదులను మనం దగ్గరగా చూడలేదు కానీ, ఉన్మాదులు అంటే ఇలాగే ఉంటారేమో అనేలా ప్రవర్తించారు. ఉన్మాదులు లాగా పార్టీ ఆఫీస్ మీద పడి, చేతిలో పెద్ద పెద్ద దుంగలు పట్టుకుని స్వైర విహారం చేసారు. పార్టీ ఆఫీస్ బయట ఉన్న కారు అద్దాలు పగలు గొట్టారు, పెద్ద పెద్దగా అరుస్తూ, కొట్టు కొట్టు అంటూ ఉన్మాదులు లాగా ప్రవర్తిస్తూ ఉన్న వీడియో, స్పష్టమైన వీడియో ఇప్పుడు బయట పడింది. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు చూస్తుంటే, నిజంగా అందులో ఉన్నది మామూలు మనుషులేనా, లేక మత్తు కోసం కొత్త కొత్త పదార్దాలు ఏమైనా సేవించి వచ్చారా అనే అనుమానం కలుగుతుంది.

delhicbn 25102021 2

అయితే ఈ వీడియో తీసింది ఎవరు అనేది మాత్రం తెలియటం లేదు. ఆ ఉన్మాదులే తమ ఘనకార్యాలు తమ ఫోన్ తో వీడియో తీసుకున్నారు అనే విషయం అర్ధం అవుతుంది. అయితే ఈ వీడియోలో పగలగొట్టిన కారు, తెలుగు యువత నాయకుడు కారుగా తెలుస్తుంది. అయితే చంద్రబాబు నాయుడు, ఢిల్లీలో ఈ దా-డు-లు పై ఫిర్యాదు చేయటానికి వెళ్ళిన సమయంలోనే ఈ వీడియో బయటకు వచ్చింది. అన్ని వీడియోలు ఒక లెక్క అయితే, ఈ వీడియో మాత్రం భయానకరంగా ఉంది. ఈ వీడియో చూసిన వారు మాత్రం షాక్ కు గురి కాక తప్పదు. అలా ఉంది వీడియో. ఎంత ప్రణాళిక ప్రకారం, ఈ దా-డి చేసారో ఈ వీడియో చూస్తుంటే అర్ధం అవుతుంది. చంద్రబాబు ఈ వీడియోని కూడా రాష్ట్రపతికి పంపించాలని కోరుతున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డి అంటున్నట్టు, ఇది బీపీ పెరిగి చేసిన అటాక్ కాదు, ఇది కచ్చితంగా ప్రీ ప్లాన్డ్ గా జరిగిన దా-డి గా అర్ధం అవుతుంది. ఈ వీడియోలో మరింత స్పష్టంగా మనుషులు మొఖాలు కనిపిస్తున్నాయి. మరి పోలీసులు ఇప్పుడైనా వారిని అరెస్ట్ చేస్తారో లేదో చూడాలి. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు https://twitter.com/iTDP_Official/status/1452593454651822085

Advertisements

Advertisements

Latest Articles

Most Read