తమ `ప్రత్యర్ధులపై ఫేక్ న్యూస్ సృష్టించి, రాజకీయంగా లాభ పొందటం, కొన్ని రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. మన రాష్ట్రంలో అలాంటివి కొంచెం ఎక్కువే. ఈ అతితోనే, ఏకంగా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాతలు రాస్తున్న వారి పై, హైకోర్టు కలుగ చేసుకుని, ఏకంగా సిబిఐ కేసు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టు సీరియస్ అయినా, సిబిఐ ఎంక్వయిరీకి ఆదేసించినా, కొంత మంది మాత్రం ఇంకా రేచ్చిపోతూనే ఉన్నారు. తమకు ఎవరు అడ్డు వస్తే వారి పై, తప్పుడు కధనాలు అల్లటం, వారి పరువు ప్రతిష్టలను దెబ్బ కొట్టటం, చాలా మామూలు విషయం అయిపొయింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షాలు, ఇలాంటి వాటి పై ఫిర్యాదు చేస్తుంటే పోలీసులు వైపు నుంచి పెద్దగా స్పందన రావటం లేదు కానీ, అధికార పక్షం నుంచి ఏదైనా కేసు వస్తే మాత్రం, వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఫేక్ కధనాల బారిన, ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ కూడా పడ్డారు. ఆయన పై ఇప్పటికే అనేక విధాలుగా, ఒక సెక్షన్ అఫ్ మీడియాలో కధనాలు వస్తుంటే, సోషల్ మీడియాలో శ్రుతిమించి కధనాలు వస్తున్నాయి. తాజాగా ఒక వెబ్సైటులో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై తప్పుడు కధనాలు రాసారు. మంత్రి పేర్ని నాని చెప్పారు అంటూ, ఆ తప్పుడు కధనం సారాంశం.

nimmagadda 01112020

నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదివిని మళ్ళీ తెచ్చుకోవటానికి, వందల కోట్లు ఖర్చు చేసారని, పేర్ని నాని ఈ విషయం చెప్పారు అంటూ సదరు వెబ్సైటు కధనాలు రాసింది. అయితే ఈ వార్త వైరల్ కావటంతో, ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. ఇలాంటి ఫేక్ ప్రచారాల పై కఠినంగా ఉండే నిమ్మగడ్డ, వెంటనే విజయవాడలో ఈ వార్తపై కంప్లైంట్ ఇచ్చారు. తమ పరువుకు భంగం కలిగిస్తూ వస్తున్న ఈ వార్త పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఈ వార్తను పేర్ని నాని చెప్పారు అంటూ, ఆ వెబ్సైటు రాసింది. అయితే మంత్రి పేర్ని నాని ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, మీడియాలో హైలైట్ అయ్యేది. మరి మంత్రి గారు, ఆ వెబ్సైటుతో డైరెక్ట్ గా ఈ విషయం చెప్పారా ? అనేది తెలియాల్సి ఉంది. మరి పోలీసులు ఈ విషయం పై ముందుకు వెళ్తారా లేదా అనేది చూడాలి. రాజ్యాంగా వ్యవస్థ పై ఇలాంటి కధనాలు రాస్తుంటే, పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఒక వేళ నిజంగా మంత్రి పేర్ని నాని, ఈ వ్యాఖ్యలు అని ఉంటే, ఆయన పైనా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మంత్రి గారు ఆ మాటలు అనకుండా, ఈ వెబ్సైటు వేస్తె, మంత్రి గారు కూడా ఆ వెబ్సైటు పై, చర్యలు తీసుకోమని చెప్పాలి. మొత్తానికి ప్రతి రెండు రోజులకు ఏదో ఒక విధంగా ఎలక్షన్ కమిషన్ వ్యవహారం వార్తల్లో ఎక్కుతూనే ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read