నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్, జీవోలు హైకోర్ట్ కొట్టేయటంతో, నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు తీసుకుంటూ, ఉత్తర్వులు వచ్చాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, ఇది కుదరదు అంటూ, ఏకంగా హైకోర్ట్ తీర్పునే, తమకు అనుకూలంగా చెప్పుకుంటుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలను చేపట్టడం నిబంధనలకు విరుద్దమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డ కోర్టు తీర్పు అనంతరం వ్యవహరించిన తీరు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఆటోమెటిక్ గా కమిషనర్‌గా కొనసాగవచ్చునని హైకోర్టు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదన్నారు. నిమ్మగడ్డ మళ్లీ తనకు తాను మళ్లీ వదవిలోకి వచ్చినట్లు ప్రకటించడం తప్పు అన్నారు.

ఆయన తాను బాధ్య తలు చేపట్టినట్లు ప్రకటించుకుని స్టాండింగ్ కౌన్సిల్ లో ఉన్న ప్రభాకరను రాజీనామా చేయాలని ఫోన్ ద్వారా ఆదేశించారన్నారు. స్టాండింగ్ కౌన్సిల్లో కొత్తరక్తం కావాలని నిమ్మగడ్డ తెలిపారన్నారు. రేపే రాజీనామా చేయాలని ప్రభాకర్‌కు సూచించారన్నారు. తనకు వ్యవధి కావాలని ప్రభాకర్ కోరినప్పటికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలన్నారు. ఆయన తనను సంప్రదించారన్నారు. నిమ్మగడ్డ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్‌గా కనగరాజను గవర్నర్ నియమించారన్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను కొట్టివేసిందని శ్రీరామ్ తాము కోర్టు తీర్పులను గౌరవిస్తామన్నారు. రమేష్ కుమార్ నియామకంలోనే చట్ట పరమైన ఉల్లంఘనలు ఉన్నాయని శ్రీరామ్ వ్యాఖ్యానించారు.

సుప్రీం కోర్టుకు వెళ్లేవరకు హై కోర్టు తీర్పును స్టే చేయాలని కోరామని ఆయన వివరించారు. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు తెలియజేసామన్నారు. ఎస్ఈసీ నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే, గవర్నరకు నియామకం చెల్లదంటే నిమ్మగడ్డకు అదే నిబంధన వర్తిస్తుందన్నారు. ఆయనను కూడా గత ప్రభుత్వం సూచనల మేరకు అప్పటి గవర్నర్ నియమించారన్నారు. హైకోర్టు తీర్పును ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నామన్నారు. నిమ్మగడ్డ కొనసాగింపుకు సంబంధించి హైకోర్టు ఎటువంటి నిర్దిష కాల పరిమితిని పేర్కొనలేదన్నారు. ఈ అంశంపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు కనీసం రెండు నెలలు అవకాశం ఉంటుందన్నారు. అయితే ప్రభుత్వం చెప్తున్న వాదన పై, భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్ట్ తీర్పులో స్పష్టంగా, ‘‘స్టాండ్ రెస్టోర్డ్’’ అనే పదం వాడారు అని, అంత స్పష్టంగా ఉన్నా, ప్రభుత్వం కావాలని వక్రభాష్యం చెప్తుందని అన్నారు. కోర్టుల తీర్పుని, ఇది వక్రీకరించటమే అని, దీనికి కోర్టు సరైన సమాధానం చెప్తుంది అని అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read