ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి, వ్యవస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా శాసనమండలి, హైకోర్టు, ఎన్నికల కమిషన్ లాంటి అతి ముఖ్యమైన రాజ్యాంగ వ్యవస్థలతో, ప్రభుత్వ వైఖరి అభ్యంతరకరంగా ఉందని అనేక సార్లు విశ్లేషణలు వచ్చాయి. అయినా ప్రభుత్వం మారటం లేదు. ప్రతి రోజు ఏదో ఒక అంశం తెర మీదకు వస్తూనే ఉంది. చివరకు హైకోర్టు మీద చేస్తున్న కుట్రకు, సిబిఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో గత వారం పది రోజలుగా, ఎన్నికల కమిషన్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల నిర్వహరణలో బేధాభిప్రాయలు వచ్చాయి. హైకోర్టు ఆదేశాల ప్రకారం, ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయ్యింది. మొదట్లో అంటే వైరస్ ని ఎలా ఎదుర్కోవాలో తెలియక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు ఈ వైరస్ అంటే అందరికీ తెలిసి పోయింది. చివరకు సినిమా హాల్స్, స్కూల్స్ లాంటివి కూడా తెరుచుకోమని ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. మరి ఎన్నికలు జరపటానికి మాత్రం వెనకడుగు ఎందుకు వేస్తుందో తెలియదు. హైకోర్టు కూడా ఇదే ప్రశ్న అడిగింది. పక్క రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలే నిర్వహిస్తున్నాయి కదా అని ప్రశ్నించింది. ఈ నేపధ్యంలోనే అందరితో సంప్రదింపులు జరిపిన ఎన్నికల కమిషన్, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు సిద్ధం అయ్యారు. ఇదే విషయం పై ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీని పై తాము అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని అనుకుంటున్నామని చీఫ్ సెక్రటరీకి రెండు సార్లు లేఖ రాసారు. సహకరించకపోవటంతో, గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసారు.

nimmagadda 24112020 2

అయినా ఎలాంటి మార్పు లేకపోవటంతో మళ్ళీ హైకోర్టు మెట్లు ఎక్కాలని అనుకున్నారు. దీనికి సంబంధించి వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ రోజు మరోసారి చీఫ్ సెక్రటరీకి లేఖ రాసారు. ఈ సారి పకడ్బంధీగా లేఖలో అంశాలు ఉన్నాయి. తాము ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నామని, దీనికి ప్రభుత్వ సహకారం కావాలని లేఖలో రాస్తూ, గత నెల 3వ తారిఖు ఇదే అంశం పై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని జత పరిచి చీఫ్ సెక్రటరీకి పంపించినట్టు సమాచారం. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీ తమకు సోమవారం అందింది అని, అందులో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో తమకు తెలపాలని కోరారని, ఎన్నికల సంఘం అభ్యర్ధన పై ప్రభుత్వం కావాల్సిన ఆన్ని సహకారాలు అందించాలని హైకోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలు అమలు చేసేలా చూడాలని హైకోర్టు చీఫ్ సెక్రటరీని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేసారు. దీంతో ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్, తాము ఇచ్చిన ఆదేశాలు కాకుండా, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇన్నాళ్ళు రమేష్ కుమార్ ని లెక్క చేయని ప్రభుత్వం, ఇప్పుడు హైకోర్టు ఆదేశాల పై ఎలా స్పందిస్తుందో చూడాలి. రమేష్ కుమార్ రాసిన లేఖ పై ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎలా స్పందిస్తారో మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read