ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ షెడ్యుల్ ప్రకటించటంతో, ఆయన తన అధికారులను ఉపయోగిస్తున్నారు. తోక జాడిస్తున్న అధికారుల పై వేటు వేసే ప్రక్రియ ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదటి వికెట్ పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై క్రమశిక్షణ చర్యలను ఈ రోజు ఎన్నికల కమిషన్ తీసుకుంది. కొద్ది సేపటి క్రితం ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబందించిన షెడ్యుల్ విడుదల చేసి, ప్రొసీడింగ్స్ ఇవ్వటంతో, ఎన్నికల సంఘం సెక్రెటరీ నుంచి కింద స్థాయి ఉద్యోగులు ఎవరూ కూడా, సెలవు పై వెళ్ళకూడదు అని చెప్పి, ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే అందుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్, సాయి ప్రసాద్, 30 రోజుల పాటు సెలవు పై వెళ్ళటమే కాకుండా, ఇతర ఉద్యోగులను కూడా సెలవు పై వెళ్ళాలని చెప్పినట్టు, ఆయన పై అభియోగాలు నమోదు అయ్యాయి. దీనికి సంబంధించి, ఎన్నికల కమిషన్ నిర్వహించిన విచారణలో ఇది నిజమే అని తేలటంతో, ఆయన తీసుకున్న చర్యలు అన్నీ ఎన్నికలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని, కూడా ఎన్నికల కమిషన్ తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించింది. ఈ నేపధ్యంలోనే సాయి ప్రసాద్ ని ఎన్నికల విధులు నుంచి తొలగించటంతో పాటుగా, ఇతర విధుల్లో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, విధులు నిర్వహించేందుకు వీలు లేదు అని కుడా ఆ ఉత్తర్వుల్లో ఎన్నికల కమిషన్ పేర్కొన్నారు. కొద్ది సేపటి క్రితం ఆ ఉత్తర్వులు వెలువడ్డాయి.

rameshkumar 11012021 2

రెండు రోజుల క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం అని, సెక్రటరీ, సీనియర్ ఉద్యోగులంతా ఎన్నికల ప్రధాన కార్యాలయంలోనే అందరినీ అందుబాటులో ఉండాలని ముందే ఆదేశాలు ఇచ్చామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ తన ఉత్తర్వుల్లో తెలిపారు. జాయింట్ డైరెక్టర్ ఈ క్రమశిక్షణారాహిత్య పనులు తన ఛాంబర్ నుంచే చేశారని, దీని తీవ్రమైన నేరంగా పరిగణించాం అని, ఎన్నికల నియమావళికి, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన సాయిప్రసాద్ ఇలా ఉల్లంఘనలకు పాల్పడటం సీరియస్‍గా తీసుకున్నాం అని ఉత్తర్వుల్లో తెలిపారు నిమ్మగడ్డ. అయితే ఈ చర్యతో అయినా, ఉద్యోగులు ఇక నుంచి , ఎన్నికలు జరిగే వరకు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారేమో చూడాలి. ఇక మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వం వేసిన హౌస్ మోషన్ పిటీషన్ ని, వెకేషన్ బెంచ్ ఈ రోజు విచారణకు తీసుకుని. ఈ రోజు దీని పై 2.30 గంటలకు దీని పై విచారణ చేయనుకుంది. అయితే హైకోర్టు ఈ ఎన్నికల షెడ్యుల్ పై స్టే ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వ వాదనతో మొగ్గు చూపుతుందా అనేది చూడాల్సి ఉంది. ఏది జరిగినా, ఈ విషయం మళ్ళీ సుప్రీం కోర్టు వరకు వెళ్తుంది. మరి అక్కడ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ఇలాంటివి అన్నీ సస్పెన్స్ గా మారాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read