రాష్ట్రమంతటిదీ ఒకదారి అయితే, జగన్మోహన్ రెడ్డి తనది మరోదారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడని, విద్యార్థుల చదువులకు సంబంధించిన పరీక్షలను, వారి జీవితాలకు విషమపరీక్షలుగా ఈ ముఖ్యమంత్రి మార్చాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లా డారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ఈ ప్రభుత్వం మొండిగా, మూర్ఖంగా వ్యహరిస్తోందన్న రామానాయుడు, 15లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉన్నారని, వారి కుటుంబసభ్యులతో కూడా దాదాపు 60లక్షలమందిని, 30 నుంచి 40వేలమంది ఉపా ధ్యాయులు, లెక్చరర్లను వారి కుటుంబాలను ముఖ్యమంత్రి తన మూర్ఖత్వానికి బలి తీసుకోబోతున్నాడన్నారు. వారితో పాటు, పారిశుధ్యకార్మికులు, విద్యా సంస్థల్లో పనిచేసే బోధనేతర సిబ్బంది కలిపీ దగ్గర దగ్గర 90 లక్షల కుటుంబాల వరకు కో-వి-డ్ వైరస్ బారినపడే ప్రమాదం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోందన్నారు. ఇంత తెలిసీకూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా విద్యార్థులకు పరీక్షలు పెట్టి తీరుతాననడం మూర్ఖత్వం కాక ఏమవుతుం దన్నారు. తెలంగాణ సహా, పదిరాష్ట్రాల ప్రభుత్వాలు పది, ఆపై తరగతులు పరీక్షలు, ఇతరత్రా పోటీ పరీక్షలను వాయిదా వేయడం జరిగిందన్నారు. దేశంలో 10లక్షల కో-వి-డ్ కేసులతో, ఏపీ 6వస్థానంలో ఉందన్ననిమ్మల, తొలి 5స్థానాల్లోఉన్న అన్నిరాష్ట్రాలు పరీక్షలను ఇప్పటికే వాయిదా వేయడం, రద్దుచేయడం చేశాయన్నారు. జగన్మో హన్ రెడ్డి తనఫ్యాక్షన్ స్వభావంతో, మొండిపట్టుదల తో విద్యార్థులు, వారి కుటుంబాలజీవితాలతో చెలగాటమా డుతున్నాడని టీడీపీ నేత మండిపడ్డారు. పరీక్షలు నిర్వహి స్తే హాజరవ్వాలా వద్దా అనేఅంశంలో కూడా విద్యార్థులు సందిగ్ధావస్థలో ఉన్నారన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో పదో తరగతి పరీక్షలకు సంబంధించినదంటూ మోడల్ పేపర్ ఒకటి బయటకొచ్చిందని, అదిచూశాక పదోతరగతి విద్యార్థు లు మరింత గందరగోళానికి గురవుతున్నారన్నారు.

గతంలో ఒక్కో సబ్జెక్ట్ కి రెండు ప్రశ్నపత్రాలను (ఒక్కోటి 50మార్కులకు) ఇచ్చేవారని, ఇప్పుడు ఒక ప్రశ్నపత్రాన్నే 100 మార్కులకు పెడుతున్నట్లు ప్రభుత్వం చెప్పిందన్నా రు. ప్రశ్నపత్రంలో ఎన్నిమార్కుల ప్రశ్నలు ఎన్నిఉంటాయో , ఎటువంటి అవగాహనలేకుండా విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారో ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి సమాధానంచెప్పాల ని నిమ్మల డిమాండ్ చేశారు. క-రో-నా దృష్ట్యా విద్యాసంవత్సరాన్ని కుదించిన ప్రభుత్వం, జనవరి 22న పాఠశాలలు ప్రారంభించిందన్నారు. అంతకు ముందు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వపాఠశాలలోనూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించిన దాఖాలాలు లేవన్నారు. జనవరి 22 తర్వాతే విద్యార్థులు వారి పాఠ్యాంశాలపై, తరగతి గదుల్లో దృష్టిపెట్టారని, అప్పటి నుంచి ఏప్రియల్ 22వరకు మాత్రమే పాఠ్యాంశాల బోధన జరిగిందన్నారు. కేవలం 3నెలల సమయంలో విద్యార్థులకు చెప్పాల్సిన సిలబస్ ఏదీ పూర్తికాలేదన్నారు. ఆ మూడునెలల సమయంలో ప్రభుత్వం ఉపాధ్యాయులను స్థానిక ఎన్నిక లకు వినియోగించడమే సరిపోయిందని, దానితో విద్యార్థుల పాఠ్యాంశాల బోధన ఎక్కడికక్కడే నిలిచిపోయిందన్నారు. అన్ని సబ్జెక్ట్ లకు సరైన ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనమొత్తం అసంపూర్తిగానే ఉండిపోయిందన్నారు. విద్యాసంవత్సరం కుదించారు కాబట్టి బోధనాంశాలను తగ్గిస్తారని భావించామని, కానీ ప్రభుత్వం అలాంటిచర్యలేవీ తీసుకోలేదన్నారు. ఒక్కో అధ్యాయానికి సంబంధించి చివరి 3, 4 పేజీలు తొలగించడం వల్ల ఆ అధ్యాయాన్ని అసంపూర్తిగానే విద్యార్థినీ, విద్యార్థులు అవగతం చేసుకోవాల్సినదుస్థితిని ఈ మూర్ఖపు ముఖ్యమం త్రి కల్పించాడన్నారు. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే తీసేసిన అధ్యాయంలోని అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఇస్తారా లేక చదివిన అంశాలకు సంబంధించి ఇస్తారా అనేది కూడా విద్యార్థులకు అర్థంకావడంలేదన్నారు.

ఈ విధంగా లోపభూ యిష్టమైన విధ్యావిధానాన్ని కావాలనే సృష్టించిన ప్రభుత్వం, పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలను కోవిడ్ కు బలిచేయా లనిచూడటం దుర్మార్గమని రామానాయుడు మండిపడ్డారు. విద్యార్థులు, వారి కుటుంబాలతో చెలగాటమాడే హక్కు ఈ ముఖ్యమంత్రికి, విద్యాశాఖమంత్రికి ఎవరిచ్చారన్నారు. తాడే పల్లి దాటి బయటకురాని ముఖ్యమంత్రికి, మంత్రికి విద్యార్థు లు పరీక్షలు రాయడంలో ఉండే సాధకబాధకాలు తెలియక పోవడం సిగ్గుచేటన్నారు. పిల్లలే తమప్రాణంగా బతికే తల్లి దండ్రులకు ఈముఖ్యమంత్రి ఏం సమాధానంచెబుతాడో చెప్పాలన్నారు. మొండిపట్టుదలకు పోకుండా, ముఖ్యమం త్రి, విద్యాశాఖమంత్రి పరీక్షలను వాయిదావేయాల్సిందేనని నిమ్మల తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఆదిశగా ఆలోచన చేయ కపోతే, టీడీపీ జాతీయప్రధానాకార్యదర్శి నారా లోకేశ్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి పెద్దఎత్తున పోరాటం చేస్తారని రామానాయుడు హెచ్చరించా రు. అవసరమైతే టీడీపీ న్యాయపోరాటంచేసైనా సరే, ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి, ప్రభుత్వం మెడలు వంచితీరుతుందన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ప్రసారమాధ్యమాల్లో వచ్చే వార్తలు, కథనాలన్నీ మారిపోయాయని, ఏప్రతిపక్ష నేత ఇంటిని కూలుస్తారో, ఏ నాయకుడిని అక్రమకేసులతో అరెస్ట్ చేస్తారో నని మీడియాతోపాటు, ప్రజలంతా వేచిచూడాల్సిన దుస్థితిని ఈ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇప్పటికైనా ప్రజల ఆరోగ్యంపై, వారి ప్రాణాలను కాపాడటంపై శ్రద్ధపెడితే మంచిదని నిమ్మల హితవుపలికారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read