మొన్నటి వరకు ఆ అవార్డ్ వచ్చింది, ఈ అవార్డ్ వచ్చింది అని , ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకునే వారు. 2014 నుంచి 2019 మధ్య, దాదపుగా 700 పైన అవార్డ్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి. అంతే కాదు, వరుసుగా, మూడు ఏళ్ళు, ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలిచింది. అయితే, ఇప్పుడు ప్రభుత్వం మారింది, వాటి విధానాలు మారాయి, దీంతో మన ర్యాంకు కూడా మారిపోయింది. అన్నిట్లో టాప్ లో ఉండే ఆంధ్రప్రదేశ్ పరిస్థతి ఘోరంగా తయారయ్యింది. నీతి ఆయోగ్‌ రూపొందించిన ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌-2019లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 10వ ర్యాంకు వచ్చింది. అదే తెలంగాణా రాష్ట్రానికి మాత్రం, నాలుగువ ర్యాంకు వచ్చింది. పెద్ద రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారీగా ర్యాంకులను విభజించి ప్రకటించారు. పెద్ద ర్యాంకులు ఉన్న రాష్ట్రాల్లో 17 ఉండగా, ఆంధ్రప్రదేశ్ 10 వ స్థానంలో నిలిచింది. ఇందులో కర్ణాటక దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.

niti 18102019 2

టాప్‌ 10లో తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హరియాణా, కేరళ, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ నిలిచాయి. ఈశాన్య రాష్ట్రాల్లో సిక్కిం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో దిల్లీ తొలి స్థానాలను చేజిక్కించుకున్నాయి. ఈ నివేదికను విడుదల చేసిన అనంతరం రాజీవ్ కుమార్ మాట్లాడుతూ భారత దేశం పోటీతత్త్వం నిండిన సుపరిపాలనకు మారుతుందని చెప్పారు. నవ కల్పనల వాతావరణంలో వివిధ వర్గాల మధ్య సమన్వయం సాధించడానికి ఈ సూచీ దోహదపడుతుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నవ కల్పనల వాతావరణాన్ని నిరంతరం మదింపు చేయడానికి విస్తృత నిబంధనావళిని రూపొందించడానికి ఈ ప్రయత్నం జరిగిందని తెలిపారు.

niti 18102019 3

అంశాలవారీగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య ర్యాంకులు.. ఓవరాల్ ర్యాంక్ లో, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, తెలంగాణా 4వ స్థానంలో ఉంది. సానుకూల వాతావరణంలో, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉండగా, తెలంగాణా 9వ స్థానంలో ఉంది. పనితీరులో, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, తెలంగాణా 4వ స్థానంలో ఉంది. మానవ వనరులులో, ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ఉండగా, తెలంగాణా 9వ స్థానంలో ఉంది. పెట్టుబడులులో, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, తెలంగాణా 7వ స్థానంలో ఉంది. నైపుణ్య కార్మికులలో, ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉండగా, తెలంగాణా 5వ స్థానంలో ఉంది. వాణిజ్య వాతావరణంలో, ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉండగా, తెలంగాణా 4వ స్థానంలో ఉంది. సురక్ష చట్టబద్ద వాతావరణంలో, ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉండగా, తెలంగాణా 16వ స్థానంలో ఉంది. నాలెడ్జ్ అవుట్ పుట్ లో, ఆంధ్రప్రదేశ్ 14 వ స్థానంలో ఉండగా, తెలంగాణా 4వ స్థానంలో ఉంది. విజ్ఞాన విస్తరణలో, ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉండగా, తెలంగాణా 5వ స్థానంలో ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read