సార్వత్రిక సమరంలో చివరి అధ్యాయం ముగియక ముందే.. ఎన్డీయేకు షాక్‌ తగులుతోంది. ప్రధానమంత్రి మోదీపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్స్ 370, 35A ఆర్టికల్స్‌ని రద్దు చేస్తామన్న బీజేపీ హామీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారాయన. కామన్ మినిమం ప్రోగ్రామ్‌ ఉంటేనే కొత్త ప్రభుత్వంలో కొనసాగుతామని నితీశ్ స్పష్టంచేశారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కొన్నాళ్లుగా చంద్రబాబుతో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే తటస్థ పార్టీలతోను చర్చలు జరుపుతున్న ఏపీ ముఖ్యమంత్రి.. మోదీకి వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. ఇవాళ కూడా ఢిల్లీలోనే ఉన్న ఆయన.. మంత్రాంగం ముమ్మరం చేశారు. రాహుల్‌తో, శరద్‌ పవార్‌తో సమావేశం అయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై ఈ మధ్యాహ్నం కీలక చర్చలు జరగనున్నాయి.

modishah 19052019

మరో పక్క, జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను దేశ భక్తుడంటూ భాజపా నాయకురాలు ప్రజ్ఞా ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలను బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ ఖండించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఈ వ్యాఖ్యలు ఖండించతగ్గవి. ఇటువంటి తీరును మేము సమర్థించం. మహాత్మా గాంధీ జాతిపిత. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తారో, లేక ఇతర ఏ చర్యలు తీసుకుంటారన్నది భాజపా అంతర్గత విషయం. ఇటువంటి వాటిని మనం ఉపేక్షించకూడదు’ అని వ్యాఖ్యానించారు. కాగా, ఇటీవల ప్రజ్ఞా మాట్లాడుతూ... ‘గాడ్సే ఓ దేశభక్తుడు.. ఆయనను కొందరు ఉగ్రవాది అని అంటున్నారు. అటువంటి వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు’ అని వ్యాఖ్యానించారు.

modishah 19052019

ఇది ఇలా ఉంటే, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్‌పై మాజీ సీఎం రబ్రీదేవి విరుచుకుపడ్డారు. గాడ్సే దేశభక్తుడంటూ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆయనను (నితీష్) బాధించి ఉంటే వెంటనే మౌనం విడిచిపెట్టి బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలని రబ్రీదేవి డిమాండ్ చేశారు. 'నితీష్‌కు ప్రగ్యా వ్యాఖ్యలు నిజంగానే బాధపెట్టి ఉంటే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బీహార్‌లో బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలి' అని ఆమె ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read