విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పర్యటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఉద్రిక్త వాతవరణం మధ్యే పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ ఉంది. జనవాణి కార్యక్రమాన్ని కూడా పవన్ రద్దు చేసుకున్నారు. మరో పక్క పోలీసులు కూడా పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే, పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి వెళ్లిపోతారని పోలీసులు భావించారు. పవన్ మాత్రం, ఏమి చెప్పకుండా ఇంకా విశాఖలోనే ఉన్నారు. అరెస్ట్ చేసిన వారిని వదిలి పెట్టాలని పవన్ డిమాండ్ గా ఉంది. పవన్ కళ్యాణ్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగితే పరిస్థితి చేయి దాటి పోతుందని, పోలీసులు భయపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ ను బలవంతంగా తరలిస్తారని భావించారు. కొంత మంది అయితే అరెస్ట్ చేస్తారని కూడా ప్రచారం చేసారు. ఈ మొత్తం ఎపిసోడ్ నేపధ్యంలో, పవన్ కళ్యాణ్ ఇంకా నోవాటెల్ హోటల్‍లోనే ఉన్నారు. నోవాటెల్ హోటల్‍లో చుట్టూ పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు. పవన్ స్ట్రాటజీ ఏంటో పోలీసులకు కూడా అంతుబట్టటం లేదు. నోవాటెల్ హోటల్‍ దగ్గర, భారీ స్థాయిలో పోలీసులను పెట్టారు. దాదాపుగా 00 మంది పోలీసులతో సిద్దంగా ఉన్నారు. ఏ క్షణం ఏమి జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read