తెలుగుజాతి ఆత్మ‌గౌర‌వ ప‌తాకం విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా అరుదైన గౌర‌వం ద‌క్కింది. రూ. 100 రూ. నాణెంపై  ఎన్టీఆర్ చిత్రపటం ముద్రణ పై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం ముద్రణకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ నాణెం త‌యారీలో 50 శాతం వెండి,40 శాతం రాగి,5 శాతం నిఖిల్,5 శాతం జింకుతో కూడిన మెటీరియ‌ల్ ఉండాల‌ని కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. త్వరలో మార్కెట్ లోకి వంద నాణెం విడుద‌ల చేయ‌నున్నారు. క‌థానాయ‌కుడిగా, మ‌హానాయకుడిగా, తెలుగు ప్ర‌జ‌ల ఆరాధ్య దైవంగా, తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా, ముఖ్య‌మంత్రిగా తెలుగుజాతి కీర్తి కిరీట‌మైన నంద‌మూరి తార‌క‌రామారావు శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా వంద నాణెం విడుద‌ల చేయ‌డం ఆయ‌న‌కి ద‌క్కిన అరుదైన గౌర‌వంగా తెలుగు ప్ర‌జ‌లు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read