అమరావతిలో ఉన్న ఒక విద్యార్ధికి ఊహించని అనుభవం ఎదురైంది. తాను రాసిన లేఖకు ఏకంగా, భారత దేశ సుప్రీం కోర్టు ప్రధానన్యాయమూర్తి, తాను రాసిన లేఖకు స్పందించటమే కాక, ఏకంగా తనను అభినందించటం పై, ఆ విద్యార్ధి ఉబ్బితబ్బిబ్బుఅవుతున్నారు. అమరావతి అస్తిత్వం కోసం, ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని మూడు ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ, భూములు త్యాగం చేస్తున్న రైతులు ఉద్యమం చేస్తున్నారు. ఇందులో పిల్లా, పెద్ద, ముసలి, ముతకా అందరూ గత ఏడాదిన్నర్రగా ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమంలో, దర్శిత్ అనే విద్యార్ధి చురుకుగా పాల్గుంటు ఉండే వాడు. తన స్పష్టమైన తెలుగు, భాష పై పట్టుతో, ఆ కుర్రాడు చేసే ప్రసంగం అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది. అమరావతి రైతు ఉద్యమంలో, తనదైన పాత్ర పోషిస్తున్న దర్శిత్, రైతులు పక్షాన పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తను, కొత్తగా చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు స్వీకరించిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాసారు. దర్శిత్ రాసిన లేఖ, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ వరకు చేరింది. ఆయన ఆ లేఖ చదవటమే కాదు, ఏకంగా దర్శిత్ కు ప్రత్యుత్తరం రాసారు. దీంతో దర్శిత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ramana 08062021 2

ఆ లేఖలో జస్టిస్ ఎన్వీ రమణ స్పందిస్తూ, చిరంజీవి దర్శిత్ అంటూ సంబోధించారు. చక్కటి తెలుగులో, స్వదస్తూరితో నీవు రాసిన లేఖ నాకు అమితమైన ఆనందాన్ని కలిగించింది అంటూ జస్టిస్ ఎన్వీ రమణ రిప్లై ఇచ్చారు. నీ విద్యాభ్యాసం నిరాఘాటంగా కొనసాగాలని, ఎంచుకున్న రంగంలో నువ్వు కీర్తి శిఖరాలదిరోహించాలని ఆకంక్షిస్తున్నాను, శుభాశీస్సులు అంటూ, జస్టిస్ ఎన్వీ రమణ ఆ లేఖకు స్పందించారు. దీంతో దర్శిత్ కు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ దేశ చీఫ్ జస్టిస్ తన లేఖకు స్పందించటం, తనను ఆశీర్వదించటం అంటే మామూలు విషయమా మరి ? ఇప్పుడు ఈ లేఖ ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. ముఖ్యంగా జస్టిస్ ఎన్వీ రమణను కూడా, ఆయన ఆ పిల్లవాడికి లేఖ రాసి, ప్రోత్సహించటం, అదీ ఒక చీఫ్ జస్టిస్ నుంచి తెలుగులో ఉత్తరం రావటం పై, పలువురు భాషా ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఇప్పుడు ఈ లేఖ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read