గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో, భారీ ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఘటన జరిగి రెండు రోజులు అయినా, ఇంకా అందరినీ కనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఘటన జరిగిన మరుసటి రోజు జగన మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే చేసి, బాధితులను హాస్పిటల్ లో పరామర్శించారు. తరువాత అధికారులతో కలిసి సమీక్ష జరిపారు. అయితే ఈ సందర్భంలో అక్కడ అధికారులు ప్రవర్తించిన తీరుతో జగన్ అవాక్కయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనే గౌరవం కూడా అధికారులకు లేనట్టు ఉంది. అందుకే అక్కడ జగన్ ఉన్నా, ఆయన ముందే, తప్పు నీది అంటే నీతి అంటూ, అధికారులు ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, తప్పు నెట్టేసే ప్రయత్నం చేసుకున్నారు. ఈ తతంగం అంతా చూస్తున్న జగన్, ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామంతో అవాక్కయి, తేరుకుని, అక్కడ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

jagan 17092019 2

కాకినాడ పోర్టు అధికారులు మాట్లాడుతూ, తాము బోటుకు ఫిట్ నెస్ సర్టిఫికెట్, లైసెన్స్ మాత్రమే చూసుకుంటూ ఉంటామని చెప్పారు. అయితే వాళ్ళు మాట్లాడుతూ ఉండగానే, పాపికొండల పర్యాటకానికి బోట్లు వెళ్లకుండా, వారం రోజుల నాడే అనుమతులు రద్దు చేశామని పర్యాటక శాఖ చెప్పింది. పర్యాటక శాఖ అధికారులు చెప్తూ ఉండగానే, నీటి పారుదల శాఖ అధికారులు స్పందిస్తూ, తమ అధికారాలను కత్తిరించారని ఆరోపించారు. ఇలా బోటు ప్రమాదానికి తాము కారణం కాదంటే, తాము కారణం కాదంటూ అధికారులు వాదులాడుకోగా, అసలు ఎవరూ అనుమతి ఇవ్వకుండా, బోటు ఎలా కదిలిందని జగన్ నిలదీశారు. బోట్లను ఎందుకు తనిఖీ చేయడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

jagan 17092019 3

మరో పక్క, ప్రమాదానికి గురైన బోటు కచ్చులూరు వద్ద 200 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పడవ ప్రమాదం ఘటనలో ఇప్పటి వరకు 24 మృతదేహాలు వెలికితీశారు. ఇంకా 23 మంది గల్లంతు అయ్యారు. వారి కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దొరికిన మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అధికారులు అప్పగించారు. అయితే మిగతా 23 మంది బోటులోనే ఉండే అవకాసం ఉందని చెప్తున్నారు. అయితే ఆ బోటుని బయటకు తియ్యాలి అంటే, మరో 2-3 రోజులు పైనే పట్టచ్చు. ఎందుకంటే 200 అడుగులో బోటు ఉంటే, వీళ్ళు 60 అడగులకు కూడా వెళ్ళలేక పోతున్నారు. సుడిగుండాలు ఎక్కువగా ఉండటం కారణంగా చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిలో బోటు ఎప్పటికి బయటకు తీస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read