విజయవాడ ప్రభుత్వాసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వారం రోజులుగా వృద్ధుడి కుటుంబ సభ్యులు వడుతున్న ఆవేదనకు శుక్రవారం తెరవడింది. సదరు వృద్ధుడు కరోనాతో మృతి చెందినట్లు ప్రభుత్వ వైద్యులు శుక్రవారం ధృవీకరించారు. వివరాల ప్రకారం విజయవాడ, వన్ టౌన్ ప్రాంతంలో ఒక దంపతులు నివాసముంటున్నారు. దంపతుల్లో వృద్ధునికి ఆయాసం ఎక్కువవుతుండటంతో తొలుత ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఆయనకు కోవిడ్ లక్షణాలు న్నాయని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. కోవిడ్ పేరు చెప్పగానే బంధువులు సైతం దూరంగా వెళ్ళారు. దీనితో 60 సంవత్సరాల వయస్సున్న వృద్ధుడు తన భార్యతో కలిసి గత నెల 24న విజయవాడ ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అదే రోజు సాయంత్రం సదరు వృద్ధుని వెంటిలేటర్ పై ఉంచేందుకు లోపలకు తీసుకెళ్ళారు. అయితే అతని భార్యను మాత్రం అదే రోజు ఇంటికి పంపించివేశారు. 25వ తేదీ ఉదయం వృధుని చూసేందుకు అతని భార్య ఆస్పత్రికి వచ్చింది. ఆమెకు వైద్య సిబ్బంది. ఆమె భర్త ఇక్కడ లేడని చెప్పడంతో అవాక్యయ్యింది. ఉన్నతాథికారులను కలిసి వేడుకున్నా ఫలితం కానరాక పోవడంతో నాలుగు రోజుల పాటు అక్కడే తిరిగి అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రి లోని సిసి టివి పుటేజిని పరిశీలించారు. వృద్ధుడు ఆస్పత్రి లోపలకు వెళ్ళడం కూడ సిసి టివి పుటేజిలో రికార్డయ్యింది. అయితే తిరిగి బయటకు రావడం మాత్రం సిసి టివి పుటేజీలో లేదు. దాంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పలువురు వైద్యాధికారులను ఈ సందర్భంగా విచారించారు. మీడియాలో కూడ దీనికి సంబంధించి వార్తా కథనాలు ప్రసారం కావడంతో ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు. వృద్ధుని మృతదేహం మార్చురీలోనే ఉందని, జూన్ 25వ తేదీ తెల్లవారుజామయున ఆయన కోవిలో మృతి చెందినట్లుగా వైధ్యాధికారులు ధృవీకరించారు. శుక్రవారం కుటుంబ సభ్యులకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఫోన్లో వృద్ధుని ఫొటోను తీసి ఆస్పత్రి సిబ్బంది నేరుగా ఖననం చేసేందుకు వృద్ధుని మృతదేహాన్ని తీసుకెళ్ళారు. ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యం వల్ల వారం రోజులుగా భర్త కోసం విలవిలలాడిన సదరు మహిళ ఆవేదన శుక్రవారం వైధ్యాధికారులు అందించిన సమాచారంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ప్రభుత్వం స్పందించి నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read