ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, స్థానిక సంస్థలు ఎన్నికల నిర్వహణ ఏమో కాని, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ విషయంలో మాత్రం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్చి నెలలో నోటిఫికేషన్ రావటం, నామినేషన్ పర్వంలో, ఎప్పుడూ లేనంత హింస, అత్యధిక ఏకాగ్రీవాలు, ఏకంగా ఒక ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే పైనే దాడి చెయ్యటం, ఇవన్నీ అప్పటి ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ పై వేలు ఎత్తి చూపించేలా చేసాయి. అయితే తరువాత ఆయన జరిగిన హింస పై చర్యలు తీసుకోవటం, అలాగే కరోనా ఉంది కాబట్టి, ఎన్నికలు వాయిదా వెయ్యటంతో, అధికార పక్షం బుస్సున పైకి లేచింది. ముఖ్యమంత్రి నేన, రమేష్ కుమారా అంటూ, మరో రాజ్యంగా సంస్థ పై, దాడి మొదలైంది. ఆ కక్ష, చివరకు ప్రత్యెక ఆర్దినెన్స్ తెచ్చి, ఏకంగా ఎన్నికల కమీషనర్ నే తప్పించే అంత, సాహసం చేసింది. ఆ కొత్త ఆర్దినెన్స్ ప్రకారం, జస్టిస్ కనకరాజ్ సీన్ లోకి వచ్చారు. కొత్త ఎన్నికల కమీషనర్ అయ్యారు. అయితే, ఇది రాజ్యాంగం ప్రకారం కుదరదు అంటూ, కోర్ట్ మెట్లు ఎక్కారు.

దీంతో కోర్ట్ కూడా, వారి వాదన ఏకీభవీస్తూ, ఆర్దినెన్స్ కొట్టేసి, కనకారాజ్ నియామకం జీవో కొట్టేసి, మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కు అవకాశం ఇచ్చింది. కోర్ట్ తీర్పు ప్రకారం, నిమ్మగడ్డ మళ్ళీ పదవిలోకి వచ్చారు. అయితే ప్రభుత్వం మాత్రం, ఇందుకు ఇష్టంగా లేదు. ఎలాగైనా రమేష్ కుమార్, మళ్ళీ ఆ పదవిలోకి రాకూడదు అనే తలంపుతో, హైకోర్ట్ లో మరో పిటీషన్ వేసింది, అలాగే సుప్రీం కోర్ట్ లో కూడా హైకోర్ట్ తీర్పు పై అపీల్ చేసింది. ఈ తతంగం అంతా జరుగుతూ ఉండగానే, ఇప్పుడు మరో కొత్త ఎన్నికల కమీషనర్ ను నియమించే ఏర్పాట్లు మొదలు అయ్యాయి. ఒక వేళ కోర్టులు స్టే ఇస్తే, వెంటనే మరో కొత్త ఎన్నికల కమీషనర్ ను నియమించటానికి, నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ ను నియమించే ప్రయత్నం చేస్తుంది. ఆర్దినెన్స్ ద్వారా కాకుండా, పాత చట్టం ప్రకరామే, ఈ నియామకం ఉండేలా, ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మరి, చివరకు ఏమి అవుతుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read