ఏపీకి బాక్సైట్ ఖనిజాన్ని సరఫరా చేసే విషయంలో పొరుగు రాష్ట్రం ఒడిసా విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ధర, రవాణాతోపాటు పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని బాక్సైటు సరఫరా చేయడం సాధ్యంకా దని ఒడిసా ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలియజేసినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రాష్ట్ర సర్కారు కోరుతోంది. విశాఖపట్నం జిల్లా మాకవారిపాలెం మండలం రాచపల్లి వద్ద పెన్నాగ్రూప్, రస్ఆల్‌ఖైమా ఇన్వెస్ట్మెంట్ అధారిటీ(రకియా గ్రూప్) సంయుక్తంగా అల్యూమినియం ఫ్యాక్టరీని ఏర్పాటు చేశాయి. ఈ ఫ్యాక్టరీకి బాక్సైటు సరఫరా చేస్తామని 2008లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ మన్యంలోని బాక్సైట్ను తవ్వి అక్కడే ఉన్న సరఫరా చేసేలా ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) ముందుకొచ్చింది. అయితే, అక్కడ బాక్సైట్ మైనింగ్ పై పెద్ద ఉద్యమమే సాగింది. దీంతో మైనింగ్ ముందుకు సాగలేదు. 2016లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఒప్పం దాన్ని రద్దుచేశారు. దీనిపై రకియా గ్రూపు రూ.1100 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టుకెక్కింది. దీంతో.. ఏపీలో బాక్సైట్ మైనింగ్ చేయలేమని, పక్కనే ఉన్న ఒడిసా నుంచి ఇప్పించాలని జగన్ సర్కారు కోరుతోంది. ఇదే అంశంపై తొలుత ఒడిసా ప్రభుత్వంతో మాట్లాడారు.

orissa 28112021 2

గత ఏడాదిన్నరగా ఈ అంశంలో సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. బాక్సైట్ సరఫరాపై ఒడిసా సర్కారు ఇటీవల విముఖతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపధ్యంలో కేంద్రం జోక్యం చేసుకుని ఒడిసా సర్కారు బాక్సైట్ సరఫరాచేసేలా చర్యలు తీసుకోవా లని ఏపీ సర్కారు కోరుతోంది. నెల రోజుల క్రితం, ఈ విషయం తేల్చుకోవటానికి విదేశాలకు కూడా రాష్ట్ర అధికారులు వెళ్ళి వచ్చారు. అక్కడ కేసు నడుస్తూ ఉండటం, త్వరలోనే తీర్పు వస్తు ఉండటంతో, దీని పై రాజీ ఫార్ములాకు వెళ్ళాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భావించింది. అయితే తరువాత దీని పై ఏమి చేయాలి అనే అంశం పై మల్లగుల్లాలు పడ్డారు. ఇక్కడ విశాఖలో బాక్సైట్ కు అనుమతి ఇస్తే, అల్లకల్లోలం జరుగుతుంది కాబట్టి, ఒరిస్సా నుంచి ఇవ్వాలనే ప్రతిపాదన పెడితే ఎలా ఉంటుందని భావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవటానికి ఇష్ట పడలేదు. మొన్నీ మధ్య జగన్ మోహన్ రెడ్డి , ఒరిస్సా వెళ్ళటం వెనుక ఈ కారణం కూడా ఉందనే ప్రచారం జరిగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read