వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసు విచారణలో ఇన్నాళ్లూ సీబీఐ సాధించిన పురోగతి ఒక ఎత్తు అయితే, అవినాశ్ రెడ్డి విచారణతో ఒక్కసారిగా కేసు చిక్కుముడి వీడిపోయే క్లూలను సంపాదించింది. సీబీఐ ఎప్పటి నుంచో అరెస్టు చేయొచ్చనే అనుమానాల నేపథ్యంలో ఎట్టకేలకు అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. 2019లో వివేకా హ-త్య జరిగితే ఏపీ పోలీసు దర్యాప్తుని ముందుకు సాగనీయలేదు కొన్ని శక్తులు. అలాగని సీబీఐ దర్యాప్తుకి దిగితే వారిపైనే రివర్స్ కేసులు బనాయించి బెదిరించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలతో కేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యింది. ఇక్కడి నుంచి కేసు విచారణ వేగం అందుకుంది. అవినాశ్ రెడ్డిని ఐదు గంటలకు పైగానే విచారించిన సీబీఐ, కాల్ డేటాని ముందు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసిందని వివిధ పత్రికల్లో ప్రత్యేక కథనాలు వచ్చాయి. వివేకా హ-త్య జరిగిన రోజు అవినాశ్ రెడ్డి రెండు నంబర్లకు చేసిన కాల్స్ ఇప్పుడు దర్యాప్తులో కీలకం అయ్యాయి. ఈ రెండు నంబర్లు ఒకటి నవీన్ దని, ఇంకొకటి తాడేపల్లి ప్యాలెస్ నంబరే కావడం సీబీఐ అనుమానాలకు బలం చేకూరుతోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి భార్య భారతితో మాట్లాడాలంటే నవీన్ నంబర్‌కే చేస్తానని అవినాశ్ రెడ్డి సీబీఐ ముందు వెల్లడించాడని ఆంధ్రజ్యోతి కథనం కుమ్మేసింది. .జగన్ తో మాట్లాడాలంటే మరో నంబర్ ఉపయోగించానని అవినాశ్ రెడ్డి చేప్పడంతో ఈ కేసులో చిక్కుముడులు దాదాపు వీడిపోయినట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతి జగన్ భార్య కాకముందే అవినాశ్ రెడ్డి మేనత్త కూతురు. భారతి, అవినాశ్ రెడ్డి బంధుత్వం పులివెందుల ప్రాంతీయులకు బాగా తెలుసు. భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో వియ్యం అందుకున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి ప్రచారం చేయడం, గంగిరెడ్డి వివేకా గుండెపోటుకి కుట్లు వేయడం, అనంతరం అనుమానాస్పద మరణం ఇవ్వన్నీ గొలుసుకట్టు అనుమానాలు ఒకేచోటుకి చేరుతున్నాయి. అవినాశ్ రెడ్డి తన తమ్ముడని, వివేకానందరెడ్డి తన సొంత బాబాయ్ అని..ఒక కన్ను మరోకన్నుని పొడుస్తుందా అని ప్రశ్నించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దంపతులకు వివేకానందరెడ్డి హ-త్యరోజు అన్ని కాల్స్ అవినాశ్ రెడ్డి ఎందుకు చేశారనే దానిపైనే ఇప్పుడు సీబీఐ ఫోకస్ పెట్టింది.
news
కేసులతో జగన్ ఉక్కిరిబిక్కిరి.. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ, ఫోన్ ట్యాపింగ్, కోర్టు ధిక్కరణ కేసులు..
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ఆయన పార్టీ వైసీపీని కేసులు చుట్టుముడుతున్నాయి. పాతకేసులతోపాటు కొత్త కేసులు నమోదు కావడంతో వైసీపీ అధినేత జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పరిపాలన వైపు దృష్టి సారించలేక, పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టలేక సతమతమవుతున్నారు. ఈ కేసులు, వివాదాలు కొన్ని తెచ్చి పెట్టుకున్నవి అయితే, మరికొన్ని ప్రభుత్వంలో ఉన్నందువల్ల ఎదుర్కొంటున్నవి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించారని రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై నమోదైన సీబీఐ, ఈడీ కేసులు ఏళ్లుగా విచారణ సాగుతోంది. అప్పటి కేంద్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలోని టిడిపితో కలిసి ఈ కేసులు బనాయించారని ఆరోపణలున్నాయి. దాదాపు పదేళ్లుగా సీబీఐ, ఈడీ కేసులు కోర్టుల్లో వివిధ దశల్లో విచారణకి కూడా ఇంకా రాలేదు. జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2019లో జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై అప్పట్లో జగనే సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక సీబీఐ దర్యాప్తు డిమాండ్ నుంచి వెనకడుగు వేశారు. అయితే వివేకానందరెడ్డి కుమార్తె సునీత కోర్టుల్లో వ్యాజ్యం వేసి సీబీఐ దర్యాప్తు సాధించారు. సీబీఐ దర్యాప్తు అటు తిరిగి ఇటు తిరిగి జగన్ మోహన్ రెడ్డి సోదరుడైన వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారణకు పిలవడంతో ఈ కేసు జగన్ మెడకే చుట్టుకుంటోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. 2018లో జగన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి వీఐపీ లాంజ్‌లో ఉండగా.. వెయిటర్ జనిపల్లి శ్రీనివాసరావు సెల్ఫీ తీసుకుంటానని వచ్చి కోడి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలోనే జగన్ భుజానికి గాయమైంది.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబుపై తమకు నమ్మకంలేదని, ఎన్ఐఏ దర్యాప్తు డిమాండ్ చేశారు. దీనిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కేసు నమోదు చేసింది. దీని దర్యాప్తు నాలుగేళ్ల తరువాత ఇప్పుడు విజయవాడ ఎన్ఐఏ కోర్టులో ప్రారంభమైంది. ఈ కేసులో బాధితుడైన సీఎం జగన్ మోహన్ రెడ్డి కోర్టుకి హాజరు కావాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేయడంతో అది మరో కేసులా వైసీపీ మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. నెల్లూరు కోర్టు పత్రాలు మాయం అయిన కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడంతో వైసీపీ కేబినెట్లో మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. ఇదీ వైసీపీకి సంబంధంలేని కేసు అయినా మంత్రిపై ఆరోపణలు రావడం చికాకు కలిగించేదే. ఢిల్లీ మద్యం కేసులోనూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి సంబంధాలు ఉండడంతో మనీల్యాండరింగ్ కేసులోనూ వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. మరోవైపు దేశంలోనే అతి ఎక్కువ కోర్టు ధిక్కరణ కేసులు ఏపీ సర్కారుకి గుదిబండలా తయారయ్యాయి. కేసులతో అధినేత, నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతుండడంతో వైసీపీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది.
విజయసాయిరెడ్డిలో ఇంత మార్పు దేనికి సంకేతం?
నిత్యమూ ట్విట్టర్లో బూతులతోనే ప్రతిపక్ష టిడిపిపై విరుచుకుపడే వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవర్తనలో ఇటీవల మార్పు వచ్చిందని ఆయన తీరు స్పష్టం చేస్తోందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ని పప్పు, పప్పునాయుడు అంటూ సోషల్మీడియాలో పోస్టులు సాయిరెడ్డి, పుట్టినరోజు సందర్భంగా నారా లోకేష్‌కి సోషల్మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడి తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే, లోకేష్ మామ అయిన బాలకృష్ణని పొగడ్తలతో ముంచెత్తాడు. నందమూరి తారకరత్నని బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో విజయసాయిరెడ్డి పరామర్శించారు. తారకరత్న ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో మాట్లాడ్డారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆస్పత్రి సిబ్బంది మంచి వైద్య సేవలందిస్తోందని ప్రశంసించారు. గుండెతోపాటు ఇతర అవయవాలు పనితీరు బాగుందని, మెదడుకు సంబంధించి చికిత్స జరుగుతోందని తెలిపారు. తారకరత్న త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నానన్నారు. తారకరత్న వైద్య సేవలను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని బాలయ్యని ఆకాశానికి ఎత్తేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇదంతా టిడిపి మీదో, బాలయ్య మీదో ప్రేమ కాదని.. తారకరత్న విజయసాయిరెడ్డి మరదలి అల్లుడు కావడంతోనే పరామర్శకి వచ్చారని అంటున్నారు.
కొడాలి నాని ఏడో తరగతి తప్పిన వెధవ.. వల్లభనేని వంశీ ఏం చేసి సంపాదించాడు ? గన్నవరం వైసీపీ నేతల మాటలు వైరల్
వైసీపీలో ముసలం మరిన్ని జిల్లాలకు పాకింది. నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం, మేకపాటి కలకలం సద్దుమణగక ముందే కృష్ణాజిల్లా గన్నవరం వైసీపీ ముసలం మొదలైంది. ఓ కార్యక్రమానికి హాజరైన గన్నవరం వైసిపి నాయకులు దుట్టా రామచంద్రరావు , యార్లగడ్డ వెంకట్రావు సంభాషణలు కలకలం రేపుతున్నాయి. గత ఎన్నికల నాటికి ఉప్పు-నిప్పుగా ఉన్న యార్లగడ్డ, దుట్టాలు వల్లభనేని వంశీ టిడిపి నుంచి చేరడంతో ఒక్కటయ్యారు. వల్లభనేని వైసీపీలో ఒంటరి కాగా, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు కలిసి ఎదురుదాడి ఆరంభించారు. చాలాకాలంగా వీరి మధ్య వివాదం రాజుకుంటున్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు వైసీపీలో రచ్చ రేపుతున్నాయి. వల్లభనేని వంశీ, కొడాలి నానికి ఆస్తులు ఎలా వచ్చాయని వీరు ప్రశ్నించారు. ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారు? అని నిలదీశారు. ఎప్పుడూ సినిమాల గురించి కొడాలి నాని చెబుతాడని, ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్ కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని, చివర్లో విలన్ కి చెంప దెబ్బలు తప్పవన్నారు. కొడాలినాని, వల్లభనేని వంశీ వల్ల నియోజకవర్గానికి ఏమైనా ఉపయోగపడ్డారా అని యార్లగడ్డ వెంకటరావు ప్రశ్నించారు. వల్లభనేని వంశీ ఆగడాలను మేం ప్రశ్నించబట్టే మాకు ప్రజల్లో గుర్తింపు వచ్చిందని, ఎమ్మెల్యేలకి వచ్చిన క్రేజ్ వచ్చిందని దుట్టా వ్యాఖ్యానించారు. మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావు మాటలు సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.