ఐ ప్యాక్ సర్వే పేరుతో సోషల్మీడియాలో సర్కులేట్ అవుతున్న దానిపై ఆంధ్రజ్యోతి ఓ కథనం రాసింది. ఐ ప్యాక్ పేరిట సోషల్ మీడియాలో వైరల్‍గా మారిన సర్వే ఆంధ్రజ్యోతి స్టోరీ అయ్యింది. అయితే దీనిని ఐ ప్యాక్ విచిత్రంగా ఖండించింది. ఫేక్ సర్వేలు వేసిన మీరు మీ పాపాన మీరే పోతారన్నట్టు శాపనార్థాలు పెట్టడం ఏంటో? అంతుబట్టటంలేదు. దేశవ్యాప్తంగా కార్పొరేట్ రేంజులో విస్తరించిన ఐప్యాక్ తమ పేరుతో ఫేక్ సర్వేని ప్రచురిస్తే లీగల్ చర్యలు తీసుకోకుండా ట్వీట్ ద్వారా ఖండించి ఎందుకు వదిలేసిందనేది చర్చనీయాంశం అవుతోంది. అంటే సర్వేని వారే లీక్ చేశారా? సర్వేని వారే చేశారా? అనేది తేలాల్సి ఉంది. ఈ సర్వే ప్రకారం ఏపీ కేబినెట్‍లో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, అంజాద్ బాషా, విశ్వరూప్, దాడిశెట్టి రాజాలు మాత్రమే గెలుస్తారనే నివేదిక ఉంది. మాజీ మంత్రుల్లో ధర్మాన కృష్ణదాస్, కొడాలి నాని గెలవొచ్చని, మిగిలిన తాజా..మాజీ మంత్రులంతా ఓడిపోతారని సర్వే వెల్లడించింది.
news
ఎలక్షన్ కమిషన్ కి వైసీపీ సమర్పించిన లెక్కలు చూసి, దేశం మొత్తం షాక్...
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచీ సాక్షితోపాటు దానికి మద్దతుగా నిలిచే పత్రికల్లో జగన్ బొమ్మలతో యాడ్స్ లేని రోజు లేదు. అయితే వైసీపీ అధికారికంగా తన సొమ్ముని రూపాయి కూడా ప్రచారానికి వాడుకోలేదని ఎన్నికల సంఘానికి లెక్కలు అప్పజెప్పింది. అంటే రోజూ జగన్ ఫోటోతో, వైసీపీ రంగులతో కనిపించే కోట్ల రూపాయల ప్రకటలన్నీ జనం సొమ్ముతోనే అని తేటతెల్లమైంది. ప్రకటనలు, ప్రచారాల కోసం మన దేశంలో వివిధ రాజకీయ పార్టీల ఖర్చులను ఎన్నికల కమిషన్ వెల్లడించింది. 2021-22 ఏడాదికి పార్టీల వార్షిక ఆడిట్ నివేదిక ఆధారంగా పార్టీ పరంగా ఒక్క రూపాయి కూడా యాడ్స్ ఖర్చు చేయని పార్టీ వైసీపీ అని తేలింది. ప్రభుత్వం నుంచి అనగా ప్రజల సొమ్ముతో మూడున్నరేళ్లకు పైగా పాలనలో వందల కోట్లు వెచ్చించింది జగన్ ప్రభుత్వం. అత్యధికంగా ప్రకటనలు, ప్రచారానికి రూ.313.17 కోట్లు ఖర్చు చేసిన బీజేపీ అగ్రస్థానంలో ఉంది. యాడ్స్ కోసం టీడీపీ రూ.1.66 కోట్లు, బీఆర్‍ఎస్ రూ.7.12 కోట్లు, సమాజ్‍వాదీ రూ.7.56 కోట్లు, టీఎంసీ రూ.28.95 కోట్లు, బీఎస్పీ రూ.13.83 కోట్లు ఖర్చు, ఆప్ రూ.30.29 కోట్లు, అన్నాడీఎంకే రూ.28.43 కోట్లు ఖర్చు, డీఎంకే రూ.35.40 కోట్లు, బీజేడీ రూ.16 కోట్లు, జేడీయూ రూ.36.82 లక్షలు ప్రకటనల కోసం ఖర్చు చేశాయని ఈసీ వెల్లడించింది. యాడ్స్ కోసం ఖర్చుల వివరాలు ఈసీకి అందించని పార్టీల జాబితాలో కాంగ్రెస్, సీపీఎం ఉన్నాయి.
తారకరత్న హార్ట్ స్ట్రోక్ పై కూడా వైసీపీ ఇంత సైకో ప్రచారమా ? ఎటు పోతుంది రాజకీయం ?
కుప్పంలో పాదయాత్రలో పాల్గొని మాసివ్ హార్ట్ స్ట్రోక్ తో తీవ్ర అస్వస్థతకు గురైన నందమూరి తారకరత్న చనిపోతాడని విషప్రచారం చేసుకునేందుకు చాలా కంటెంట్ రెడీ చేసుకుంది వైసీపీ పేటీఎం బ్యాచ్. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటల ఖాతాల్లోకి తారకరత్న మరణాన్ని చేర్చేసి చంద్రబాబు మీదకు తోసేయాలని నిన్నటి నుంచి కాచుకుని కూర్చుందిపేటీయం బ్యాచ్, బులుగు మీడియా. తారకరత్నకి జరగరానిది ఏదైనా జరిగి ఉంటే..దానిని సాకుగా చూపించి నారా లోకేష్ పాదయాత్ర ఆపేందుకు కూడా వైసీపీ పెద్దలు వ్యూహం పన్నారు. కుప్పం ఆస్పత్రి నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తారకరత్నను తరలించి చికిత్స అందిస్తున్నారు. తారకరత్న వెంట బాలకృష్ణ, తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి, కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. గోతికాడ గుంటనక్కల్లా తారకరత్న మరణవార్త కోసం నిరీక్షించిన పేటీఎం పెయిడ్ బ్యాచులు కొందరు ముందే ఆ ఫేక్ కంటెంట్ ని వదిలేశారు. బులుగు మీడియా వాడి ఓ చానల్ వాడైతే తారకరత్న తొక్కిసలాటలో చనిపోయాడని మెటీరియల్ సిద్ధం చేసుకున్నాడు. పేటీఎం వెబ్ సైట్లు తారకరత్నపై విషప్రయోగం జరిగిందని పోస్టులు పెట్టేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే వైసీపీ సోషల్మీడియాకి అన్నీ తానై చూసుకునే ఎంపీ విజయసాయిరెడ్డికి తారకరత్న అల్లుడు అవుతాడు. సాయిరెడ్డి మరదలి కూతురు అలేఖ్యరెడ్డినే తారకరత్న భార్య. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్మీడియాలో తారకరత్నపై కుట్ర జరిగి ఉండొచ్చని, ఏవి పడితే ఆ పోస్టులు పెట్టొద్దంటూ నర్మగర్భంగా హెచ్చరించాడు ఓ వైసీపీ సోషల్ మీడియాలో ఉండే ప్రముఖుడు. చివరకు వైసీపీ మంత్రులు కూడా తారకరత్న హార్ట్ స్ట్రోక్ ని, లోకేష్ కి ముడి పెట్టి ప్రచారం చేస్తున్నారు.మొత్తానికి ఇలా తయారయ్యింది రాజకీయం.
నిన్న, ఈ రోజు జగన్ ఎందుకు పర్యటనలు రద్దు చేసుకున్నారు ? అవినాష్ రెడ్డి విచారణకు లింక్ ఉందా ?
వైఎస్ వివేకానందరెడ్డి హ-త్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారణకి పిలిచింది. అయితే ఒక కన్ను మరొక కన్నుని ఎందుకు పొడుస్తుంది అని ప్రజల్నే అమాయకంగా ప్రశ్నించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎందుకో భయపడుతున్నారని, ఆయన వరస పర్యటనల రద్దులు స్పష్టం చేస్తున్నాయి. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని జగన్ క్యాంప్ ప్రచారం చేసింది. అనంతరం నారాసుర రక్తచరిత్ర అంటూ తన బాబాయ్ ని చంపేశారని అబ్బాయ్ రాగం అందుకున్నారు. ఇదంతా అధికారం అందే వరకే. అంతవరకూ సీబీఐ దర్యాప్తు కావాలన్న జగన్ రెడ్డి, సీబీఐ దర్యాప్తు వద్దంటూ పట్టుబట్టనారంభించారు. నిందితులని సీబీఐ అరెస్టు చేస్తుంటే అమాయకులంటూ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. బాబాయ్ ని చంపింది ఎవరో సీబీఐ చార్జిషీట్లో పకడ్బందీగా పేర్కొంటే, బాబాయ్ కూతురు, అల్లుడిపై అనుమానాలు అంటూ కథనాలు తన పేపర్ సాక్షిలో రాయించారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్టు చేయొచ్చనే ఊహాగానాలు వచ్చిన ప్రతీసారీ ఢిల్లీ ఎందుకు వెళుతున్నారు. సీబీఐ విచారణకి అవినాశ్ హాజరు అవుతుంటే, ఇటు జగన్ తన విశాఖ, పొన్నూరు పర్యటనలను ఎందుకు రద్దు చేసుకున్నారు. ఈ అనుమానాలన్నీ బాబాయ్ హ-త్యకేసులో అబ్బాయ్ వైపే చూపుతున్నాయి.