పోలవరం ప్రాజెక్టు అంచనాల్లో భారీగా కోతపడింది. కేంద్రం నియమించిన అంచనాల సవరణ కమిటీ దాదాపు ఏడాది పాటు పరిశీలన జరిపి రాష్ట్ర ప్రభుత్వం పంపిన అంచనాల్లో ఏకంగా వేల కోట్ల రూపాయలను తగ్గించింది. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాల్లో ఏకంగా రూ.7,823.13 కోట్లకు కోతపడింది. కేంద్రం నియమించిన అంచనాల సవరణ కమిటీ (ఆర్‌ఈసీ) దాదాపు ఏడాదిపాటు పరిశీలన జరిపి వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేసిన అనంతరం రూ.47,725.74 కోట్ల మేరకు సవరించిన అంచనాలు ఖరారు చేసింది. దిల్లీలో శుక్రవారం ఆర్‌ఈసీ సభ్యులు సమావేశమై పోలవరం తుది అంచనాలు ఖరారు చేశారు. ప్రధానంగా ప్రాజెక్టు పునరావాసం.. ఆ తర్వాత కుడి, ఎడమ కాలువల పనుల వ్యయంలోనే కోత విధించారు. 2017-18 ధరల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలు రూపొందించి కేంద్రానికి పంపింది. వీటిని కేంద్ర జలసంఘం దాదాపు ఏడాదిన్నరపాటు పరిశీలించి, అనేక ప్రశ్నలు లేవనెత్తిన తర్వాత సాంకేతిక సలహా కమిటీకి పంపింది.

polavaram 08032020 2

ఆ కమిటీ 2019 ఫిబ్రవరిలో రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇది ఆర్‌ఈసీ పరిశీలనలో ఉంది. ఏడాది తర్వాత ఇప్పుడు కొలిక్కి వచ్చింది. పోలవరం అంచనాలు ఖరారు చేయడంలో కీలకమైన రెండు కమిటీల ఆమోదమూ పూర్తవడంతో వీటికి ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడమే తరువాయి. ప్రాజెక్టు సవరించిన అంచనాల్లో దాదాపు రూ.5000 కోట్ల మేర పునరావాస వ్యయంలోనే కోత పడినట్లు సమాచారం. పోలవరం కుడి, ఎడమ కాలువలకు సంబంధించి పని పరిమాణం విషయంలో కమిటీ ప్రశ్నలకు ఇంజినీర్లు ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవడంతో దాదాపు రూ.2,800 కోట్ల వరకు ఆ పనుల్లో కోత విధించినట్లు సమాచారం.

polavaram 08032020 3

2005-06 ధరల ప్రకారం తొలుత అంచనాలు: రూ.10,151.04 కోట్లకు ఆమోదం. 2010-11 ధరల ప్రకారం అంచనాలు: రూ.16010.45 కోట్లకు ఆమోదం. 2017-18 ధరల ప్రకారం సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన అంచనాల విలువ: రూ.55,548.87 కోట్లుప్రస్తుతం సవరణ కమిటీ ఆమోదించిన అంచనాల విలువ: రూ.47,725.74 కోట్లు. అయతే ఇంత జరుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం, ఎలాంటి ఒత్తిడి లేదనే చెప్పాలి. ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతన్నాయి. మరో పక్క రాజ్యసభ సీటు విషయంలో, బీజేపీ పై ఒత్తిడి పెట్టి, పనులు చేసుకోవచ్చు. ఇలాంటి సమయంలో కూడా, కేంద్రం పై ఒత్తిడి పెంచకుండా, కేంద్రం ఏది చేసినా, ఏమి చెయ్యకుండా, రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు భారీ గండి పడింది. రిజర్వేషన్లను 50 శాతానికి కుదించటంతో ఎస్సీ,ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్నచోట వెనుకబడిన వర్గాల సీట్లు భాగా తగ్గాయి. జిల్లాల వారీగా విశ్లేషణ నివేదికలు విడుదల చేసిన తెలుగుదేశం... కొన్ని జిల్లాల్లో 24 శాతం కూడా దక్కలేదని ఆరోపించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలం, జిల్లాల్ని యూనిట్‌గా చేసుకుని జనాభా దామాషాలో రిజర్వేషన్లు ఖరారు చేయడం వల్ల కొన్నిజిల్లాలో ఊహించినదాని కంటే బీసీలకు తక్కువగా స్థానాలు వచ్చాయి. రాజ్యాంగం ప్రకారం మొత్తం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లు పోగా మిగిలినవాటినే బీసీలకు కేటాయిస్తారు. 1995 నుంచి ఇప్పటివరకూ బీసీలకు 34 శాతం సీట్లు దక్కుతున్నాయి. ఈసారి రిజర్వేషన్లు 50 శాతానికే కుదించడం వల్ల బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గిపోతాయని అంచనా వేశారు. కానీ రిజర్వేషన్ల జాబితా అధికారికంగా విడుదలయ్యాక చూస్తే అంతకుమించి స్థానాలు బీసీలకు కోతపడ్డాయి.

bc 08032020 2

తెలుగుదేశం అంచనాల ప్రకారం 2014తో పోల్చితే నెల్లూరు జిల్లాలో బీసీలకు కేవలం 13.04 శాతం సీట్లు మాత్రమే దక్కాయి. జిల్లాలోని 46 చొప్పున జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో బీసీలకు ఆరేసి చొప్పున కేటాయిచారు. 562 ఎంపీటీసీ స్థానాల్లో కేవలం 59 మాత్రమే బీసీలకు దక్కాయి. మొత్తం 46 మండలాధ్యక్షులకుగాను 16 మండలాల్లో బీసీలకు ప్రాతినిథ్యమే లేదని ఆయా వర్గాలు ఆవేదనలో ఉన్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో బీసీలకు ఒక్క జడ్పీటీసీ కూడా కేటాయించలేదు. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో 11 ఎంపీటీసీ స్థానాలుంటే ఒక్కటీ బీసీలకు దక్కలేదు. ఐతే ఎంపీపీ మాత్రం బీసీలకు రిజర్వ్‌ చేశారు. తడ మండలంలో ఒకే ఒక్క ఎంపీటీసీ స్థానాన్ని ఇచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలుంటే ఒక్క జడ్పీటీసీ సీటు బీసీమహిళకు కేటాయించారు.

ఎంపీపీ ఒక్కటీ ఇవ్వలేదు. గూడూరు నియోజకవర్గంలో ఒక్క 60 ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ బీసీలకు ఇవ్వలేదు. బీసీలకు.. తూర్పుగోదావరి జిల్లాలో 20.96 శాతం, కృష్ణాలో 20.4 శాతం, ప్రకాశంలో 19.64 శాతం, విశాఖలో 20.51 శాతం సీట్లే దక్కినట్లు తెదేపా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీలపై కావాలనే వైకాపా కక్షగట్టిందని ఆరోపిస్తున్న తెలుగుదేశం నేతలు.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. తొమ్మిది నెలల వైకాపా పాలనలో ప్రజలు విసుగెత్తిపోయారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీతోనే మహిళా సాధికారత సాధ్యమని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మహిళా దినోత్సవాన్ని శనివారం రాత్రి తెదేపా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్ని అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మహిళలకు ఆస్తిలో సగం భాగం కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, నయానా భయానా, సామ, దాన, బేధ, దండోపాయాలు ఉపయోగించి స్థానిక ఎన్నికల్లో గెలవాలని తాపత్రయపడుతోందని టీడీపీ సీనియర్ నేత, ఆపార్టీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. శనివారం ఆయన విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎస్. రామసుందర రెడ్డిని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన మంత్రివర్గసమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్థానిక ఎన్నికల్లో ఓడితే మంత్రులంతా నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామాలు చేయాలని చెప్పడం, ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వనని చెప్పాడన్నారు. సీఎం మాటలు చూస్తుంటే, ఎన్నికల్లో ఎక్కడ అధికారపార్టీ ఓడిపోతుందోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోందని, అనుకున్నస్థాయిలో అధికారపార్టీకి ఫలితాలు రావన్న భయంకూడా ఆయనలో కనిపిస్తోందని రామయ్య ఎద్దేవాచేశారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచే, జగన్ ముఖ్యమంత్రిగా పరిగణింపబడరని, కేవలం వైసీపీ అధినేతగా మాత్రమే వ్యవహరించబడతారని, అటువంటి వ్యక్తి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక నిఘా యాప్ ను ఆవిష్కరించాడన్నారు. ఆ విధంగా యాప్ ను ఆవిష్కరించే అధికారం ముఖ్యమంత్రి హోదాలో జగన్ కు ఉండదని, ఒక పార్టీ అధినేతగా ఉన్న ఆయన, అధికారయంత్రాంగం చేయాల్సిన పనిని తాను చేయడం రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధమన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక, తప్పుచేసినవారిని పట్టుకోవడం, అభ్యర్థులు, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ఎన్నికల కమిషన్ కే ఉంటుందని రామయ్య స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చాక, దానికి విరుద్ధంగా నిఘా యాప్ ను ముఖ్యమంత్రి ఆవిష్కరించడం చట్టవిరుద్ధం కాదా అని వర్ల ప్రశ్నించారు. చట్టాలు గౌరవించాల్సిన వ్యక్తే, చట్టాలను అమలు చేయాల్సిన వ్యక్తే, కోడ్ ఆఫ్ కండక్ట్ ను ధిక్కరించడం జరిగిందన్నారు. అటువంటి పనికి పాల్పడినందుకు తనపై ఏం చర్యలు తీసుకోవాలో జగన్మోహన్ రెడ్డే చెప్పాలన్నారు. జగన్ నిఘా యాప్ ను ఆవిష్కరిస్తుంటే, అధికారులు దాన్ని నిరోధించకుండా, పక్కనే ఉండి ఆయనకు సహకరించారని, కాబట్టి వారుకూడా శిక్షార్హులే అవుతారని రామయ్య తేల్చిచెప్పారు. నిబంధనావళిని అతిక్రమించినందుకు జగన్ పై, ఇతర అధికారులపై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని కోరుతూ ఎన్నికల కమిషనర్ ను కలవడం జరిగిందన్నారు.

మద్యం, డబ్బు పంచితే వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమైనదని, అదొక తప్పుడు ఆర్డినెన్స్ అని, ప్రతిపక్ష పార్టీ సభ్యులను భయపెట్టి దారికి తెచ్చేందుకు, ప్రభుత్వం దానిని అస్త్రంగా వాడుకుంటోందని వర్ల దుయ్యబట్టారు. ఎన్నికలు జరిగేవరకు, ఈ 22రోజుల పాలు రాష్ట్రంలోని మద్యం దుకాణాలన్నీ మూసేస్తే ఏ గొడవ ఉండదని, అటువంటి పనిచేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ఆ పనిచేయకుండా చట్టం ముసుగులో, గిట్టనివారిపై కక్ష తీర్చుకోవాలని చూడటం ఎంతవరకు భావ్యమని రామయ్య నిలదీశారు. గెలిచినవాడి పదవినికూడా, ముందు సరఫరా చేశాడనో.. డబ్బు పంచాడనో సాకులుచూపి, ఊడపీకేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ఉపయోగపడుతుందన్నారు. అందువల్ల రాష్ట్రంలో ఎన్నికలు ముగిసేవరకు మందుసీసా అనేది కనపడకుండా చేయాలని, మద్యం దుకాణాలన్నీ మూసేయాలని రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిని కోరడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నిఘా యాప్ ను ఆవిష్కరించిన విషయం తనకు తెలుసునని, ఎన్నికల కార్యదర్శి కూడా చెప్పారన్నారు. మద్యం దుకాణాలు మూసేసినంత మాత్రాన ఎవరూ నష్టపోయేది లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వర్ల తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్​ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు దశల్లో ఎన్నికల నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. తొలి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11వరకు నామినేషన్లు స్వీకరించి.. ఈనెల 12న నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 14వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. 21న పోలింగ్ జరుగనుండగా.. ఈనెల 24న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రతి జిల్లాలో 2 విడతల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పంచాయతీ ఎన్నికలకు ఈ నెల 17 నుంచి 19 వరకు తొలివిడత నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 20న తొలివిడత నామినేషన్ల పరిశీలన.. 22వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈనెల 27న తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ , అదే రోజు ఫలితాలు వెలువడతాయి.

jagan 08032020 2

ఈ నెల 29న రెండో విడత పంచాయతీ ఎన్నికలు, అదే రోజు ఫలితాలు విడుదల చేస్తారు. ఈనెల 9న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరణ.. 14న నామినేషన్ల పరిశీలన.. 16న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈనెల 23న పోలింగ్ నిర్వహించి.. 27న ఫలితాలు వెల్లడించనున్నారు. అయితే ఇది ఇలా ఉంటే, ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్న గ్రామాల విషయంలో, ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించ వద్దు అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసింది. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాల్లో సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఆపేయాలని ఆ లేఖలో ప్రభుత్వం కోరింది.

jagan 08032020 3

హైకోర్టులో ఈ గ్రామాల విషయంలో కేసులు, వ్యాజ్యాలు ఉన్నందున వాటి దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయితే అమరావతి ఉద్యమం నేపథ్యంలో, ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపధ్యంలోనే ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసినట్టు అర్ధం అవుతుంది. ఇక్కడ ప్రజలు గత 82 రోజులుగా ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కనుక ఎన్నికలు పెట్టి, ఇక్కడ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఎన్నికల్లో కనిపిస్తే, ప్రభుత్వం పరువు పోతుంది అని, జగన్ ప్రభుత్వం భయంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రజలను పలకరించే ధైర్యం కూడా వైసీపీ చేయలేక పోతుంది. ఈ నేపధ్యంలోనే, ఇక్కడ ప్రచారానికి కూడా వెళ్ళలేం అని తెలియటంతో, ఎన్నికల కమిషన్ కు ఇక్కడ ఎన్నికలు ఆపేయాలని విజ్ఞప్తి చేసింది.

Advertisements

Latest Articles

Most Read