అమరావతి మీద ముందు నుంచి ద్వేషంతో ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అధికారంలో రాగానే, అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ముందుగా, అమరావతి నిర్మాణాలు అన్నీ ఆపేసారు. తరువాత, అమరావతి రాజధానిగా ఉండదని, మూడు ముక్కలు చేస్తున్నాం అని, గుండెకాయి లాంటి సెక్రటేరియట్ వైజాగ్ తీసుకు వెళ్తున్నాం అని చెప్పారు. అమరావతిలో కేవలం అసెంబ్లీ మాత్రమే ఉంటుందని అన్నారు. దీని పై అసెంబ్లీలో తీర్మానం చెయ్యటం, తరువాత శాసనమండలిలో సెలెక్ట్ కమిటీ పేరుతొ దీనికి బ్రేక్ పడింది. ఒకసారి నిర్ణయం జరిగి, ఆక్కడ 1500 కోట్లు రాజధాని నిర్మాణానికి నిధులు ఇచ్చి, స్వయంగా ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో, రాజధాని మారుస్తుంటే, కేంద్రం మాత్రం చూస్తూ కూర్చుంది. కేవలం కోర్ట్ లు మాత్రమే, ఈ అంశం పై గట్టిగా ఉన్నాయి. రేపు 26 వ తేదీన ఈ విషయం పై హైకోర్ట్ కూడా స్పష్టత ఇవ్వనుంది. అయినా విషయం కోర్ట్ లో ఉన్నా సరే, వైజాగ్ తరలింపు మాత్రం గుట్టుగా జరిగిపోతుందని అంటున్నారు.

navy 22022020 2

సెక్రటేరియట్, వైజాగ్ లో ని మిలీనియం టవర్స్ లో వస్తుందని, ప్రచారం చేసారు. ఇందుకు తగ్గట్టే ప్రభుత్వ చర్యలు కూడా ఉండటంతో, విశాఖ మిలీనియం టవర్స్ లో, నిర్మాణం తధ్యం అని అందరూ అనుకున్నారు. అయితే, సరిగ్గా ఇలాంటి టైంలో, జగన్ కు షాక్ ఇచ్చింది ఇండిన నేవీ. మిలీనియం టవర్స్ లో, సచివాలయం ఏర్పాటు చెయ్యాలి అంటూ, ఏపి ప్రభుత్వం అడుగులు వేస్తున్న వార్తలు తెలుసుకున్న ఇండిన నేవీ, తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఇండియన్ నేవీని చెప్పటంతో, ఇక మిలీనియం టవర్స్ లో, సచివాలయం పెట్టే సాహసం చెయ్యలేక పోవచ్చని అంటున్నారు. ఇదే విషయం పై, జగన్ ఢిల్లీ వెళ్లి ఉంటారని, అందుకనే అమిత్ షా తో కూడా భేటీ అయ్యి, నేవీని ఒప్పించి మని ఉంటారని అనుకుంటున్నారు.

navy 22022020 3

ఇప్పటికే ఇండియన్ నేవీ ఈ విషయం పై, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు, ఈ రోజు ప్రముఖ జాతీయ పత్రికలో వార్తా కధనం వచ్చింది. దేశ భద్రతకు అత్యంత కీలకమైన ఐఎన్ఎస్ కళింగకు, దగ్గరలో ఉన్న మిలీనియం టవర్స్ లో, నిత్యం రద్దీగా ఉండే సచివాలయం లాంటి శాఖలను పెట్టుకోవటానికి, ఒప్పుకోం అని చెప్పినట్టు సమాచారం. శత్రు దేశాలకు, విశాఖపట్నం, ప్రాధాన లక్ష్యం అని, ఇక్కడ ఎన్నో ప్రముఖ పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉన్నాయని, దేశ భద్రత దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రాంతాన్ని ఎంచుకోక పోవటమే మంచింది అని, నేవీ అధికారులు చెప్పారు. ఇక్కడ సచివాలయం పెరిగితే, ఆక్టివిటీ ఎక్కువ అయ్యి, చాలా సమస్యలు వస్తాయని, ఐఎన్ఎస్ కళింగ వ్యూహాత్మక ప్రాంతమని, 734 ఎకరాలల్లో విస్తిరించి కీలక ప్రాంతం అని, చెప్పినట్టు తెలుస్తుంది.

గత అయుదు ఏళ్ళ కాలంలో, చంద్రబాబు పై, ఆయన ప్రభుత్వం పై ఎలాంటి ఆరోపణలు, వైసీపీ, తన సొంత పత్రిక, ఛానల్ చేసాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ చేతకానితనంతో, అవే ఆరోపణలు నిజం అని ప్రజలు నమ్మారు కూడా. ఆరు లక్షల కోట్లు అవినీతి చంద్రబాబు చేసారని, వైసీపీ పుస్తకాలు వేస్తె, అమ్మో చంద్రబాబు ఇంత తిన్నాడా అని నమ్మిన వారు ఉన్నారు అంటే ఆశ్చర్యం కాదు. ఇక ఇంకీముంది జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు, అవినీతి పై యుద్ధం అంటున్నాడు, చంద్రబాబు జైలుకు వెళ్ళటం ఖాయం, 6 లక్షల కోట్లు కాకపోయినా, 6 కోట్లు అవినీతి దొరికినా చంద్రబాబు జైలుకు వెళ్ళటం ఖాయం అంటూ, వైసీపీ శ్రేణులు సంబర పడ్డాయి. నెల అయ్యింది, మూడు నెలలు అయ్యింది, ఆరు నెలలు అయ్యింది, ఇప్పుడు తొమ్మిదో నెల. చివరకు ఏమైనా తెల్చారా అంటే, కొండను తవ్వుతూనే ఉన్నారు కాని, ఎలక తోక కూడా దొరకలేదు. ఈ చిరాకులో తప్పుల మీద తప్పులు చేస్తూ, చంద్రబాబుకి మేలు చేస్తున్నారు అనే విషయం జగన్ మర్చిపోతున్నారు.

తన ప్రభుత్వం చేతే అనేక ఎంక్వయిరీలు వేయించి, ఇప్పటి వరకు ఏమి తేల్చలేదు అంటే, చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇస్తున్నట్టే కాదా. మొదటగా సెక్రటేరియట్ కు వెళ్ళిన సమయంలో, అక్కడ ఉద్యోగులకు జగన బంపర్ ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చెప్తే, బహుమతులు ఇస్తాం అన్నారు. తరువాత, మంత్రుల కమిటీలు అన్నారు. తరువాత అధికారుల కమిటీతో విచారణ అన్నారు. తరువాత విజిలెన్స్ విచారణ అన్నారు, తరువాత సిఐడి విచారణ అన్నారు, తరువాత ఐటి, ఈడీకి విచారణ చెయ్యమని ఉత్తరాలు రాసారు. మరి ఈ విచారణలు అన్నీ ఏమయ్యాయి ? చివరకు చంద్రబాబు రూపాయి కూడా అవినీతి చెయ్యలేదు అని తేల్చాల్సిన పరిస్థితి. ఇక ఇవన్నీ కాదని, పోలీసులతో నిన్న రాత్రి సిట్ వేయిస్తున్నట్టు, జీవో ఇచ్చారు.

అయితే ఈ జీవో పై, తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద నవ్వు నవ్వి ఊరుకుంది. పోలీసులు క్రైమ్ కేసులు విచారణ చేస్తారు కాని, ప్రభుత్వంలో జరిగే ఫైల్స్ చూసి విచారణ చేసే అంత ఉంటుందా ? వారికి ఆ సామర్ధ్యం ఉంటుందా అని టిడిపి ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణ పేరుతొ, ఈ పోలీసుల దగ్గరకు, టిడిపి నాయకులను, చంద్రబాబుని తీసుకొచ్చి, పైశాచిక ఆనందం పొందటానికి తప్ప, జగన్ చేసేది ఏమి లేదు అంటూ టిడిపి తేల్చేసింది. ఒక దానిపై ఇంకొక‌టి వేస్తున్నావంటే ఏమీ దొర‌క‌లేద‌నే క‌దా! అంటూ టిడిపి ఒక్క ముక్కలో తేల్చేసింది. గతంలో రాజశేఖర్ రెడ్డి 26 పైగా విచారణలు వేసి, రూపాయి కూడా నిరూపించ లేక చేతులు కాల్చుకున్నారని, ఇప్పుడు కొడుకు కూడా 9 నెలలు నుంచి ఏమి తేల్చలేక, ఇప్పుడు పోలీసులతో అవినీతి పై విచారణ అంటూ కామెడీ చేస్తున్నారని అంటున్నారు. మరి సిట్ ఏమి తెల్చుతుందో, ఇది అయిపోయిన తరువాత, మళ్ళీ ఏ విచారణ అంటూ టైం పాస్ చేస్తారో చూడాలి.

జగన్ అక్రమఆస్తుల పై ప్రముఖ వ్యాపారవేత్త ఎన్‌.శ్రీనివాసన్‌ పై, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఫైర్ అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, సిబిఐ కేసు ఆధారం చేసుకుని, తన పై, ఈడీ పెట్టిన కేసును కొట్టేయలంటూ, శ్రీనివాసన్ హైకోర్ట్ లో కేసు వేసారు. ఈ సందర్భంలో జరిగిన వాదనల్లో, ఈడీ తీవ్రంగా స్పందించింది. హైకోర్ట్ ముందు తమ వాదనలు వినిపించిన ఈడీ, శ్రీనివాసన్ పై ఫైర్ అయ్యింది. అక్రమ ఆస్తుల కేసులో, జగన్ కు చెందిన కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన కంపెనీగా, ఆ కంపెనీకి వైఎస్ చైర్మెన్ గా, ఎండీగా ఉన్న శ్రీనివాసన్, కంపెనీ తీసుకున్న నిర్ణయాలతో సంబంధం లేదు అని ఎలా చెప్తారని, ఆ కంపెనీ తీసుకున్న ప్రతి నిర్ణయానికి, శ్రీనివాసన్ బాధ్యత తీసుకోవాల్సిందే అంటూ, ఈడీ హైకోర్ట్ ముందు తన వాదనలు వినిపించింది. ఇది మేము చెప్తుంది కాదని, కంపెనీ డైరెక్టర్ లు గా ఉన్నవారు, కంపెనీలు తీసుకున్న నిర్ణయంతో, బాధ్యత తీసుకోవాలని, ఫెరా చట్టం సహా పలు చట్టాల్లో స్పష్టంగా ఉందంటూ, ఈడీ హైకోర్ట్ కు నివేదించింది.

ed 21022020 2

దీని ప్రకారం, ఇండియా సిమెంట్స్ తీసుకున్న నిర్ణయాలకు, ఆ కంపెనీ ఎండీగా, వైస్ చైర్మెన్ గా, శ్రీనివాసన్ కు సంబంధలేదు అని చెప్పటం, కరెక్ట్ కాదని, ఈడీ చెప్పింది. నష్టాల్లో ఉన్న కంపెనీలకు, అలాగే ఉత్పత్తి ప్రారంభం కాని కంపెనీల్లో, అధిక ప్రీమియంతో పెట్టుబడులు పెట్టటం చూస్తే, తనకు వైఎస్ ప్రభుత్వం జరిగిన లబ్ది వల్లే, ఈ విధంగా క్విడ్ ప్రోకో లో, ముడుపులు చెల్లించినట్టు అర్ధం అవుతుందని పేర్కొంది. మనీ లాండరింగ్ నిరోధకి చట్టం కింద నమోదైన కేసులో, ఇంకా వాస్తవాలు తెలకొండానే, కోర్ట్ జోక్యం చేసుకోరాదని, ఈ విషయం తేలే దాకా, మినహయింపు ఇవ్వటం కుదరదని , ఈడీ చెప్పింది. శ్రీనివాస వేసిన పిటీషన్ పై, ఈడీ, హైకోర్ట్ సూచన మేరకు, హైకోర్ట్ లో తన కౌంటర్ దాఖలు చేస్తూ, పై విధంగా స్పందించింది.

ed 21022020 3

కడపలో, ఇండియా సిమెంట్స్ కు నిబంధనలకు వ్యతిరేకంగా, 2.60 ఎకరాల లీజుతో పాటు, టి కేటాయింపులు ఇచ్చినందుకు ప్రతి ఫలంగా, ఇండియా సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్ లో రూ.40 కోట్లు, భారతి సిమెంట్స్‌లో రూ.95.32 కోట్లు, కార్మెల్‌ ఏసియాలో రూ.5 కోట్లు పెట్టుబడులుగా పెట్టారని, అది కూడా అధిక ప్రీమియం చెల్లించి పెట్టారని, తన సొంత కంపెనీలో పురోగతి లేకోయినా, అదే రంగంలో ఉన్న మరో కంపెనీలో పెట్టటం చూస్తే, ఇది క్విడ్ ప్రోకో అని అర్ధం అవుతందని ఈడీ వాదించింది. దీనిలో భాగంగానే, 2010 మార్చిలో మరో రూ.50 కోట్లు అదే ప్రీమియంతో పెట్టుబడి పెట్టిన రెండు నెలల్లోనే ప్రీమియం సగానికి పడిపోయిన సమయంలో, ఫ్రెంచి కంపెనీ నుంచి ఆకర్షణీయమైన ధర వచ్చిందని, విక్రయించాలంటూ విజయసాయిరెడ్డి నుంచి వచ్చిన సూచనతో వాటాలు విక్రయించారని ఈడీ పేర్కొంది. శ్రీనివాస్ పెట్టుకున్న పిటీషన్ కొట్టేయాలని కోర్ట్ ను కోరింది.

చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, ఆయన్ను ఎలా అయినా అవినీతి కేసుల్లో ఇరికించాలని, సోలార్, విండ్ ఎనర్జీ విషయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల పై, కొత్తగా వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మళ్ళీ సమీక్ష చేస్తాం అంటూ, ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే దీని పై విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థలు మండి పడ్డాయి. ప్రధానితో ఫిర్యాదు చేసినా, చివరకు కేంద్ర మంత్రి చెప్పిన వినలేదు. చివరకు కోర్ట్ లలో విషయం ఉంది. ఇప్పటికే జపాన్, ఫ్రాన్స్ లాంటి దేశాలు, ఇలాంటి చర్యలతో, మా పెట్టుబడులకు ఇబ్బంది అని, మీ దేశంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టం అంటూ హెచ్చరించాయి. ఇదే విషయం పై దావోస్ లో జరిగిన, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కూడా చర్చ జరిగింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ను, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఈ విషయం పై నిలదీసారు. ఒక ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందం, మరో ప్రభుత్వం మారగానే, ఎలా సమీక్ష చేస్తారు, ఇలా అయితే ఎవరూ పెట్టుబడులు పెట్టరు అంటూ నిలదీశారు.

ppa 21022020 2

దీంతో ప్రపంచవ్యాప్తంగా, ఈ రంగం పై, ఇంపాక్ట్ పడింది అని గ్రహించిన కేంద్రం ప్రభుత్వం, మన దేశంలో, విద్యుత్ రంగంలో చేసుకున్న ఒప్పందాలకు, భద్రత కల్పించేలా కీలక అడుగులు వెయ్యటానికి, నిర్ణయం తీసుకుంది. ఒప్పందాలు కనుక ఉల్లంఘన జరిగితే, వారి పై చర్యలు తీసుకునే విధంగా, ప్రత్యెక ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యటానికి నిర్నయం తీసుకుంది. ఢిల్లీ అధికార వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం, విద్యుత్ రంగంలో, పెట్టుబడి పెట్టే వారికి, అదనంగా చట్ట భద్రత కలిగించేందుకు, ట్రిబ్యునల్ ఒకటి ఏర్పాటు చెయ్యాలని, కేంద్ర విద్యుత్తు, పునరుత్పాదక ఇంధనశాఖ నిర్ణయం తీసుకునట్టు సమాచారం. ఈ దిశగా ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని, దీని పై త్వరలోనే కీలక అడుగులు వేస్తారని సమాచారం.

ppa 21022020 3

రాష్ట్రాలు అన్నీ ఈ ట్రిబ్యునల్ పరిధిలోకి వచ్చేలా, 2003 విద్యుత్ చట్టానికి, సవరణలు చేసి, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో, కేంద్రం బిల్లు పెడుతుందని అధికారులు చెప్తున్నారు. రిటైర్డ్ జడ్జి, ఈ ట్రిబ్యునల్ కు సారధ్యం వహిస్తారని, రాష్ట్రాలు అన్నీ ఈ ట్రిబ్యునల్ పరిధిలో పని చేస్తాయని అంటున్నారు. దేశం అంతటా ఈ ట్రిబ్యునల్ కు శాఖలు ఉంటాయి. విద్యుత్ ఒప్పందాలు అన్నీ , ట్రిబ్యునల్ పర్యవేక్షణ చేస్తుంది. ఒప్పందం ప్రకారం, విద్యుత్ కొనేందుకు నిరాకరిస్తే, ఆ రాష్ట్రాల డిస్కమ్‌లు ఆస్థులు జప్తు చేసి, ఒప్పందం విలువకు సరిపడా మొత్తాన్ని రాబట్టగల అధికారులు, ఈ చట్టం ద్వారా, ట్రిబ్యునల్ కు రానుంది. దీంతో, రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టు, చెయ్యటం కుదరదు. ఏపిలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో, అలెర్ట్ అయిన కేంద్రం, ఈ కొత్త చట్టం తీసుకు రానుంది.పునఃసమీక్షించాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడం తీవ్ర చర్చనీయాంశమయిన సంగతి తెలిసిందే.

Advertisements

Latest Articles

Most Read