గత అయుదు ఏళ్ళ కాలంలో, చంద్రబాబు పై, ఆయన ప్రభుత్వం పై ఎలాంటి ఆరోపణలు, వైసీపీ, తన సొంత పత్రిక, ఛానల్ చేసాయో అందరికీ గుర్తుండే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ చేతకానితనంతో, అవే ఆరోపణలు నిజం అని ప్రజలు నమ్మారు కూడా. ఆరు లక్షల కోట్లు అవినీతి చంద్రబాబు చేసారని, వైసీపీ పుస్తకాలు వేస్తె, అమ్మో చంద్రబాబు ఇంత తిన్నాడా అని నమ్మిన వారు ఉన్నారు అంటే ఆశ్చర్యం కాదు. ఇక ఇంకీముంది జగన్ మోహన్ రెడ్డి వచ్చాడు, అవినీతి పై యుద్ధం అంటున్నాడు, చంద్రబాబు జైలుకు వెళ్ళటం ఖాయం, 6 లక్షల కోట్లు కాకపోయినా, 6 కోట్లు అవినీతి దొరికినా చంద్రబాబు జైలుకు వెళ్ళటం ఖాయం అంటూ, వైసీపీ శ్రేణులు సంబర పడ్డాయి. నెల అయ్యింది, మూడు నెలలు అయ్యింది, ఆరు నెలలు అయ్యింది, ఇప్పుడు తొమ్మిదో నెల. చివరకు ఏమైనా తెల్చారా అంటే, కొండను తవ్వుతూనే ఉన్నారు కాని, ఎలక తోక కూడా దొరకలేదు. ఈ చిరాకులో తప్పుల మీద తప్పులు చేస్తూ, చంద్రబాబుకి మేలు చేస్తున్నారు అనే విషయం జగన్ మర్చిపోతున్నారు.

తన ప్రభుత్వం చేతే అనేక ఎంక్వయిరీలు వేయించి, ఇప్పటి వరకు ఏమి తేల్చలేదు అంటే, చంద్రబాబుకి క్లీన్ చిట్ ఇస్తున్నట్టే కాదా. మొదటగా సెక్రటేరియట్ కు వెళ్ళిన సమయంలో, అక్కడ ఉద్యోగులకు జగన బంపర్ ఆఫర్ ఇచ్చారు. చంద్రబాబు అవినీతి చెప్తే, బహుమతులు ఇస్తాం అన్నారు. తరువాత, మంత్రుల కమిటీలు అన్నారు. తరువాత అధికారుల కమిటీతో విచారణ అన్నారు. తరువాత విజిలెన్స్ విచారణ అన్నారు, తరువాత సిఐడి విచారణ అన్నారు, తరువాత ఐటి, ఈడీకి విచారణ చెయ్యమని ఉత్తరాలు రాసారు. మరి ఈ విచారణలు అన్నీ ఏమయ్యాయి ? చివరకు చంద్రబాబు రూపాయి కూడా అవినీతి చెయ్యలేదు అని తేల్చాల్సిన పరిస్థితి. ఇక ఇవన్నీ కాదని, పోలీసులతో నిన్న రాత్రి సిట్ వేయిస్తున్నట్టు, జీవో ఇచ్చారు.

అయితే ఈ జీవో పై, తెలుగుదేశం పార్టీ ఒక పెద్ద నవ్వు నవ్వి ఊరుకుంది. పోలీసులు క్రైమ్ కేసులు విచారణ చేస్తారు కాని, ప్రభుత్వంలో జరిగే ఫైల్స్ చూసి విచారణ చేసే అంత ఉంటుందా ? వారికి ఆ సామర్ధ్యం ఉంటుందా అని టిడిపి ప్రశ్నిస్తున్నారు. సిట్ విచారణ పేరుతొ, ఈ పోలీసుల దగ్గరకు, టిడిపి నాయకులను, చంద్రబాబుని తీసుకొచ్చి, పైశాచిక ఆనందం పొందటానికి తప్ప, జగన్ చేసేది ఏమి లేదు అంటూ టిడిపి తేల్చేసింది. ఒక దానిపై ఇంకొక‌టి వేస్తున్నావంటే ఏమీ దొర‌క‌లేద‌నే క‌దా! అంటూ టిడిపి ఒక్క ముక్కలో తేల్చేసింది. గతంలో రాజశేఖర్ రెడ్డి 26 పైగా విచారణలు వేసి, రూపాయి కూడా నిరూపించ లేక చేతులు కాల్చుకున్నారని, ఇప్పుడు కొడుకు కూడా 9 నెలలు నుంచి ఏమి తేల్చలేక, ఇప్పుడు పోలీసులతో అవినీతి పై విచారణ అంటూ కామెడీ చేస్తున్నారని అంటున్నారు. మరి సిట్ ఏమి తెల్చుతుందో, ఇది అయిపోయిన తరువాత, మళ్ళీ ఏ విచారణ అంటూ టైం పాస్ చేస్తారో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read