మూడు రోజుల క్రితం, మందడంలో మహిళలను పోలీసులు అరెస్ట్ చెయ్యటంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. మహిళలను అరెస్ట్ చెయ్యటంతో పాటుగా, వారిని లాగి పడేయటం, బూతులు తిట్టటం కూడా చేసారు అంటూ, కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ రోజు పోలీసులు స్పందిస్తూ, మహిళలు రోడ్డుకు అడ్డుగా ఉండటంతో, వారిని తప్పించే క్రమంలో, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ఆ సందర్భంగా మహిళలకు చిన్న చిన్న గాయాలు అయ్యాయని, మేము కావాలని వారి పై దురుసుగా ప్రవర్తించలేదు అని చెప్పారు. అయితే, ఈ రోజు ఉదయం, పోలీసులు మొన్న జరిగిన సంఘటన పై ప్రెస్ మీట్ పెట్టరు. మందడంలో పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, వారు మాట్లాడుతూ, మహిళలే పోలీసుల పై ఎదురు తిరిగారని, మహిళా కానిస్టేబుళ్ల పై వారే, దాడి చేశారని తుళ్లూరు డీఎస్పీ వెల్లడించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేసారు.

police 06012020 2

అయితే ఈ సందర్భంగా మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. కానిస్టేబుళ్ల పై దాడి జరిగితే ఆ రోజే, ఎందుకు చెప్పలేదని, మూడు రోజుల తరువాత ఎందుకు చెప్తున్నారు అంటూ పోలీసులని ప్రశ్నించగా, మీడియా ప్రశ్నలకు పోలీసులు సమాధానం దాటవేశారు. పోలీసుల స్పందన పై, రాజధాని రైతులు స్పందిస్తూ, పోలీసులు పొంతనలేని సమాధానాలు చెప్తున్నారని, ఆ రోజు ఏమి జరిగిందో, మీడియాలో మొత్తం, రాష్ట్ర ప్రజలు అందరూ చూసారని వాపోయారు. మేము కొడితే, దాడి చేస్తే, పోలీసులు మమ్మల్ని వదిలి పెట్టే వారా అని ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు మాత్రం, ఏదో తోపులాటలో గాయాలు అయ్యాయని చెప్పి, ఇప్పుడు ఎదురు మేమే దాడి చేసాం అని చెప్తున్నారని, ఈ వంకతో, మా ఆడవాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు.

police 06012020 3

మరో పక్క ఈ రోజు అమరావతిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు రాజధాని గ్రామాల్లో మహా పాదయత్రకు రైతులు సిద్ధం అవుతున్నారు. అయితే, ఈ పాదయత్రకు పర్మిషన్ లేదని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని, నిరసన తెలపటంలో తప్పు లేదు కాని, ఎదుటు వారికి ఇబ్బంది కలిగిస్తే, పోలీసులు చూస్తూ కూర్చోరని, అడిషనల్‌ ఎస్పీ చక్రవర్తి అన్నారు. అయ్తీ రైతులు మాత్రం, తుళ్లూరు నుండి మందడం వరకు ర్వాలి చేస్తామంటున్నారు. శాంతియుతంగా ర్వాలీ చేస్తుంటే అడ్డుకుంటే సహించేలేదంటున్నారు రైతులు. ఇప్పటి వరకు శాంతియుతంగానే చేసామని, ఇక ముందు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, పోలీసులు సహకరించాలని కోరుతున్నారు.

జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసు, ఎన్నికల ముందు నుంచి కొంచెం స్లో అయ్యింది. ఎన్నికల్లో జగన్ బిజీగా ఉండటంతో, ఆయన విచారణకు కూడా హాజరు కాలేదు. అయితే తరువాత ఆయన ఎన్నికల్లో గెలవటంతో, తాను ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి అని చెప్తూ, ప్రతి వారం ఏదో ఒకటి చెప్పి, శుక్రవారం విచారణకు హాజరు కాకుండా ఉంటున్నారు. అయితే ఈ కేసు నెమ్మదిగా నీరు గారి పోతుంది అని అందరూ భావిస్తున్న సమయంలో, మూడు రోజుల క్రితం, సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇక వారం వారం మినహాయింపు ఇవ్వటం కుదరదని, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, ప్రతి వారం కోర్ట్ కు రావాల్సిందే అని, వచ్చే శుక్రవారం, 10వ తారీఖు కచ్చితంగా కోర్ట్ కు హాజరు కావలి అంటూ, సిబిఐ కోర్ట్, ఆదేశాలు జారీ చేసింది. దీంతో జగన్ క్యాంప్ లో మళ్ళీ ఆందోళన మొదలైంది. సియం హోదాలో ఉంటూ కోర్ట్ కు వెళ్తే, అది నైతికంగా తప్పు అని భావిస్తున్నారు. గతంలో లాలూ, మధు కోడా మాత్రమే అలా చేసారని, ఇప్పుడు జగన్ మూడో వారు అవుతారని, ప్రతిపక్షాలకు అవకాసం ఇచ్చినట్టు అవుతుందని, భావిస్తున్నారు.

dharamana 05012020 2

అయితే, ఈ షాక్ నుంచి తెరుకోక ముందే, ఇప్పుడు మాజీ మంత్రి ప్రసాదరావుకు సిబిఐ కోర్ట్ షాక్ ఇచ్చింది. ఇది కూడా జగన్ అక్రమ ఆస్తుల కేసులోనే. ధర్మాన పై, సుప్రీం కోర్ట్ దాఖలైన కేసు ఎంత వరుకు వచ్చిందో చెప్పాలని, సిబిఐ ని కోరారు, హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి బీవీ మధుసూధన్ రావు. ధర్మాణ పై కేసును పరిగణనలోకి తీసుకోవడం చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు, ఏమి చేసింది, నిలిపి వేసిందా, లేదా అని చెప్పాలని కోర్ట్ కోరింది. ఈ వివరాలు తమకు జనవరి 7వ తేదీలోపు ఇవ్వాలని, సిబిఐని కోర్ట్ ఆదేశించింది. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి పెట్టిన వాన్ పిక్ చార్జ్ షీట్ లో, అప్పటి రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేరు కూడా పెట్టిన సంగతి తెలిసిందే.

dharamana 05012020 3

ధర్మాన క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో ఆయన ప్రాసిక్యూషన్‌కు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇవ్వక పోవటంతో, సీబీఐ కోర్టు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. అయితే తరువాత ప్రభుత్వం మారటం, ధర్మానకు మంత్రి పదవి పోవటంతో, ఆయన పాత్ర పై కూడా తేల్చాలి అంటూ, సీబీఐ మెమో దాఖలు చేయగా, సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే దీన్ని ధర్మాన హైకోర్టులో సవాలు చెయ్యటంతో, హైకోర్ట్ కొట్టేసింది. హైకోర్ట్ ఇచ్చిన ఈ ఉత్తర్వులను సిబిఐ సుప్రీం కోర్ట్ లో సవాలు చేసింది. అయితే ఈ పిటీషన్ చాలా రోజులుగా పెండింగ్ లో ఉండటంతో, ఆ పిటీషన్ ఏ దశలో ఉందొ చెప్పాలి అంటూ సిబిఐ కోరటంతో, ఇప్పుడు ధర్మాన పై ఒత్తిడి పెరుగుతుంది. ఉన్నట్టు ఉండి కేసులు స్పీడ్ అవ్వటంతో, ధర్మానకు మళ్ళీ అందోళన మొదలైంది.

గతంలో అమరావతి నిర్మాణం కోసం, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి విరాళాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విరాళలతో ఏదో కట్టేయాలని కాదు, ప్రజలు అందరూ భాగస్వామ్యం అవ్వాలని, ఈ అమరావతికి నేను కూడా ఒక పది రూపాయలు ఇచ్చాను, రాష్ట్ర రాజధానికి నేను నా వంతు సహాయం చేశాను అనే భావన ప్రజలకు కలగటానికి, అప్పటి పాలకులు ఇలా చేసారు. మై బ్రిక్, మై అమరావతి పేరుతొ, 10 రూపాయల చొప్పున ఇటుక పెట్టి, సామాన్యులు కూడా కొనుక్కుని, రాజధానిలో నా భాగస్వామ్యం కూడా ఉంది అని అనుకునేలా చేసారు చంద్రబాబు. అప్పట్లో చాలా సంస్థలు కూడా స్వచ్చందంగా చందాలు పోగీసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాయి. కొత్త రాష్ట్రం, రాజధాని కట్టుకోవాలి, ఇలా అనేక విధాలుగా అలోచించి, విరాళాల రూపంలో సహాయం చేసారు. ఇదే కోవలో, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలు కూడా, ఏపి రాజధాని పేరిట విరాళాలు ఇచ్చాయి. మొత్తం 2 కోట్ల 52 లక్షల 47 వేల 259 రూపాయలను 2014 అక్టోబరు 24వ తేదీన, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఏబీఎన్ ఆర్కే ఇచ్చారు.

rk 05012020 2

అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో కేవలం అసెంబ్లీ ఉంటుంది, పరిపాలన మొత్తం వైజాగ్ కు వెళ్తుంది అంటూ, హడావిడి చేస్తుంది. ఇప్పటికే కమిటీ రిపోర్ట్ లు ఈ విధంగా వచ్చాయి. మరో కమిటీ వేసారు. అది కూడా రాగానే, క్యాబినెట్, అసెంబ్లీ, అఖిలపక్షం పెట్టి, మూడు రాజధానుల నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో అమరావతిని చంపేసే పరిస్థితి తెచ్చారు. అప్పట్లో అమరావతికి విరాళాలు ఇచ్చిన వారు అందరూ, ఇప్పుడు తమ విరాళాల పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. తాము అప్పట్లో ఒక మంచి రాజధాని కోసం, అమరావతికి తమ భాగస్వామ్యం కూడా ఉండాలని, అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలు ఇచ్చామని, అంతే కాని చంద్రబాబుకు కాదని, మరి, ఇప్పుడు మా విరాళాలు సంగతి ఏమిటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

rk 05012020 3

ఇదే విషయం పై ఏబీఎన్ కు విరాళాలు ఇచ్చిన వారు కూడా తమను ప్రశ్నిస్తున్నారాని, అప్పట్లో 50 వేలు రూపాయలు ఇచ్చిన ఒక దాత, ఇప్పుడు మా విరాళం ఈ ప్రభుత్వం ఏమి చేస్తుంది అని అడుగుతున్నారని, ఏబీఎన్ వీకెండ్ కామెంట్ లో ఆర్కే చెప్పారు. అయితే, అలాంటి వారికి నా దగ్గర సమాధానం లేదని, తమ సంస్థని నమ్మి, అప్పట్లో ఏపి రాజధానికి విరాళాలు ఇచ్చిన వారందరికీ, నేను క్షమాపణ చెప్తున్నానని, ఇంతకు మించి నా దగ్గర కూడా ఎలాంటి సమాధానం లేదు అంటూ, ఆర్కే, తనకు విరాళం ఇచ్చిన అందరికీ, వీకెండ్ కామెంట్ బై ఆర్కే లో, బహిరంగ క్షమాపణ చెప్పారు. ఇది ఒక్క ఆర్కే సమస్య కూడా కాదు, విరాళాలు ఇచ్చిన అందరికీ, ఇప్పటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది కూడా.

జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రకటన వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని అమరాతి పరిధిలో రైతులు, మహిళలు, యువత నిర్వహిస్తున్న సకల జనుల స-మ్మె రోజు రోజుకు ఉదృతం అవుతోంది. ఓ పక్క ప్రభుత్వం నియమించిన కమిటీల నివేదికలు, మరో పక్క పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా చేపట్టిన మహా ధ-ర్నాలు, రహదారుల దిగ్బం-ధనాలు, రిలే దీక్ష-లతో రాజధాని ప్రాంతం మారుమోగుతుంది. పోలీసుల తీరుకు నిరసనగా రైతులు, రైతు కూలీలు శనివారం బందను చేపట్టారు. రాజధాని గ్రామాల్లో స్వచ్ఛందంగా బం-ద్ కొనసాగింది. ఈ రోజు కూడా పోలీసుల తీరుకు నిరసనగా సహాయ నిరాకరణ చేపట్టాలని రాజధాని గ్రామాల ప్రజలు నిర్ణయించారు. మంచినీరు, కాఫీ, టీలు, భోజనాది సౌకర్యాలు కల్పించకూడదని నిర్ణయించారు. చివరకు తమ దుకాణాల ముందు కూర్చోవ డానికి కూడా రైతులు ఒప్పుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. తమ గ్రామాల మీదుగా పోలీసు వాహనాలను వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.

amaravati 05012020 2

శాంతియుతంగా నిర-సన చేస్తున్న తమ పట్ల పోలీసులు అనైతికంగా వ్యవహరించారంటూ మహిళలు విరుచుకుపడ్డారు. రైతుల తీరుతో, తాగేందుకు నీళ్ళు కూడా ఇవ్వకపొవటంతో, పోలీసులు షాక్ అయ్యారు. ముఖ్యంగా మహిళా పోలీసులకు ఈ ఉదయం నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహాయ నిరకరణ ఉద్య-మం అంటే ఇలా ఉంటుందా అని వాపోతున్నారు. చివరకు  తమతో మాట్లాడటానికి కూడా ప్రజలు ఇష్టపడటం లేదని, తమను చూస్తేనే ముఖం తిప్పేసుకుని వెళ్లిపోతున్నారని మహిళా పోలీసులు అంటున్నారు. ఇక చేసేది లేక, పోలీసులకు కావలసిన అవసరాలు, విజయవాడ నుంచి తెప్పించుకుంటున్నారు. మహిళలపై పోలీసులు ప్రవర్తనకు నిరసనగా మందడంలో రైతులు, మహిళలు ఉదయమే రహదారిపైకి వచ్చి బైఠా-యించి నిరసన తెలిపారు.

amaravati 05012020 3

రహదారి అంతటా పరదాలు పరచి రాకపోకలను పూర్తిగా స్తంభింప-జేశారు. సీడి యాక్సిస్ రోడ్డుపై ఆయా ప్రాంతాలకు చెందిన రైతులు బైఠా-యించి రహదా రిని దిగ్బం-ధనం చేశారు. మహిళలపై పోలీసుల తీరుకు నిరసిస్తూ వెలగపూడి నుంచి మందడం గ్రామం వరకు మహిళలు, చిన్నారులు, రైతులు పెద్ద ఎత్తున ర్యా-లీ నిర్వహించారు. దొండపాడులో రైతు మృతికి మందడం గ్రామస్తులు సంతాపం ప్రకటించారు. మందడంలో జరిగిన మహా ధర్నాలో పీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ సంఘీభావం తెలిపి ప్రభుత్వ ధోరణిని ఎండగట్టారు. తాళ్లాయిపాలెంలో అంబేద్కర్, వైఎ స్ఆర్, ఎన్టీఆర్ విగ్రహాలకు ఆ ప్రాంత రైతులు, మహిళలు ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధా నుల నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలంటూ వినతిపత్రాలు అందించారు.  అమరా వతి రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తాము ఎటు వంటి అభ్యంతరం తెలుపమని, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించాలన్నదే తమ అభిమత మని స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read