మన దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో సిబిఐ రైడ్లు చెయ్యగానే, ఆ నేతలు, పార్టీ మారటం, చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నేతలను సిబిఐ, ఇన్కమ్ టాక్స్ ఎలా టార్గెట్ చేసిందో చూసాం. తరువాత, ఎన్నికలు అయిన తరువాత, కొంత మంది టిడిపి నేతలు బీజేపీలోకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా, గుంటూరు జిల్లా టిడిపి నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు పై, సిబిఐ రైడ్లు జరిగాయి. రాయపాటి ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకు డైరెక్టర్ గా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి హయంలో, ఆయన కంపెనీ అయిన ట్రాన్స్ ట్రాయ్ కు పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు. అయితే ఆ తరువాత వచ్చిన చంద్రబాబు, ఈ కంపెనీ పోలవరం ప్రాజెక్ట్ పనులు సరిగ్గా చెయ్యలేక పోతుందని గ్రహించారు. మళ్ళీ టెండర్ రద్దు చేసి, కొత్త టెండర్ పిలిస్తే, న్యాయ పరమైన చిక్కులు వస్తాయని గ్రహించి, పోలవరం ప్రాజెక్ట్ ను సబ్ కాంట్రాక్టు కింద నవయుగని తీసుకోవచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై, సిబిఐ దాడులు జరగటం సంచలనంగా మారింది.

rayapati 02012020 2

ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ పై ఇది వరకే సిబిఐ దాడులు చేసి, కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ ప్రమోటర్, రాయపాటి పై కూడా సిబిఐ దాడులు చేసి, ఆయన పై కూడా నిన్న కేసు బుక్ చేసారు. అయితే, ఈ రోజు తిరుమల దర్శనానికి వచ్చిన రాయపాటి, సంచలన వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతానికి తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయని, ఇప్పటికైతే పార్టీ మారే ఆలోచనదే లేదని అన్నారు. అయితే భవిష్యత్తులో పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని, తన అనుచరుల అభీష్టం మేరకు, పార్టీ మారే అవకాశాన్ని తీసి పారేయలేమని రాయపాటి అంటున్నారు. తన ఇంటి పై జరిగిన సిబిఐ సోదాలు గురించి మాట్లాడుతూ, సిబిఐ సోదాలకు వచ్చిన సమయంలో, తాను ఊరిలో లేనాని చెప్పారు. అయితే తనిఖీల తరువాత, ఏమి లభించలేదని, వారే చెప్పారని అన్నారు.

rayapati 02012020 3

సిబిఐ పెట్టిన కేసుతో తనకు సంబంధం లేదని అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ రోజు వారీ వ్యవహారాలతో, తనకుగానీ, తన కుటుంబీకులకు గానీ ప్రమేయం లేదని అన్నారు. త్వరలోనే సిబిఐకి అన్నీ తెలుస్తాయని రాయపాటి అన్నారు. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీని నెలకొల్పింది తానె అని, అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత, కంపెనీ రోజు వారీ కార్యక్రమాల గురించి పెద్దగా పట్టించుకోవటం లేదని అన్నారు. ఎండీ శ్రీధర్, సీఈవోలే మొత్తం కంపెనీ వ్యవహారాల్ని చూసుకుంటారని రాయపాటి అన్నారు. తన భార్య గతంలో ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి డైరెక్ట్ గా ఉండేవారని, ఆమె చనిపోయిన తర్వాత బ్యాలెన్స్ షీట్ పై సంతకాలు పెట్టాలి కాబట్టి, నామమాత్రంగా డైరెక్ట్ అయ్యానని అన్నారు.

అమరావతిపై ఒక సంచలన ప్రతిపాదన సిద్దమైంది. దీనిపై ఆంధ్రప్రదేశ్ సర్కారు కసరత్తు చేస్తోంది. రాజధాని మార్పునకే మొగ్గు చూపుతున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అమరావతిని ప్రత్యేక వ్యవసాయ మండలిగా రూపుదిద్దాలని భావిస్తోంది. దీనిపై నియమించిన వ్యవసాయ నిపుణుల కమిటీ ప్రత్యేక వ్యవసాయ మండలిపై సిఫార్సులను సిద్ధం చేసింది. దీని ప్రకారం రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న భవనాలు రోడ్లను అలాగే ఉంచి, మిగిలిన భూములను ఎస్ఎజడ్ పరిథిలోకి తేవాలనేది ఆ సిఫార్సు, దీని ప్రకారం ఇక్కడ నాణ్యమైన పంటల సాగుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. రైతులు ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన భూములనే కాక, ప్రభుత్వ భూములను కూడా ఎస్ఎజడ్ పరిథిలోకి తెస్తారు. విలువైన పంటల హబ్ గా అమరావతిని తీర్చిదిద్దాలనేది నిపుణుల సిఫార్సు చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ లో వీటిని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఈ భూములలో రెండు నుంచి మూడు పంటలను పండించేవారని, అందుకే ఇప్పుడు ఇలా చేస్తే ఎలా ఉంటుందని వైసీపీ ప్రభుత్వంలో ఆలోచిస్తుంది.

jagan 02012019 2

2014లో ప్రభుత్వానికి రైతులు భూములు ఇచ్చారు. రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని కోసం, తమ భూములు త్యాగం చేసారు. రాష్ట్ర భవిష్యత్తుతో పాటుగా, తమ భవిష్యత్తు కూడా బాగుంటుందని ఆశ పడ్డారు. ప్రభుత్వానికి ఇచ్చిన భూముల్లో భవంతుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ, సెక్రటేరియేట్, హైకోర్టు భవనాలతో పాటు మంత్రుల నివాస సముదాయాలను కూడా నిర్మించారు. తరువాత ఇక్కడ చాలా రోడ్లు కూడా వేసారు. దాదాపుగా 320 కిమీ రోడ్లు వేసారు. అలాగే భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కూడా కేటాయించారు. అంటే ఒకరి భూమిలో, మరొకరికి ప్లాట్ వచ్చి ఉంటుంది. ఇలా మొత్తం, రైతులకు ఇచ్చిన భూములు అన్నీ, ఇప్పటికే కొంత మేర నిర్మాణాలతో కళకళ లాడుతున్నాయి.

jagan 02012019 3

అయితే తాజాగా మూడు రాజధానులను ఏర్పాటు చేయాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయం అనంతరం తాజాగా, ఈ ప్రత్యేక వ్యవసాయ మండలి ప్రతిపాదన రావడం సంచలనమే. 3 రాజధానుల ప్రతిపాదనపై ప్రతిపక్షాలు ముఖ్యంగా చంద్రబాబు భగ్గుమంటున్న క్రమంలో వచ్చిన ఎస్ఎసిడ్ సిఫార్సుతో జగన్ ప్రభుత్వం ఒడ్డున పడుతుందా? ఈ ప్రాంతంలో వ్యవసాయ జోన్ ఏర్పాటు చేయటాన్ని ప్రతిపక్షాలు, ముఖ్యంగా రైతులు ఏ విధంగా అర్థం చేసుకుంటారో చూడాలి. అయితే రైతులు మాత్రం, ఈ ప్రతిపాదనను తోసి పుచ్చుతున్నారు. ఇప్పటికే ఇక్కడ నిర్మాణాలు జరిగి, రోడ్లు వేసి, ప్లాట్లు వేసి ఉన్న చోట, వ్యవసాయం ఎలా చేసుకుంటామని, ఈ భూములు వ్యవసాయానికి, పనికి రావని వాపోతున్నారు.

గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచు కోట లాంటిది. గతంలో దాసరి బాలవర్ధాన్ రావు కానీ, మొన్న ఇంత గాలిలో కూడా వంశీ గెలిచాడు అంటే, టిడిపి క్యాడరే కారణం. వంశీకి మాస్ ఇమేజ్ ఉన్నా, పార్టీ మార్పుతో, తన వెంట పెద్దగా టిడిపి క్యాడర్ వెళ్ళే అవకాసం లేదు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున గెలిచిన వంశీ, కొన్ని రోజులుకే తెలుగుదేశం పార్టీతో విభేదించారు. ముందుగా తన పై కేసు పెట్టటంతో, వైసీపీ పై విమర్శలు చేసిన వంశీ, తరువాత కాలంలో జగన్ ను కలిసి, చంద్రబాబుని తిట్టటం మొదలు పెట్టరు. దీంతో తెలుగుదేశం పార్టీ, వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అయితే వంశీ డైరెక్ట్ గా వైసీపీ పార్టీలో చేరక పోయినా, ఆయన వైసీపీలోకి వేల్లిపోయినట్టే లెక్క. అయితే ఇది జరిగి రెండు నెలలు అవుతున్నా, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి గన్నవరం నియోజకవర్గంలో పెద్ద దిక్కు లేదు. ఒక వేళ ఎన్నికలు వస్తే, వంశీకి పోటీగా పక్కన నూజివీడు నియోజకవర్గంలో ఉన్న ముద్దరబోయిన కాని, గద్దె అనురాధని కాని దింపాలని అనుకున్నారు.

vamsi 01012020 2

అయితే ఇప్పుడప్పుడే ఎన్నికలు జరిగే అవకాసం లేకపోవటంతో, గన్నవరం టిడిపి ఇంచార్జ్ గా ఎవరో ఒకరిని నియమించాలని, గన్నవరం టిడిపి క్యాడర్ నుంచి ఒత్తిడి వస్తుంది. ఈ నేపధ్యంలోనే, పార్టీ అధిష్టానం గన్నవరం ఇంచార్జ్ పై కసరత్తు ప్రారంభించింది. వంశీ ఇప్పుడు అధికార పార్టీలో ఉండటంతో, అతడి స్పీడ్ ని తట్టుకోగలిగే వారిని, ఆర్ధికంగా బలపడిన వారి కోసం, అదే విధంగా తెలుగుదేశం కార్యకర్తలతో మంచి సంబంధాలు ఉన్న వారి కోసం, టిడిపి అధిష్టానం అన్వేషిస్తుంది. గన్నవరం నియోజకవర్గంలో 1983 నుంచి 9 సార్లు ఎన్నికలు జరిగితే, టిడిపి ఆరు సార్లు గెలిచింది. ఈ నేపధ్యంలో, ఇక్కడ పట్టు తప్పకుండ, తొందరగా ఇంచార్జ్ ని నియమించాలని, తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తుంది.

vamsi 01012020 3

ఈ నేపధ్యంలోనే, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌రావు సమీప బంధువు, పుట్టగుంట సతీశ్‌ ను గన్నవరం ఇంచార్జ్ ని చేస్తే ఎలా ఉంటుంది అనే దాని పై, అధిష్టానం ఫీడ్ బాక్ తీసుకుంటుంది. ఆయన గత కొన్నేళ్లుగా, పార్టీలో చురుగ్గా ఉంటున్నారు. 1994లో గద్దే రామ్మోహన్‌ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో, ఎన్నికల వ్యూహరచనలో సతీశ్‌ కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. ఇప్పటికే సతీస్ తో, విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోవడం పై చర్చించారు. తరువాత అధిష్టానం కూడా రంగలోకి దిగటంతో, తాను కుటుంబసభ్యులు, మిత్రులతో మాట్లాడి తన నిర్ణయం చెప్తానని, అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం.

స్పీకర్ స్థానంలో ఉన్నా తమ్మినేని సీతారం మాత్రం, రాజకీయ వ్యాఖ్యలు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. కౌన్ కిస్కా గొట్టం గళ్ళు, అనుభవం మడిచి ఎక్కడో పెట్టుకో, ఇక రాయలేని మరో బూతు మాట్లాడిన తమ్మినేని, ఇవన్నీ తాను ఎమ్మెల్యేగా చేస్తున్నానని, ముందు తాను ఎమ్మెల్యేని అని, నేను రాజకీయాలు మాట్లాడుతున్నా అని తేల్చి చెప్పారు. ఈ సందర్భంలో, నిన్న స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు అందరినీ షాక్ కు గురి చేసాయి. రాజధాని పై చంద్రబాబుని ఉద్దేశిస్తూ, అది ఒక ప్రతిపక్షం, అతడొక నాయకుడు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు, ముందు తమకున్న 23 మంది ఎమ్మెల్యేలను, చంద్రబాబు కాపాడుకోవాలి అంటూ, స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఒక స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తీ, ఫిరాయింపులకు అనుకూలంగా మాట్లాడుతున్నారా అనే అభిప్రాయం కలుగుతుంది. ఒక పక్క వైసీపీ, టిడిపి ఎమ్మెల్యేలను లాగేసుకుంటుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాల గిరిని లాగేసుకుంది.

tammineni 02012020 2

అయితే తెలివిగా వైసీపీలో చేరకుండా, వాళ్ళు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అంటూ చెప్పటం, ఇప్పటికే వంశీ విషయంలో స్పీకర్ దానికి ఒప్పుకోవటం జరిగిపోయాయి. ఫిరాయింపులు పై నీతులు చెప్పిన జగన్, అలాగే అసెంబ్లీ మొదటి రోజు నేను ఫిరాయింపులు ప్రోత్సహించను అని చెప్పిన స్పీకర్ తమ్మినేని, ఇప్పుడు ఇలా చెయ్యటం పై అందరూ ఆశ్చర్య పోయారు. అయితే ఇప్పుడు ఏకంగా స్పీకరే, మీ 23 మంది ఎమ్మెల్యేలని కాపాడుకోండి అని అంటున్నారు అంటే, ఇది ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. నిన్న శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన తమ్మినేని సీతారం, మూడు రాజధానుల పై మాట్లాడుతూ, పై వ్యాఖ్యలు కూడా చేసారు. ఇదే సందర్బంలో రాజధాని పై మాట్లాడిన తమ్మినేని, చంద్రబాబు పై వ్యాఖ్యలు చేసారు.

tammineni 02012020 3

అసలు చంద్రబాబు విశాఖపట్నం రాజధానికి అనుకూలమో కాదో చెప్పాలని తమ్మినేని కోరారు. మూడు రాజధానుల పై తమ వైఖరి ఏమిటో చంద్రబాబు చెప్పాలని కోరారు. ప్రజల కోసం, తమ్మినేని మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేసారు. అన్ని ప్రాంతాలు ఈ దెబ్బతో అభివృద్ధి చెందుతాయని అన్నారు. అయితే జగన్ చేస్తున్న మంచి పనికి ప్రతిపక్షాలు అడ్డు పడుతున్నాయని అన్నారు. ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్తారని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలను వాళ్ళు రక్షించుకోవాలని అన్నారు. అమరావతిలో తెలుగుదేశం పార్టీ చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్, ఇప్పటికే అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేసామని అన్నారు. అయితే, తెలుగుదేశం పార్టీ స్పీకర్ కు సమాధానం ఇస్తూ, ఇప్పటికే చంద్రబాబు అమరావతి పై స్పష్టమైన ప్రకటన చేసి, వారి కోసం పోరాడుతున్నారని గుర్తు చేసారు.

Advertisements

Latest Articles

Most Read