తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు, ఈ నెల 14న, భవన నిర్మాణ కార్మికుల తరపున పోరాటం చేస్తూ, 12 గంటల పాటు, ఇసుక దీక్ష చెయ్యనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మికంగా తీసుకుంది. ఈ కార్యక్రమం విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర జరుగుతూ ఉండటంతో, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ , ఈ దీక్షకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయితే, ఈ క్రమంలోనే, సోమవారం, అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. మొన్నటి దాక ఎడమొఖం, పేద మొఖంగా ఉన్న నాయకులు, ఇద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోవటం, పక్కపక్కనే కూర్చువటంతో, తెలుగుదేశం కార్యకర్తలు, మొదట ఆశ్చర్యపోయినా, చంద్రబాబు దీక్ష వల్ల, మా నాయుకులు ఇద్దరూ కలిసి పోయారు అంటూ, సంతోషిస్తున్నారు. వారు ఎవరో కాదు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని, మరో టిడిపి నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ఇసుక దీక్ష, వీరిద్దరినీ మళ్ళీ కలిపిందనే చెప్పాలి.

nani 12112019 2

ఆరు నెలల క్రితం జరిగిన ఎన్నకల తరువాత నుంచి, విజయవాడ టిడిపిలో చిన్న పాటి తుఫాను వచ్చింది. ఎన్నికల ఫలితాలు తరువాత నుంచి, కేశినేని నాని, బుద్దా వెంకన్న ఒకరి పై ఒకరు, విమర్శలు చేసుకున్నారు. ఇదంతా ట్విట్టర్ వేదికగా జరిగింది. అయితే ఈ ట్విట్టర్ యుద్ధం కొనసాగుతూ ఉండటం, ప్రతి రోజు వార్తల్లో విషయం కావటంతో, చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుని, ఇరువురికి సర్ది చెప్పారు. అప్పటి నుంచి, ఇరువు నేతలు, ఎడమొహం, పెడమొహంగానే ఉంటున్నారు. అసలు జరిగిన విషయం ఏమిటో, క్లారిటీ లేకపోయినా, ఇద్దరు నేతల మధ్య మాత్రం, తేడాలు గమనించిన క్యాడర్ మాత్రం, అసంతృప్తితో ఉంది. వచ్చే మునిసిపల్ ఎన్నికలకు ధీటుగా ఎదుకోవాల్సిన టైంలో, ఇలా మనలో మనకే ఇబ్బందులు ఉంటే ఎలా అంటూ, కార్యకర్తలు ఆందోళన చెందారు.

nani 12112019 3

అయితే, నిన్న అనూహ్యంగా, ఇరువురి నేతలు, ఒకే వేదిక పై కుర్చుని, పక్క పక్కనే కూర్చుని, మాట్లాడుకోవటంతో, ఇరువురి మధ్య మళ్ళీ స్నేహం చిగురించిందని, ఇది పార్టీకే మంచిదని, కార్యకర్తలు అంటున్నారు. సోమవారం విజయవాడలోని కేశినేని భవన్‌లో నిర్వహించిన టీడీపీ అర్బన్‌ కమిటీ సన్నాహక సమావేశంలో, ఈ కలయిక చోటు చేసుకుంది. సమావేశం కేశినేని భవన్ లో జరగటం, అక్కడకు, బుద్దా వెంకన్న రావటం, కేశినేని నాని కూడా బుద్దా వెంకన్నతో సఖ్యతగా ఉండటంతో, ఇక నుంచి మళ్లీ అర్బన్‌ టీడీపీ నాయకులంతా ‘టీమ్‌ విజయవాడ’గా ముందుకు వెళ్తూ, వచ్చే మునిసిపల్ ఎన్నికల నాటికి, పార్టీని మళ్ళీ బలోపేతం చేస్తామని, కార్యకర్తలు అంటున్నారు. ఏది ఏమైనా, చంద్రబాబు దీక్ష, ఇరువురి నాయకులను మళ్ళీ ఏకం చెయ్యటం, శుభ పరిణామం.

ఎవరైనా పెద్దలు ఇచ్చిన సంపాదనను, జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఇంకా ఆదాయం పెంచుకుంటూ, సుఖంగా జీవిస్తూ, పెద్దలు ఇచ్చిన ఆస్తి భరోసాతో, మంచి ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు. మంచి నడవిక గలవారు ఎవరైనా చేసే పని ఇది. ఇంకో రకం వారు మాత్రం, వాళ్లకి ఆదాయం సంపాదించటం చేతకాదు. దుబారా చేస్తారు. చివరకు ఖర్చులకు డబ్బులు లేక, పెద్దలు ఇచ్చిన ఆస్తులు అమ్మి, కొన్నాళ్ళు సాగదీస్తారు. తరువాత కొన్నాళ్ళకు, అటు ఆస్థులు కరిగిపోయి, ఇటు డబ్బు సంపాదించే మార్గం తెలియక, కుటుంబ సభ్యులను రోడ్డున పడేస్తారు. మన రాష్ట్రం ప్రభుత్వం చేసే పని కూడా ఇలాగే ఉంది. పెట్టిన పేరేమో, బిల్డ్ ఏపి. చేసే పనేమో, సెల్ ఏపి. బిల్డ్ ఏపి మిషన్ ద్వారా, మౌలిక సదుపాయాలు పెంచుతాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది కాని, ఆ బిల్డ్ చెయ్యటానికి, రాష్ట్రాన్ని సెల్ చేస్తాం అంటుంది.

jagan 12112019 2

దీని కోసం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు పై కన్ను వేసింది ప్రభుత్వం. రాష్ట్రమొత్తం మీద వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న భూములు, అతిధి గృహాలు, నిరుపయోగ భవనాలను గుర్తుంచి, ఏపీ మెషిన్ బిల్డ్ ద్వారా వాటిని అమ్మి ఆ సంపాదనతో వైసీపీ ప్రభత్వం ప్రజలకి చేస్తా అన్న నవరత్నాలు, నాడు -నేడు వంటి పథకాలని అమలు చేయచ్చు అని వైస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచన చేసారు. దీని కోసం పోయిన నెల 30 న జరిగిన రాష్ట్ర మంత్రివర్గం మీటింగ్ లో జగన్ ఆలోచనకు క్యాబినెట్ ఆమోదం తెలిపారు. ఈ మెషిన్ కోసం ప్రేత్యక కమిటీ వేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీ ప్రభత్వ స్థలాలని అమ్మడానికి ప్రణాళిక వేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తీస్తున్నారు.

jagan 12112019 3

దీని కోసం ముందుగా విజయవాడ లాంటి చోటు ఎంచుకున్నారు. నిజానికి విజయవాడ లాంటి చోట, భూములు అమ్మాలి అని ఎవరూ అనుకోరు. కాని, మన ప్రభుత్వం, విజయవాడ నడి ఒడ్డులో ఉన్న, స్టేట్ గెస్ట్ హౌస్ కు సంబంధించిన, రెండు ఎకరాలు అమ్మేందుకు సిద్ధం అయ్యింది. అయితే, ఈ ప్రతిపాదన పై, అందరూ భగ్గు మంటున్నారు. అసలు ఆస్థులు అమ్మి, కార్యక్రమాలు చెయ్యటం, ఇదేమి పద్దతి అంటూ, ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్నారు. భూములు అమ్మి, ఖర్చు పెట్టటం గొప్ప కాదని, ఆదాయం సంపాదించి, పెట్టుబడులు తెచ్చి, వాటిని ఫలాలు ప్రజలకు ఇవ్వటం, ప్రభుత్వం చెయ్యాల్సిన బాధ్యత అని, అంతే కాని భవిషత్తు తరాల సంపదను, ఇలా అమ్మివేయటం కరెక్ట్ కాదని, ప్రభుత్వాలు ఇలా చెయ్యకూడదు అని విమర్శలు వస్తున్నాయి.

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం, గత ప్రభుత్వంలో, చంద్రబాబు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. మనల్ని హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టి, మన కష్టాన్ని అంతా హైదరబాద్ లోనే వదిలేసి, గెంటివేసారు. అవమానం జరిగిన చోటే, వారికి మన సత్తా చూపించాలని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆంధ్రుడు పూనుకున్నాడు. చంద్రబాబు ఆశయానికి, రైతులు తోడయ్యారు. అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలు, 33 వేల ఎకరాలు ఇచ్చారు. అటు రైతులు తమ భవిష్యత్తుతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వంగా చెప్పుకునే రాజధాని వస్తుందని ఆశ పడ్డారు. ఒక్క చిన్న స్థలం తీసుకుంటే రక్త పాతం జరిగే చోట, ఒక ప్రభుత్వానికి 33 వేల ఎకరాలు, ఒక్క ఆందోళన లేకుండా ఇచ్చారు అంటే, అది చంద్రబాబు మీద ఉన్న నమ్మకం. అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఎంత రెచ్చగొట్టినా, రైతులు మాత్రం, చంద్రబాబు వెంటే నడిచారు. తరువాత ఫ్లాట్లు వెయ్యటం మొదలు పెట్టి, సింగపూర్ దగ్గర మాస్టర్ ప్లాన్ తీసుకుని, దానికి అనుగుణంగా, ప్రభుత్వ భవనాలు డిజైన్ లను, లండన్ లోని fosters కంపెనీకి ఇచ్చి, పనులు ప్రారంభించారు.

sngapore 12112019 2

ఇప్పటికే దాదాపుగా 9 వేల కోట్లు ఖర్చు పెట్టి, అక్కడ మౌలిక సదుపాయాలు, సచివాలయం, హైకోర్ట్, ఐఏఎస్, ఐపిఎస్, ఉద్యోగుల క్వార్టర్స్ కట్టటం ప్రారంభించారు. దాదాపుగా 40 వేల మంది కార్మికులతో, ఒక సిటీ నిర్మాణం జరుగుతూ ఉంటే, ప్రపంచ స్థాయి రాజధాని కల ఎంతో దూరంలో లేదు అంటూ, ఆంధ్రులు సంతోషించారు. దీనికి తోడుగా, ఏకంగా సింగపూర్ ప్రభుత్వం, ఇక్కడ స్టార్ట్ అప్ ఏరియా డెవలప్ చెయ్యటానికి ముందుకు వచ్చింది. అవినీతి రహితింగా ఉండే సింగపూర్ ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబదులు పెడుతుంటే, ప్రపంచంలోని మిగతా పెట్టుబడిదారులు ఆకర్షితులు అయ్యారు. అయితే, ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. మొత్తం తారు మారు అయ్యింది. చంద్రబాబు దిగిపోయారు. అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉంటూ, మన రాజధానిని భ్రమరావతి అంటూ హేళన చేస్తున్న, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసారు.

sngapore 12112019 3

ముందుగా జరుగుతున్న పనులు ఆపేశారు. దీంతో అప్పటి వరకు సందడిగా ఉన్న అమరావతి ప్రాంతం బోసి పోయింది. పెట్టుబడి దారులకు ఇచ్చిన భూములు, కొంత మందివి వెనక్కు తీసుకున్నారు. మరో పక్క ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే రుణాలు వెనక్కు వెళ్ళిపోయాయి. ఇవన్నీ గమనిస్తున్న సింగపూర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఉద్దేశాలు అర్ధమయ్యి, తాను కూడా స్టార్ట్ అప్ ఏరియా నుంచి తప్పుకొవటానికి, దాదపుగా సిద్ధపడింది. ఇదే టైంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే, సింగపూర్ కూడా ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు. ఏపి ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యతలు ఉన్నాయని, వారు స్టార్ట్ అప్ ఏరియాకు అనుకూలంగా లేరని అర్ధమవుతుందని, ఇలాంటి చోట పెట్టుబడులు పెట్టటానికి పెట్టుబడిదారులు రిస్క్ చెయ్యరని, అందుకే తప్పుకుంటున్నమని ఆ ప్రకటనలో తెలుపుతూ, భవిష్యత్తులో పెట్టుబడులు కోసం, ఏపితో పని చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ విధంగా, అమరావతి కధ, ముగుస్తు వెళ్తుంది.

అసలు వంశీ ఏ పార్టీలో చేరుతారో, ఆయన అనుచరులుకే తెలియని పరిస్థితి ఏర్పడింది. దీపావళి రోజున చంద్రబాబుకు వాట్స్ అప్ మెసేజ్ పంపించి, తాను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని, అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను అని చెప్పారు. తన పై, తన అనుచరుల పై విపరీతమైన ఒత్తిడి ఉందని, వైసిపీ అరాచకాలు తట్టుకోలేక పోతున్నానని, రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకున్నాను అని, అలా అయినా తన పై ఒత్తిడి తగ్గుతుందని, వంశీ, చంద్రబాబుకి మెసేజ్ పెట్టటం, దానికి చంద్రబాబు పోరాడదాం అని చెప్పిన విషయం తెలిసిందే. అయితే తరువాత, వంశీ తన అనుచరులకు ఫోన్ చేసి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చెయ్యాలని, మనం వైసిపీలో చేరుతున్నాం అని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. దానికి తగ్గట్టే, కొంత మంది వంశీ అనుచరులు, వైసీపీ రంగులు, జగన బొమ్మలు, వంశీ బొమ్మలతో, సోషల్ మీడియాలో పోస్టర్లు, వీడియోలు తయారు చేసి హడావిడి చేసారు.

vamsi 12112019 2

దీపావళి అవ్వగానే, వంశీ వైసీపీలో చేరిపోతారని, వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు వంశీ తన రాజీనామా లేఖను స్పీకర్ కు పంపలేదు. మరో పక్క వంశీని అసెంబ్లీ కమిటిల్లో ఒక పదవి కూడా ఇచ్చారు. ఇవన్నీ చూస్తున్న వారికి అసలు వంశీ పార్టీ మారుతున్నారా లేదా ? లేక టిడిపి లోనే ఉంటారా ? లేక రాజకీయ సన్యాసం తీసుకుంటారా అనే విషయం పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే, ఈ గందరగోళం పై వంశీ ఒక ప్రముఖ పత్రికతో మాట్లాడి, తన అభిప్రాయాన్ని చెప్పారు. నేను వైసిపీలో చేరాలి అనుకున్నాను, దానికి ముహర్తం ఎప్పుడు అనేది త్వరలోనే తెలుస్తుంది, ఒత్తిడులు నుంచి తన అనుచరలును కాపాడుకోవటానికి, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నాను అని వంశీ చెప్పారు.

vamsi 12112019 3

పదవిలో ఉండే సేవ చెయ్యాలి అని, సన్నిహితుల ఒత్తిడితోనే, రాజీనామా విషయంలో వెనక్కు తగ్గాను అని వంశీ చెప్పారు. వైసిపీలో చేరే సమయానికి రాజీనామా చెయ్యలా వద్దా అనే చర్చ రాలేదు, సమయం వచ్చినప్పుడు దాని పై చర్చిస్తాం అని వంశీ చెప్పారు. గతంలో టిడిపి హయంలో ఉన్నా, పార్టీలో ఒక ఎమ్మెల్యేగా ఉన్నా తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని వంశీ చెప్పారు. అంటే వంశీ చెప్పిన దాని ప్రకారం, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యరు. అలా అని వైసీపీలో చేరరు. టిడిపికి అనుకూలంగా ఉండరు. తటస్థ ఎమ్మెల్యేలాగా కొనసాగాలని వంశీ నిర్ణయం తీసుకునట్టు తెలుస్తుంది. మరి, ఇది ఎంత వరకు సాధ్యం ? వంశీ కనుక వైసిపీతో సన్నిహితంగా ఉంటే, టిడిపి అనర్హత వెయ్యమని కోరుతుంది కదా ? చూద్దాం ఇది ఎక్కడి వరకు వెళ్తుందో.

Advertisements

Latest Articles

Most Read