నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం, గత ప్రభుత్వంలో, చంద్రబాబు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కాదు. మనల్ని హైదరాబాద్ నుంచి వెళ్ళగొట్టి, మన కష్టాన్ని అంతా హైదరబాద్ లోనే వదిలేసి, గెంటివేసారు. అవమానం జరిగిన చోటే, వారికి మన సత్తా చూపించాలని, ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి ఆంధ్రుడు పూనుకున్నాడు. చంద్రబాబు ఆశయానికి, రైతులు తోడయ్యారు. అమరావతి ప్రాంతంలో 29 గ్రామాల ప్రజలు, 33 వేల ఎకరాలు ఇచ్చారు. అటు రైతులు తమ భవిష్యత్తుతో పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వంగా చెప్పుకునే రాజధాని వస్తుందని ఆశ పడ్డారు. ఒక్క చిన్న స్థలం తీసుకుంటే రక్త పాతం జరిగే చోట, ఒక ప్రభుత్వానికి 33 వేల ఎకరాలు, ఒక్క ఆందోళన లేకుండా ఇచ్చారు అంటే, అది చంద్రబాబు మీద ఉన్న నమ్మకం. అప్పటి ప్రతిపక్ష పార్టీలు ఎంత రెచ్చగొట్టినా, రైతులు మాత్రం, చంద్రబాబు వెంటే నడిచారు. తరువాత ఫ్లాట్లు వెయ్యటం మొదలు పెట్టి, సింగపూర్ దగ్గర మాస్టర్ ప్లాన్ తీసుకుని, దానికి అనుగుణంగా, ప్రభుత్వ భవనాలు డిజైన్ లను, లండన్ లోని fosters కంపెనీకి ఇచ్చి, పనులు ప్రారంభించారు.

sngapore 12112019 2

ఇప్పటికే దాదాపుగా 9 వేల కోట్లు ఖర్చు పెట్టి, అక్కడ మౌలిక సదుపాయాలు, సచివాలయం, హైకోర్ట్, ఐఏఎస్, ఐపిఎస్, ఉద్యోగుల క్వార్టర్స్ కట్టటం ప్రారంభించారు. దాదాపుగా 40 వేల మంది కార్మికులతో, ఒక సిటీ నిర్మాణం జరుగుతూ ఉంటే, ప్రపంచ స్థాయి రాజధాని కల ఎంతో దూరంలో లేదు అంటూ, ఆంధ్రులు సంతోషించారు. దీనికి తోడుగా, ఏకంగా సింగపూర్ ప్రభుత్వం, ఇక్కడ స్టార్ట్ అప్ ఏరియా డెవలప్ చెయ్యటానికి ముందుకు వచ్చింది. అవినీతి రహితింగా ఉండే సింగపూర్ ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున పెట్టుబదులు పెడుతుంటే, ప్రపంచంలోని మిగతా పెట్టుబడిదారులు ఆకర్షితులు అయ్యారు. అయితే, ఈ లోపు ఎన్నికలు వచ్చాయి. మొత్తం తారు మారు అయ్యింది. చంద్రబాబు దిగిపోయారు. అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉంటూ, మన రాజధానిని భ్రమరావతి అంటూ హేళన చేస్తున్న, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసారు.

sngapore 12112019 3

ముందుగా జరుగుతున్న పనులు ఆపేశారు. దీంతో అప్పటి వరకు సందడిగా ఉన్న అమరావతి ప్రాంతం బోసి పోయింది. పెట్టుబడి దారులకు ఇచ్చిన భూములు, కొంత మందివి వెనక్కు తీసుకున్నారు. మరో పక్క ప్రపంచ బ్యాంక్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చే రుణాలు వెనక్కు వెళ్ళిపోయాయి. ఇవన్నీ గమనిస్తున్న సింగపూర్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాధాన్యాలు, ఉద్దేశాలు అర్ధమయ్యి, తాను కూడా స్టార్ట్ అప్ ఏరియా నుంచి తప్పుకొవటానికి, దాదపుగా సిద్ధపడింది. ఇదే టైంలో నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, స్టార్టప్‌ ఏరియా ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిన వెంటనే, సింగపూర్ కూడా ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు. ఏపి ప్రభుత్వానికి వేరే ప్రాధాన్యతలు ఉన్నాయని, వారు స్టార్ట్ అప్ ఏరియాకు అనుకూలంగా లేరని అర్ధమవుతుందని, ఇలాంటి చోట పెట్టుబడులు పెట్టటానికి పెట్టుబడిదారులు రిస్క్ చెయ్యరని, అందుకే తప్పుకుంటున్నమని ఆ ప్రకటనలో తెలుపుతూ, భవిష్యత్తులో పెట్టుబడులు కోసం, ఏపితో పని చెయ్యటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ విధంగా, అమరావతి కధ, ముగుస్తు వెళ్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read