ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్య నిషేధం చేస్తాను అంటూ జగన్ మోహన్ రెడ్డి విధానం పై పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు పట్ల టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మద్య నిషేధం చాలా కష్టమైన పని చెప్తూ, తెలంగాణా ఉద్యమం నాటి సమయంలో జరిగిన కొన్ని అంశాలకు ఉదాహరణగా చెపారు. అయితే దీని పై టీఆర్ఎస్ అభ్యంతరం చెప్పింది. తెలంగాణా సాయుధ పోరాటాన్ని పవన్ కళ్యాణ్ కించ పరుస్తూన్నరు అంటూ, హైదరాబాద్ లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం ముందు నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేసారు. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవలాని కోరారు. అలాగే పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని అని చెప్తూ, జూబ్లీహిల్స్ పోలీసులకు కూడా టీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.

pk 05082019 2

అయితే ఈ అంశం పై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇది చాలా చిన్న అంశం అని, దాన్ని కావాలని టీఆర్ఎస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తాను ఒక మాట అంటే, తాను అనని మాటలకు వక్రభాష్యం చెప్పి, తన ఇంటిమీద, కార్యాలయాల మీద దాడులు చెయ్యటం ఏంటని టీఆర్ఎస్ ని ప్రశ్నించారు. ఏమి లేని దానికి తన ఇంటి మీద దాడులు చెయ్యటానికి వస్తే, చూస్తూ కూర్చోను అని, తాట తీస్తానని హెచ్చరించారు. తాను ఏ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యలేదని, ఎవరినీ కించపరచలేదని, అలా చెప్తే తాను వెంటనే క్షమాపణ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయని పవన్ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఇలాగే అయిన దానికి కాని దానికి రాద్ధాంతం చేస్తే, పరిణామాలు వేరే లాగా ఉంటాయని పవన్ కళ్యాణ్ అన్నారు.

pk 05082019 3

తన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని, మీ ఇష్టం వచ్చినట్టు నా ఇంటి ముందు చేస్తే, చూస్తూ కూర్చోను అంటూ పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇళ్ళ మీదకు వస్తాం, ఆఫీసుల మీదకు వస్తాం అంటూ, మేమేమి ముడుచుకు కుర్చోలేదని పవన్ అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనలో ఉన్నారు. అక్కడ ఈ అంశం పై స్పందించారు. తాను నిన్న రాజమండ్రిలో దిగగానే, ఫోన్ వచ్చిందని, తన ఇంటి ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా చేస్తున్నారని అన్నారు. ఎందుకు అని అరా తీస్తే, నేను తెలంగాణా పోరాటాన్ని కించ పరిచేలా మాట్లాడానని, అందుకని అని అన్నారని పవన్ అన్నారు. ఎప్పుడో ఐదు రోజుల క్రిందట నేను ఎదో మాట్లాడితే, వీళ్ళు ఏదో ఆపాదించుకు హడావిడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. నా భీమవరం పర్యటన హైలైట్ కాకుండా, ఇలా చేసారని అన్నారు.

జమ్మూకశ్మీర్‌ రాష్ట్రం విషయంలో, కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు పై, తెలుగుదేశం పార్టీ తమ అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమ పార్టీ అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియ చేసారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగిస్తుందని చంద్రబాబు అన్నారు. అలాగే ఈ నిర్ణయంతో అయినా, జమ్మూకాశ్మీర్ లో శాంతియుత వాతావరణం రావాలని, కోరుకుంటున్నట్టు చంద్రబాబు ట్వీట్ చేసారు. "Telugu Desam Party supports the Union Govt as it seeks to repeal Article 370. I pray for the peace and prosperity of the people of J&K.". అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ కూడా ట్వీట్ చేసారు "I welcome the decision of the Union Govt to scrap Article 370. I hope that the people of J&K witness peace and development."

cbn 05082019 2

ఇది ఇలా ఉంటే రాజ్యసభలో చర్చ సందర్భంగా కూడా, తెలుగుదేశం పార్టీ ఆన్ రికార్డు తన అభిప్రాయాన్ని చెప్పింది. కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, రాజ్యసభలో మాట్లాడిన ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ చెప్పారు. తెలుగుదేశం పార్టీ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అలాగే జమ్ముకశ్మీర్‌ ప్రజలు స్వేచ్చగా, సంతోషంగా జీవించేందుకు, ఇక నుంచి అయినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎంపీ కనకమేడల అన్నారు. దేశంలో అన్ని ప్రాంతాలకు, అన్ని రాష్ట్రాలకు ఒకే హక్కులు, సమాన హక్కులు ఉండాలనేది తమ పార్టీ విధానం అని, దీనికి మద్దతు తెలుపుతున్నాం అని అన్నారు. గత ఆరు దశాబ్దాలుగా కాశ్మీరీ ప్రజలు అశాంతి మధ్యే ఉన్నారని, వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని అన్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో, ఇక నుంచి అయినా వారికి మంచి రోజులు రావాలని కోరుకుంటున్నాం అని అన్నారు. ఈ అంశంలో కేంద్రానికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తుందని చెప్పారు.

cbn 05082019 3

మరో పక్క, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రానికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం పై భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ కూడా స్పందించారు. ఆర్టికల్‌ 370ని రద్దు చెయ్యటం ఎంతో సంతోషించే విషయం అని అద్వానీ అన్నారు. దేశ సమగ్రతను బలోపేతం చేసే విధంగా ఈ నిర్ణయం ఉందని, ఇది ఎంతో గొప్ప ముందడుగని అద్వానీ అనంరు. ఆర్టికల్‌ 370 రద్దు అనేది బీజేపీ సిద్ధాంతాల్లో ఒకటని అద్వానీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న మోడీ, అమిత్ షా లకు అభినందనలు తెలుపుతున్నా అని అద్వానీ అన్నారు. ఇక నుంచి అయినా జమ్ము కాశ్మీర్ లో, స్వేఛ్చ, శాంతి ఉండాలని కోరుకుంటున్నా అని అద్వానీ అన్నారు.

దేశంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాజ్యసభలో కేంద్రం మూడు అంశాలకు సభ ముందు పెట్టి, అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆర్టికల్‌ 370 రద్దు , 35(ఏ) రద్దు , జమ్ము కశ్మీర్‌ రాష్ట్ర విభజన వంటి మూడు కీలక అంశాలు ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి చెలరేగింది. నిమిషాల్లోనే ఆర్టికల్‌370 రద్దు చేస్తూ రాష్ట్రపతి వెనువెంటనే ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క జమ్ము, కశ్మీర్‌, లద్దాక్‌ ప్రాంతాలుగా, జమ్ము కశ్మీర్‌ రాష్ట్రాన్ని విడదీసారు. జమ్ము, కశ్మీర్‌లు అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుకాగా, లద్దాక్‌ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. ఈ గందరగోళం మధ్య కొంచెం సేపు రాజ్యసభ ప్రసారాలు కూడా ఆగిపోయాయి. లోపల ఏమి జరుగుతుందో తెలియలేదు. కొద్ది సేపటి తరువాత ప్రసారాలు ప్రారంభం అయ్యాయి.

shah 05082019 2

దీని పై కాంగ్రెస్, పీడీపీ, డీఎంకే, ఎస్పీ వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నిరసనకు దిగాయి. మరో పక్క టిడిపి, వైసిపీ, టీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నాయి. ఈ నిర్ణయం పై దేశం మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నా, అసలు నిర్ణయం అమలు అయినా జమ్ము కాశ్మీర్ వాసులు ఎలా ఆలోచిస్తున్నారు అనే విషయం మాత్రం తెలియలేదు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ విభజన నాటి పరిస్థితి గుర్తుకు వస్తుంది. అప్పుడు కూడా తెలంగాణాలో సంబరాలు చేసుకుంటే, ఏపిలో నిరసనలు చెలరేగాయి. ఇప్పటికీ ఈ నిర్ణయం వల్ల ఏపి నష్టపోయింది. ఎప్పటికి కోలుకుంటుందో కూడా తెలియని పరిస్థితి. అప్పుడు కూడా ఇలాగే ఆదరాబాదరాగా తలుపులు మూసి, లైవ్ కవరేజ్ ఆపేసి, అప్పటి కాంగ్రెస్ బిల్ పాస్ చేసింది. దీనికి బీజేపీ సహకరించింది.

shah 05082019 3

ఇప్పుడు కాంగ్రెస్ కు, ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అప్పట్లో వాళ్ళు ఎలా చేసారో, ఇప్పుడు బీజేపీ కూడా మంద బలంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొంచెం సేపు లైవ్ కవరేజ్ ఆగిపోయింది కూడా. ఇప్పుడు కూడా దేశం అంతా సంతోష పడుతుంటే, అసలు నిర్ణయం అములు అయ్యే కాశ్మీర్ ప్రజలు మాత్రం నిఘా నీడలో, కనీసం ఇంటర్నట్, ఫోన్ కూడా లేకుండా బిక్కు బిక్కు మంటూ ఉన్నారు. కాశ్మీర్ లోయ మొత్తం సైన్యం ఆధీనంలో ఉంది. ఏది ఏమైనా, కొన్ని ఏళ్ళుగా నడుస్తున్న ఈ సమస్యను, ప్రభుత్వం ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటుంది. అయితే, ఇప్పుడు తీసుకుంది కేవలం నిర్ణయం మాత్రం. అసలు పని ఇప్పటి నుంచి ఉంటుంది. కాశ్మీర్ లో హింస చెలరేగకుందా చూసుకోవాలి. అక్కడ ప్రజలని ఒప్పించాలి. ఇవన్నీ చెయ్యకుండా, మొండిగా వెళ్తే మాత్రం, సమస్య మరింత జటిలం అవుతుంది. మరో నోట్ల రద్దు, జీఎస్టీ లాగా, నిర్ణయం మంచిదే అయినా , అమలులో లోపం ఉన్న నిర్ణయంగా మారిపోతుంది. కేంద్రం, జాగ్రత్తగా డీల్ చేస్తుందని భావిద్దాం.

ఈ రోజు రాజ్యసభలో, కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటన, దేశాన్ని ఒక ఊపు ఊపింది. మెజారిటీ ప్రజలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కాశ్మీరీ ప్రజల అభిప్రాయం మాత్రం, తెలియటం లేదు. అయితే ఈ నిర్ణయాన్ని సమర్ధించే వారు, వ్యతిరేకించే వారు. ఈ విషయం పై రాజ్యసభలో చర్చ జరుగుతుంది. వివిధ పార్టీలకు చెందిన వారు, వారి వారి అభిప్రాయాలు చెప్తున్నారు. ఇదే విషయం పై మన రాష్ట్రానికి చెందిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పారు. ఈ 370 అధికరణను రద్దు చేస్తూ, మోడీ ప్రభుత్వం ఎంతో అద్భుతమైన నిర్ణయం తీసుకుందని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ విషయంలో మా అధినేత జగన్ మోహన్ రెడ్డి సపోర్ట్ మీకు ఉంటుందని తెలియచెస్తున్నాం అని విజయసాయి రెడ్డి అన్నారు.

vsreddy 05082019 2

ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న, మోడీ, అమిత్ షా లకు హాట్స్ ఆఫ్ చెప్పారు విజయసాయి రెడ్డి. అంతే కాదు పనిలో పనిగా నెహ్రుని కూడా తిట్టారు. సహజంగా బీజేపీ పార్టీ రాజకీయంగా నెహ్రుని, కాంగ్రెస్ ని తిడుతూ ఉంటుంది. అయితే ఇక్కడ వెరైటీగా విజయసాయి రెడ్డి నెహ్రుని తిట్టారు. ఇంతటితో అయిపోలేదు. అసలు విషయం ఇక్కడే ఉంది. అమిత్ షాని అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటూ రాజ్యసభలో విజయసాయి రెడ్డి ఆకాశానికి ఎత్తేసారు. బీజేపీ నేతలు కూడా ఈ రేంజ్ లో భజన చెయ్యలేదు కాని, విజయసాయి రెడ్డి మాత్రం, కొత్త పేరు పెట్టి మరీ, అమిత్ షా భజన చేసారు. నిజంగా ఈ సమస్య పై విజయసాయి రెడ్డి ఇంతగా కనెక్ట్ అయ్యి, అమిత్ షా ని ఈ రేంజ్ లో ఎత్తారా లేక రాజకేయంగా ఈ ప్రకటన చేసారో కాని, మరోసారి విజయసాయి రెడ్డి తమ స్వామి భక్తిని చాటుకున్నారు.

vsreddy 05082019 3

ఇక మరో పక్క ఆర్టికల్ 370 రద్దు అంశం పై, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అయిన టిడిపి, వైసీపీ, టీఆర్‌ఎస్‌ తమ మద్దతు ప్రకటించాయి. ఇక జాతీయ పార్టీల్లో బీఎస్పీ, ఏఐఏడీఎంకే, బిజు జనతా దళ్,ఆమ్‌ ఆద్మీ పార్టీలు మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్‌, పీడీపీ, డీఎంకే, ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే మద్దతు తెలిపిన పార్టీలు మాత్రం, ఇంతటితో కాశ్మీర్ లో శాంతి వచ్చేయదని, నోట్ల రద్దులా కాకుండా, దీన్ని సంపూర్ణంగా పూర్తీ చెయ్యాలని, కాశ్మీర్ లో ఇప్పుడు హింస చెలరేగకుండా చూడాలని వివధ పార్టీలు కోరుతున్నాయి. ఇప్పటికే జమ్ము కాశ్మీర్ రాష్ట్రం మొత్తం, భద్రతా బలగాల పహారాలో ఉంది. రాష్ట్రం అంతటా 144 సెక్షన్, కొన్ని చోట్ల కర్ఫ్యూ కూడా ఉంది. అలాగే చాలా మంది హౌస్ అరెస్ట్ లో ఉన్నారు, కమ్యూనికేషన్ వ్యవస్థ మొత్తం బంద్ అయ్యింది. ఈ పరిస్థితిలో అక్కడ పరిస్థితి ఎలా ఉందొ, తెలియని పరిస్థితి. ఏది ఏమైనా, అంతా మంచి జరగాలని కోరుకుందాం.

Advertisements

Latest Articles

Most Read