తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులకు చెందిన ఓట్లు ఇష్టా రాజ్యంగా తీసేస్తున్న వైసిపీ ప్రభుత్వం కుట్ర ఢిల్లీ వరకు వెళ్ళటమే కాదు, ఇక్కడ జరిగింది చూసి, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా షాక్ తింది. నేరుగా రంగంలోకి దిగింది. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్ ఢిల్లీ నుంచి అనంతరపురం రానుంది. ఉరవకొండ నియోజకవర్గంలో ఇష్టం వచ్చినట్టు టీడీపీకి చెందిన వారి ఓట్ల తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహంగా ఉంది. దీని పై గ్రౌండ్ లో విచారణ చేయటానికి, ఢిల్లీ నుంచి ఎన్నికల సంఘం కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ వస్తున్నారు. విడపనకల్లు మండలం చీకలగురికిలో టీడీపీ ఓట్ల తొలగింపులో కుట్ర జారిగిందని. ఫోర్జరీ నోటీసుల తయారీ చేసి ఇచ్చారని, దీని పై అధికారులు దృష్టికి తీసుకుని వెళ్ళినా ఉపయోగం లేకుండా పోయిందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వాలంటీర్లను అడ్డు పెట్టుకుని, ఓట్లు తొలగించారని తెలుగుదేశం ఆరోపణ. ఈ అంశం పై కేంద్రానికి ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం వస్తుందని తెలుసుకుని, తమ గుట్టు బయట పడకుండా, కింద స్థాయి ఉద్యోగులు పై వేటు మొదలు పెట్టారు.  బీఎల్వోలు గోపి, మధును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశాలు ఇచ్చారు. మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏమి చేస్తుందో చూడాలి మరి.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నేటి నుంచి చంద్రబాబు మూడు రోజులు పాటు కుప్పంలో పర్యటన చేయనున్నారు. సభలు, రోడ్‍షోలకు అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్‍కి నోటీసులు జారీ చేసి చంద్రబాబు సభకు పర్మిషన్ లేదని చెప్పారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం, సభ నిర్వహించి తీరుతామని అంటున్నారు. సభ నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయంటున్న పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే, కుప్పం పర్యటన కోసం తెలుగుదేశం శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం మొత్తం పసుపుమయంగా మారింది. తమ అధినేత చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ భారీగా స్వాగత తోరణాలు కట్టారు టిడిపి శ్రేణులు. ఈ రోజు షడ్యుల్ ప్రకారం కుప్పంలోని శివకురుంబూరులో "ఇదేం ఖర్మ-రాష్ట్రానికి" కార్యక్రమంలో చంద్రబాబు పాల్గుని, కెనుమాకులపల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గుంటారు.

నాలుగేళ్ల పాలనలో ఏమి చేశామని మళ్లీ ప్రజలను ఓట్లు ఎలా అడుగుతామని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి జ‌గ‌న్ స‌ర్కారుపై మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళితే వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రజలు వైసీపీకి అధికారం ఇచ్చి ఐదు ఏళ్ళు పూర్తి కావస్తోంద‌ని, కానీ ఇంకా సచివాలయ నిర్మాణాలు పూర్తి కాలేద‌న్నారు. సాంకేతిక కారణాలా లేక.. బిల్లులు చెల్లింపులు ఆలస్యమవుతుందని కట్టడానికి ఎవ‌రూ ముందుకు రావడం లేదా.. తెలియడం లేదన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు, నాయకులు గుర్తించుకోవాల‌న్నారు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి చాలా దారుణంగా ఉంద‌న్నారు. నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్లు వేస్తున్నామ‌ని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వాగుల వద్ద హై లెవెల్ బ్రిడ్జిలు కట్టబోతున్నామ‌న్నారు. రాష్ట్రం వేయ‌లేని రోడ్డు కేంద్రం వేస్తుంద‌ని ఆనం చెప్ప‌డం పార్టీ మార్పు సంకేతాలేనంటున్నారు.

రాబోయే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌న‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి స్వ‌యంగా చెప్పాన‌ని, ఆయ‌న త‌న మాట విన‌డంలేద‌ని మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్ల‌డించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సంద‌ర్భంగా మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తప్పుకుంటాని  సిఎంకు స్వయంగా చెప్పాన‌ని, త‌న‌కు రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చిందని అనిపిస్తుందని వివ‌రించాన‌న్నారు. దీనికి ముఖ్య‌మంత్రి ఒప్పుకోలేద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని, ఆ త‌రువాత ఆలోచిద్దామ‌న్నార‌ని మంత్రి తెలిపారు. వాస్త‌వంగా ఈ సారి ఎన్నిక‌ల్లో త‌న కొడుకుకి సీటు ఇవ్వాల‌ని, తాను పోటీ నుంచి త‌ప్పుకుంటాన‌ని ధ‌ర్మాన ప్ర‌తిపాదించార‌ని..అయితే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు త‌న‌యుడు ప‌నితీరుపై ఐప్యాక్ నివేదిక‌లు చాలా ఘోరంగా ఉన్నాయ‌ని అందుకే ప్ర‌సాద‌రావునే మ‌ళ్లీ పోటీ చేయాల‌ని సీఎం చెప్పార‌ని, పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. అయితే ఈ అస‌లు విష‌యం వెల్ల‌డించ‌కుండా నా తరువాత  పనిచేసిన వారందరూ కూడా  ఎద‌గాల‌ని, తరువాత తరానికి నాయకులను తయారు చేసి సమాజానికి అందించేందుకు చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తానంటూ క‌వ‌రింగ్ ఇచ్చారు మంత్రి అని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read