కొద్ది రోజుల పాటు రాష్ట్రంలో బ్రేక్ ఇచ్చిన జేసీబీ కూల్చివేతలు మళ్ళీ ప్రారంభం అయ్యాయి. ఈ రోజు మళ్ళీ విశాఖపట్నం గీతం యూనివర్సిటీ దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంకా చీకటి కూడా పోక ముందే, వందలాది మంది పోలీసులతో, జేసీబీలు, రెవిన్యూ సిబ్బంది, కలిసి విశాఖ గీతం యూనివర్సిటీ దగ్గరకు వచ్చారు. ఏమి చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏమి తెలియదు. కనీసం ముందస్తుగా, గీతం యూనివర్సిటీకి ఉద అనధికారులు కానీ, పోలీసులు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. రుషికొండ నుంచి యూనివర్సిటీ వెళ్ళే మార్గం మొత్తం పోలీసులు సెక్యూరిటీ పెట్టి, అటు వైపు ఎవరినీ వెళ్ళనివ్వటం లేదు. కనీసం ఆ రోడ్డులోకి మీడియాని కూడా అనుమతి ఇవ్వటం లేదు. అయితే గతంలో అక్కడ ప్రభుత్వం భూమి ఆక్రమించారు అంటూ, గతంలో కొంత మేర కూల్చిన విషయం తెలిసిందే. తరువాత కోర్ట్ కి వెళ్లి ఆపారు. ఇప్పుడు మళ్ళీ మిగిలిన నిర్మాణాలు కూడా కూల్చి వేయటానికి మళ్ళీ జేసీబీలు వందల మంది పోలీసులతో వచ్చినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
news
సలహాదారుల పై హైకోర్టు మొట్టికయాలు... మీకు అంత మంది సలహాదారులు ఎందుకు ?
ఇలాగే వదిలేస్తే రేపు ఎమ్మార్వోలకు కూడా సలహాదార్లను నియమించేలా ఉన్నారని ఏపీ సర్కారు తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ అధికారులు ఉండగా, వివిధ శాఖలకు సలహాదారులని ఎందుకు నియమిస్తున్నారని ప్రశ్నించింది. సలహాదారుల నియామక రాజ్యాంగబద్ధతను తేలుస్తామన్న హైకోర్టు వ్యాఖ్యానించింది. సలహాదారుల పూర్తి వివరాలు కోర్టు ముందుంచాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశం జారీ చేసింది. దేవాదాయశాఖకు సలహాదారుగా నియమితులైన శ్రీకాంత్‍పై గతంలో విధించిన స్టే ఉత్తర్వులు సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత తమ అనుయాయులు, సాక్షి సిబ్బంది, ఇతరత్రా ఆబ్లిగేషన్ ఉన్నవాళ్లందరినీ సలహాదారులుగా నియమించేశారు. కొందరు సలహాదారులైతే నియామకమైన శాఖతో ఎటువంటి సంబంధంలేని వారు కూడా వున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి.
పవన్ కళ్యాణ్‌ని దెబ్బకొట్టేందుకు జగన్-కేసీఆర్ స్కెచ్
ఏపీలో కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణ జాతీయ పార్టీగా నిలదొక్కుకోవడానికి కాదట. కేవలం తన రహస్య స్నేహితుడు జగన్ రెడ్డి మేలు కోసమేనట. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశానికి తిరుగులేదని, జనసేన జతకడితే క్లీన్ స్వీప్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఈ మిత్రుల సర్వేలో తేలింది. టిడిపిని ఈ పరిస్థితుల్లో దెబ్బకొట్టలేమని, ఎన్నో కుతంత్రాలు పన్నితే 2019లో 40 శాతం ఓటింగ్ ఉందని ఇది పెరుగుడే కానీ, తరిగే అవకాశం లేదని నిర్ణయించుకున్నారు. టిడిపితో జనసేన కలిస్తే 65 శాతం ఓటింగ్ కొల్లగొట్టే చాన్స్ ఉందని వీరి లెక్కలు. జనసేనని టార్గెట్ చేయడం, కాపుల ఓటుబ్యాంకు చీలితే వైసీపీకి కలిసొస్తుందని వీరి వ్యూహం. దీని కోసమే బీఆర్ఎస్ ఏపీ కార్యకలాపాలు ఆరంబిస్తున్నారు. కేవలం కాపులని, జనసేనకి దగ్గరయ్యేవారినే బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. వైసీపీ నుంచి ఎవరైనా చేరుతామన్నా కేసీఆర్ తిరస్కరిస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని ఏపీ బీజేపీ మాజీ అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇదే అంశంపై మాట్లాడారు. జగన్-కేసీఆర్ కుట్రలో భాగంగానే భారాసలోకి ఏపీ నేతలు వెళ్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో పవన్, తెలంగాణలో బండి సంజయ్ ను బలహీనం చేసే కుట్ర ఇదని తెలిపారు. జగన్ కోసం పవన్ కళ్యాన్‌ని దెబ్బకొట్టేందుకు కేసీఆర్ భారాస కాపు నేతలపై దృష్టి పెట్టిందని సంచలన విషయాలను బయట పెట్టారు. పవన్ కళ్యాణ్‌కి తాము అండగా వుంటామని ప్రకటించారు.
జగన్ కోసమే, కేసీఆర్ బీఆర్ఎస్ ఏపీ శాఖ... అబ్బా ఏమి స్కెచ్ గురూ..
తాను ఏమి చెప్తే అది వినే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా వుండటం తెలంగాణలో కేసీఆర్ కి చాలా ముఖ్యం. ఏపీ ప్రయోజనాలు కాలదన్నీ మరీ తెలంగాణకి మేలుచేసే సీఎం జగన్ మళ్లీ సీఎం కావాలన్నదే కేసీఆర్ ఆశయం. అయితే ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. జగన్ పాలనపై జనం వ్యతిరేకత తీవ్రం అవుతోంది. తన కీలుబొమ్మ జగన్ రెడ్డిని కాపాడాలంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చాల్సిన అవసరం ఉందని కేసీఆర్ తలపోశారు. ఆంధ్రవాళ్లను రాక్షసులు అంటూ ఆడిపోసుకున్న కేసీఆర్ టీఆర్ఎస్ పేరుతో ఆంధ్రలో ఓట్లు చీల్చడం కాదు కదా అభ్యర్థుల్ని కూడా పెట్టలేడు. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా, భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. ఈ దుకాణం తెలంగాణ దాటదు అని అందరికీ తెలుసు. కానీ తాము చెప్పినట్టల్లా ఆడే జగన్ ఏపీలో ఓడిపోకూడదంటే ఇక్కడి ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎంతో కొంత చీల్చాలి. టిడిపిది సాలిడ్ ఓటింగ్. అది పెరగడమే తప్పించి తరగదు. టిడిపితో జనసేన అలయెన్స్ కుదిరితే, ఏపీలో ఎదురులేని విజయం తథ్యం. జనసేనకి ఎక్కువశాతం కాపు ఓట్లు పడతాయి. ఆ ఓట్లని చీల్చాలంటే కాపు నేతలకే గాలం వేయాలనేది వైసీపీ బీఆర్ఎస్ కి ఇచ్చిన రోడ్ మ్యాప్. అందుకే బీఆర్ఎస్ ఏపీ శాఖలో ఇప్పుడు చేరింది, ఇకపై చేరేది కూడా ఎక్కువగా కాపునేతలేనని తెలుస్తోంది.