జగన్ పార్టీలో నెంబర్ 2, వైసీపీ కీలక నేత, అలాగే పార్లమెంటరీ నేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డికి ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు అనూహ్యంగా, విజయసాయి రెడ్డి నియామకం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విజయసాయి రెడ్డిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇందుకు సంబంధించి గత నెల 22న జారీ చేసిన జీవో నెంబర్ 68ని రద్దు చేస్తూ తాజాగా మరో ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఆయన పదవి ఎందుకు రద్దు చేసింది అధికారికంగా మాత్రం చెప్పలేదు. మీడియాకు ఇచ్చిన లీక్లు ప్రకారం, ఆయన ఇపటికే రాజ్యసభ ఎంపీగా లాభదాయక పదవిలో ఉన్నందున ఆయన నియామకం చెల్లదని, అందుకే రద్దు చేసామని చెప్తున్నారు. ఒక వేళ రెండు పదవుల్లో కొనసాగితే, రాజ్యసభ సభ్యతిత్వానికి అనర్హుడిగా ప్రకటించే అవకాసం ఉందని, అందుకే ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా చేసిన నియామకం వెనక్కు తీసుకున్తున్నట్టు చెప్తున్నారు.

విజయసాయిరెడ్డి స్థానంలో మరొకరిని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. అయితే విజయసాయి ప్లేస్ లో వచ్చే ఆ ఇంకో వ్యక్తి ఎవరూ అనేదాని పై ఇప్పటి వరకు సమాచారం లేదు. అయితే విజయసాయి రెడ్డిని నియమించ కూడదు అని తెలిసినా, ఎందుకు నియమించారు ? ఇప్పుడు ఆయన్ను ఎందుకు తీసేశారు అనే విషయం పై మాత్రం క్లారిటీ లేదు. అంటే ప్రభుత్వంలో ఉండే అధికారులకు అంత మాత్రం తెలియదా ? లేక తెలిసే ఇలా చేసారా ? అధికారులకు తెలియకపోతే, జగన్ మోహన్ రెడ్డికి తెలియదా ? క్యాబినెట్ ర్యాంక్ పదవి విజయసాయి రెడ్డికి ఇస్తున్నాం అని ప్రచారం చేసి, ఇప్పుడు ఎందుకు ఇలా చేసారు అనే విషయం తెలియాలి. ఢిల్లీలోని ఏపీ ప్రభుత్వం ప్రతినిధిగా, ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ నేతను అక్కడ పెట్టటం ఆనవాయితీగా వస్తోంది. తెలుగుదేశం పార్టీ హయాంలో కంభంపాటి రామ్మోహన్‌రావు ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారు. ఇది క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ కావటంతో, అందరూ దీని కోసం పట్టుబడతారు. అయితే జగన్ , విజయసాయి రెడ్డికి ఇవ్వటంతో, వైసీపీ నుంచి ఎవరూ దాన్ని ప్రశ్నించలేక పోయారు. మరి ఇప్పుడు కొత్తగా ఎవరికి ఇస్తారో చూడాలి.

మొన్నటి దాక మోడీ ప్రభుత్వం, చంద్రబాబు పై, ఆయన పార్టీ వ్యక్తుల పై , రాజ్యాంగ సంస్థలను అడ్డు పెట్టుకుని, చంద్రబాబుని ఊపిరి ఆడనివ్వకుండా చేసి, చివరకు ఆయన ఎన్నికలు ఓడిపోయే దాకా, టార్గెట్ పెట్టుకుని, స్పెషల్ ఆపరేషన్ లు చేసి, చంద్రబాబుని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించటంలో, మోడీ, షా పాత్ర కూడా ఉందనేది అందరికీ తెలిసిందే. చంద్రబాబు మీద మోడీ/షా ఒక విషపు రాజాకీయ క్రీడ ఆడుతుంటే, అటు కేసీఆర్, ఇటు జగన్ ఎంజాయ్ చేసారు. కేసీఆర్ అయితే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, చంద్రబాబు అంతు చూస్తా అని చెప్పి, చంద్రబాబుని ఓడించటంలో ఆయన ఆడాల్సిన ఆట ఆడారు. అయితే, ఎప్పటికైనా పులి మీద స్వారీ చేస్తూ వెళ్తుంటే, ఆ పులి ఎదో ఒక రోజు మనల్నే మింగేస్తుంది అనే విషయం మాత్రం మరిచారు. చంద్రబాబుని సాధిస్తే చాలు, మనమే రెండు రాష్ట్రాలను ఏలొచ్చు అనుకుని, ప్రవర్తించారు. ఆ రోజు చంద్రబాబుకి కేసీఆర్ ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో కాని, ఈ రోజు మాత్రం మోడీ, కేసీఆర్ కు ఆయన మార్క్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు.

ఆపరేషన్ తెలంగాణాలో భాగంగా, తెలంగాణాలో బీజేపీ జెండా పాతటానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని బీజేపీ, మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో, ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచి, తెలంగాణా ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపు, తెలంగణాలో అధికారంలోకి రావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా, అటు రాజకీయంగా, ఇటు అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, టీఆర్ఎస్ పార్టీకి అతి పెద్ద ఫైనాన్షియార్ అయిన మై హోం అధినేత రామేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల పై ఈ రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. నందగిరిహిల్స్‌లోని రామేశ్వరరావు ఇంట్లో కూడా ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో దాదాపు 100 మందికి పైగా ఐటి అధికారులు పాల్గొన్నారు. ఇటీవల టీవీ9, 10టీవీ, మోజో టీవీలను మై హోం అధినేత రామేశ్వరరావు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా, ఇప్పుడు బీజేపీ - టీఆర్ఎస్ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని, ఈ పరిణామం చూస్తుంటే అర్ధమవుతుంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల పై ఆందోళన వ్యక్తం చేసారు. ముందుగా జగన్ ప్రభుత్వానికి, ఆరు నెలల వరకు సమయం ఇద్దామని, వారి విధానాలు చూసి తరువాత స్పందిద్దామని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కాని రోజు రోజుకీ పాలన గాడి తప్పటం, ప్రజల ఇబ్బందులు ఎక్కువ కావటంతో, సుదీర్ఘ అనుభవం ఉన్న నేతగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసేందుకు సిద్ధపడ్డారు. రాష్ట్రంలో ఒక అక్క కూల్చివెతలు, తెలంగాణాకు అప్పగింతలు, ఇలా ఒక వైపు ఉంటే, మరో వైపు విత్తనాల కొరత, కరెంట్ కోతలు, పధకాలు నిలిపుదల లాంటి వాటితో సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. వీటి పై చంద్రబాబు స్పందించారు. జగన్ మోహన్ రెడ్డి నెలరోజుల పాలన పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, ప్రజలను ఇబ్బంది పెడుతున్న విధానాన్ని తూర్పారపట్టారు.

గురువారం ఆయన పార్టీ ఆఫీస్ లో మీడియాతో చిట్ చాట్ చేసారు. తాము పాలించిన గత ఐదేళ్లలో ఒక్కసారి కూడా విత్తనాలు, ఎరువులు సమస్య లేకుండా చూసి, రైతులకు ఇబ్బంది లేకుండా చేసామని గుర్తు చేసారు. రైతులకు విత్తనాలు అందకుండా, వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళన చెయ్యటానికి, తెలుగుదేశం పార్టీ కారణమని వైసీపీ నాయకులు చెప్పటం విడ్డూరంగా ఉందని చంద్రబాబు అన్నారు. వైసీపీ పార్టీ ఏది చెప్పినా, ప్రజలు నమ్ముతారు అనుకుంటుందని, ప్రజలు అమాయకులు కాదని అన్నీ అర్ధం చేసుకుంటారని ఆన్నారు. తాము అధికారంలోకి వచ్చే సరికి కరెంటు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది అని, మేము వచ్చిన నెలరోజుల్లో కరెంటు కోతలు లేకుండా చేశామని, కానీ, వైసీపీ పార్టీ వచ్చిన నెల రోజుల్లోనే కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరెంట్ కోతల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.

అనంతపురం జిల్లా, ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్‌ నియామకం కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటి వరకు ధర్మవరం నియోజకవర్గానికి గోనుగుంట్ల సూర్యనారాయణ పెద్ద దిక్కుగా ఉన్నారు. గత రెండు ఎన్నికల నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2014లో గెలిచారు, 2019లో ఓడిపోయారు. అయితే ఆయన ఇటీవల తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరారు. ఆయన పార్టీ మారిన పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జ్ కోసం తెలుగుదేశం పరత్రి కసరత్తు చేస్తుంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సూచన మేరకు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈ బాధ్యత తీసుకున్నట్టు సమాచారం. దీంతో బాలయ్య రంగంలోకి దిగారు. ఎవరైతే పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిలబదటారో, అలాంటి వారి కోసం పార్టీ చూస్తుంది. నియోజకవర్గంలో, స్థానికంగా ఉండే నాయకులు, కార్యకర్తలతో బాలక్రిష్ణ మాట్లటి వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. వైసీపీ నేతలు దాడులు చేస్తున్న పరిస్థితుల్లో, ధర్మవరంలో పార్టీకి నిలబడే వరి కోసం పార్టీ అన్వేషిస్తుంది.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం, ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు దివంగత పరిటాల రవీంద్ర కుటుంబానికే ఇవ్వనున్నట్టు సమాచారం. పరిటాల కుటుంబానికి, జిల్లాలోని పెనుకొండ, ధర్మవరం, రాప్తాడు నియోజకవర్గాల్లో మంచి పట్టు ఉంది. ఈ పరిస్థితుల్లో ధర్మవరం నియోజకవర్గంలో నాయకత్వ సమస్య ఉండడంతో పరిటాల కుటుంబం నుంచి ఒకరికి ఆ బాధ్యతలు అప్పచెబితే బాగుటుంది అనే అభిప్రాయలు వ్యక్తం అయినట్టు సమాచారం. ఈనెల 8న ధర్మవరంకు మాజీ సీఎం చంద్రబాబు వస్తున్న నేపధ్యంలో ధర్మవరం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పై ఒక క్లారిటీ వచ్చే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ నియామకం పై చంద్రబాబు నిర్ణయాన్ని అమలు చేస్తామని పార్టీ జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read