ఈ రోజు అనకాపల్లి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండటంతో నర్సీపట్నంలో టిడిపి, జనసేన కార్యకర్తలను ముందుగానే పోలీసులు అరెస్ట్ చేసారు. తెలుగుదేశం ఎస్సీ సెల్ కార్యదర్శి కొండ్రు మరిడయ్యను , గవిరెడ్డి వెంకటరమరణను  మరియు  కౌన్సిలర్లు మధు, రామరాజును  జనసేన కన్వీనర్ సూర్యచంద్ర హౌస్ అరెస్ట్ లు చేసారు. అయితే ఈ ముందస్తు అరెస్ట్ లను టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. అరెస్ట్ చేసిన టిడిపి నాయకులను, జనసేన నాయకులను వెంటనే విడుదల  చేయాలని లోకేష్ డిమాండ్ చేసారు. ముఖ్యమంత్రిని మేము అడ్డుకోవాల్సిన అవసరం లేదని, ఆయన చెత్త పాలనపై ఒళ్లు మండి సొంత పార్టీ నేతలే ఆయన్ను నిలదీసే రోజులు వస్తున్నాయని లోకేష్  ఎద్దేవా చేసారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి గారు అయిన, హీరాబెన్​ కొద్ది సేపటి క్రితం కన్ను మూశారు. రెండు రోజుల క్రితం అస్వసతతో, హీరాబెన్​ ఆహ్మదాబాద్ లోని హాస్పిటల్ లో చేరిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులు నుంచి ఆమెకు అత్యవసర చికిత్స అందించారు. ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించారు. ఆమెకు వంద సంవత్సరాలు. ఆమె మరణించిన విషయం స్వయంగా ప్రధాని మోడి, ట్విట్టర్ ద్వారా తెలిపారు. వందేళ్ళ ప్రయాణం, ముగిసి మా తల్లిగారు దేవుడు దగ్గరకు వెళ్లారు అంటూ, ప్రధాని మోడీ ఎమోషనల్ ట్వీట్ చేసారు.

వైసిపి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, జనం నుంచి రోజుకొక చోట చీత్కారాలు ఎదురౌవుతున్నాయి. తాజాగా వైసిపి మంత్రి బుగ్గనరాజేంద్రకు నిరసన సెగ తగిలింది.  ప్యాపిలి మండలంలోని  వెంగళంపల్లికి వెళ్ళిన బుగ్గనను మహిళలు కడిగిపారేశారు. రోడ్డు పనులకు శంకుస్థాపన చేయాడానికి వెళ్ళిన బుగ్గనను మహిళలు చుట్టుముట్టారు. తమకు ఎప్పటి నుంచో ఉన్న  తాగునీటి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదంటూ బుగ్గనను నిలదీశారు.  ఒక పక్క మహిళలు తమకు ఉన్న సమస్యలు చేబుతుంటే బుగ్గన వినకుండా నిదానంగా అక్కడ నుంచి జారుకున్నారు. కాని మహిళలు మాత్రం అరుస్తూనే ఉన్నారు. ఎన్నికల అప్పుడు మా ఊరికి రోడ్లు వేయిస్తాం అని, కాల్వలు వేయిస్తాం అని, తాగునీటి సమస్యను తీర్చుతామని చెప్పి ఇప్పుడెమో, అడుగుతుంటే ముఖంతిప్పుకుని వెళ్ళిపోతారా అంటూ మహిళలు బుగ్గన పై ఆగ్రహం వ్యక్తం చేసారు.

నిన్న ప్రకాశం జిల్లా కందుకూరులో జరిగిన దుర్ఘటన పై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సంతాపం తెలిపారు. టిడిపి అధినేత చంద్రబాబు ప్రసంగిస్తూ ఉండగా ఇలాంటి ఘటన జరగటం, 8 మంది తెలుగుదేశం  కార్యకర్తలు చనిపోవడం తనను  కలిచివేసింది అని బాలకృష్ణ అన్నారు.  తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తలపై ,పసుపుజెండా కప్పి, వారి పాడె మోయాల్సి రావడం చాలా దురదృష్టకరం అని బాలయ్య తెలిపారు. అక్కడ చనిపోయిన  8 మంది కార్యకర్తల మరణం, 80 లక్షల మంది తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎవరైతే తెలుగుదేశం కార్యకర్తలలు చనిపోయారో వారి కుటుంబానికి, వారి పిల్లలకు తెలుగుదేశం పార్టీ అన్నివిధాలా అండగా నిలబడుతుందని చెప్పారు.  ఉంటుందని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతుని తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read