గత 5 ఏళ్ళుగా అవినీతిని అవినీతి అంటూ మనల్ని ఆరోపించారని, గత రెండేళ్ళుగా కేంద్రం కూడా మన మీద అవినీతి మరకలు వెయ్యటానికి స్పెషల్ టీంలు వేసి, అవినీతి అంటించాలని చూసి, ఒక్క రూపాయి కూడా అవినీతి నిరూపించలేకపోయారని, ఇప్పుడు మళ్ళీ వైసీపీ వచ్చి, తెలుగుదేశం పార్టీకి అవినీతి మరకలు అంటించాలని చూస్తుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఎప్పుడైనా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పని చేసామని స్పష్టం చేశారు. నిన్న చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు, నేతలతో ఫోన్‌ లో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ, అక్కడ లేని అవినీతిని మనకు అంటించాలని చూస్తే, అది వారికే చుట్టుకుంటుందని చంద్రబాబు అన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యి, వారి సమస్యల పై పోరాడాలని పార్టీ నేతలను సూచించారు. వైసీపీ చేస్తున్న దాడులు, వారి చేతిలో గాయపడిన వారికి అండగా ఉండాలని చంద్రబాబు అన్నారు. పోలవరం, అమరావతి, ఇతర అభివృద్ధి పనులపై అవినీతి జరిగిపోయినట్లుగా జగన్‌, మంత్రులు అంటున్నారని, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ప్రూవ్ చెయ్యలేకపోయారని అన్నారు.

ఈ సందర్భంగా టీడీఎల్పీ డిప్యూటీ లీడర్ అచ్చెన్నాయుడు మాట్లాడుతూ " అక్కడేదో పెద్ద కొండ ఉంది, తవ్వుతానంటున్నారు, తవ్వుకోండి, తవ్వితే ఎలుక కాదు కదా చీమ, దోమను కూడా మీరు పట్టుకోలేరు. ఎంత తవ్వుతారో, ఎక్కడ నుంచి తవ్వుతారో తవ్వండి, ఎంత లోతుకు తవ్వుతారో తవ్వుకోండి అని అన్నారు. నెల రోజుల నుంచి, తవ్వడానికి గునపాలే దొరకడం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. అవినీతి ఆరోపణలు నిరూపించలేక, అధికారులను అడుగుతూ, అవినీతి బయటపెడితే సన్మానం చేస్తాం అనే స్థాయికి వచ్చారు. జగన్ గురించి, ఆయన కేబినెట్ మంత్రులు గతంలో ఏం మాట్లాడారో అన్ని రికార్డులు మా దగ్గర ఉన్నాయి. వీరందరూ చేసిన చరిత్రలు ఉన్నాయి, ఈ రోజు ఎదో నీతులు చెప్తున్నారు. గతంలో జగన్ అత్యంత అవినీతిని విమర్శించిన వాళ్ళు, ఇప్పుడు జగన్ పక్కన చేరి తాము అసలు అవినీతి అంటే ఏంటో ఎరగం అయినట్లు మాట్లాడుతున్నారు. బొత్స సత్యనారాయణ, కన్నబాబు లాంటి నాయకులు, గతంలో జగన్ అవినీతి గురించి, వైఎస్ ప్రతి రోజు తాగుతాడు అనే అలవాట్ల గురించి ఏమన్నారో అందరికీ గుర్తుందని’’ అన్నారు.

కొత్తగా ఎన్నికైన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భద్రత పై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వెనకడుగు వెయ్యటం లేదు. ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో సహా కలిపి, ఏ ముఖ్యమంత్రి వాడనటు వంటి కాస్ట్లీ కార్లు జగన్ వాడుతున్నారు. అయనకు జడ్ సెక్యూరిటీ కాన్వాయ్ లను ఏర్పాటు చేశారు. జగన్ వాడుతున్న పాత సార్లు తీసేసి, ఆరు టయోటా ఫార్చ్యూనర్ లను ఏర్పాటుచేశారు. పోలీస్ శాఖ టాటా సఫారీ స్టోమ్ వాహనాలు ఆమోదించగా, సియంఓ అధికారులు మాత్రం, టయోటా ఫార్చ్యూనర్ వైపు మొగ్గు చూపారు. న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్, జాతీయ మీడియా రిపోర్ట్ ప్రకారం, బుల్లెట్ ప్రూఫ్ తో కలిగిన, ఆరు కొత్త టయోటా ఫార్చ్యూనర్ ఎస్యువి లను, టయోటా ల్యాండ్ క్రూయిజర్ ను జగన్ కోసం ఏర్పాటు చేసారు. మొత్తం ఆరు టయోటాలకు బుల్లెట్ ప్రూఫ్ రక్షణను కల్పించారు. కార్లు కొనటం ఒక ఎట్టు అయితే, దీనికి బులెట్ ప్రూఫ్ వెయ్యటానికి పెద్దమొత్తంలో డబ్బును ఖర్చు చేసారు.

జాతీయ మీడియా ప్రకారం ఒక్కో ప్రకారం టయోటా ఫార్చ్యూనర్ కు చెందిన బుల్లెట్ ప్రూఫ్ తొడిగిన కార్ ధర రూ. 50 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ బ్లాకు కలర్ లో ఉన్నాయి.అలాగే, జగన్ కోసం ప్రత్యేకంగా వాడే టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ధర ఒక్కటే, రూ.1 కోటి కంటే ఎక్కువ. మళ్ళీ దానికి అధునాతన బులెట్ ప్రూఫ్ షీల్డ్ వెయ్యటానికి మరో 30 లక్షల దాక ఖర్చు అవుతుంది. అంటే మొత్తంగా జగన్ కొత్త కాన్వాయ్ కోసం, 4.5 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. భద్రత కోసం ఏర్పాటు చేసుకోవటం తప్పు లేదు కాని, గతంలో చంద్రబాబు ఇన్ని ఖర్చులు పెట్టారు, అన్ని పెట్టారు అంటూ చివరకు తాగే వాటర్ బాటిల్ పై కూడా రాజకీయం చేసిన విషయం గుర్తు చేసుకోవాలి. అంత పొదుపు చెయ్యాలి అని, చేస్తున్నాం అని చెప్పే వైసీపీ, మరి దీని పై ఏమి సమాధానం చెప్తుందో మరో. మరో పక్క జగన్ వాడుతున్న పాట కాన్వాయ్ ని హైదరాబాద్ పంపించారు. జగన్ అక్కడకు వెళ్ళినప్పుడు అది వాడుకుంటారు.

దాదపుగా 10 ఏళ్ళ కల సాకారం కావటంతో జగన్ మోహన్ రెడ్డి క్యాంప్ హుషారుగా ఉంది. అయితే, ఆంధ్రప్రదేశ్ అధికారిక మ్యాగజైన్ లో జరిగిన పొరపాటు, ప్రభుత్వ పెద్దలకు ఎంతో కోపం తెప్పించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తరువాత, వచ్చిన మొదటి సంచిక కవర్ పేజి పై , అయన ఫోటో బ్లాకు అండ్ వైట్ పడింది అంటూ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అంతే కాదు, రెండు మూడు చోట్ల వారికి అనుకూలంగా కూడా లేవు అంటూ, ప్రింట్ అయిన మ్యాగజైన్ ని పక్కన పడేసారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటో వేసి, జగన్ ను కావలని అవమానించారు అంటూ ప్రభుత్వం వారి పై విచారణ చేసి, చర్యలు కూడా తీసుకునే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతి నెల ప్రభుత్వం తరుపున, ఆంధ్రప్రదేశ్ అధికారిక మ్యాగజైన్ విడుదల అవుతూ ఉంటుంది. ఏపి ప్రభుత్వం చేస్తున్న పనులు, ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాష్టంలో జిరిగే అభివృద్ధి పనులు, ప్రజలకు తెలియటానికి, 'ఆంధ్రప్రదేశ్ ' అనే పేరుతో ప్రభుత్వం ఓ మాస పత్రికను నడుపుతుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ప్రతి నెల ఈ పత్రిక వస్తుంది.

అయితే ఈ సారి ప్రభుత్వం మారటం, జగన్ రావటం జరిగిపోయాయి. ప్రతి నెల లాగానే, ఈ నెల కూడా తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో జూన్ నెలకు సంబధించిన మ్యాగజైన్ రెడీ అయ్యింది. అయితే ఆ మ్యాగజైన్ కవర పేజ్ పై, జగన్ మోహన్ రెడ్డి బ్లాకు అండ్ వైట్ లో వచ్చింది అంటూ ప్రభుత్వ పెద్దలు అభ్యంతరం చెప్పారు. ఇది కావలానే చేసారు అంటూ ఎడిటర్ , మిగతా సిబ్బంది పై వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. అలాగే "జగన్ అనే అతను" అనే వ్యాఖ్యం పై కూడా వైసీపీ నేతలు అభ్యంతరం చెప్పారు. దీంతో ప్రభుత్వ పెద్దలు కూడా ఈ విషయం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. జూన్ మాసానికి ప్రింట్ అయిన 25 వేల కాపిలను తీసుకువెళ్ళి గోడౌన్ లో పడేసారు. ఈ ప్రింటింగ్ కు అయిన ఖర్చు, అక్షరాల 38 లక్షలు. మేము ఆదా చేస్తున్నాం అంటున్న ప్రభుత్వం, కేవలం ఫోటో బ్లాకు అండ్ వైట్ లో వచ్చింది అంటూ, 25 వేల కాపిలను బ్యాన్ చెయ్యటం వల్ల ప్రభుత్వ ఖజానాకు వచ్చిన నష్టం 38 లక్షలు.

రాష్ట్ర ప్రభుత్వ ఇచ్చే నవరత్న పథకాలను ఇంటింటికీ అందించడం, కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వాలంటీర్ల ప్రక్రియ ప్రారంభించింది. గతంలో ఉన్న జన్మభూమి కమిటీకి భిన్నంగా, 5 వేలు జీతం ఇచ్చి, వీరిని పెట్టనున్నారు. గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు ఖాళీలు చెప్తూ నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు విదులైన 11 జిల్లాల్లో నోటిఫికేషన్లు విడుదల కాగా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయితే ఈ నియామకాలు అన్నీ వైసీపీ పార్టీకి చెందుతాయి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి, ఇవి ప్రభుత్వ ఉద్యోగాలు, ఎవరైనా అర్హత ఉంటే, వారు దరఖాస్తు చేసుకుంటే వారికి ఇవ్వాల్సిందే. పార్టీలతో సంబంధం ఉండదు. అర్హులైన వారికి ఈ ఉద్యోగం వస్తే, నెలకు 5 వేలు రూపాయలు ఇస్తారు. కాబట్టి, ఎవరైనా వైసీపీకి మాత్రమే అని చెప్తే, ప్రభుత్వం దృష్టికి తీసుకు రండి.

మరో పక్క, ఈ ఉగ్యోగాలు, సగం మహిళలకు కేటాయిస్తారని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మహిళలు కూడా వీటి కోసం పోరాడాలి. ఈ నెల 24వ తేదీ అంటే సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరణ కార్యక్రమం మొదలు అవుతుంది. ఆగస్టు 15వ తేదీ నాటికి ఎంపిక ప్రక్రియ పూర్తిచేసి, విధుల్లో చేర్చుకుంటారు. ఇంతర్వ్యులు కూడా ఉంటాయి. గ్రామ వలంటీరుగా అవ్వాలి అంటే అదే గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఇంటర్‌, లేదా సమాన విద్యార్హత కలిగి ఉండాలి. 18సంవత్సరాలు పైబడి 30 సంవత్సరాలలోపు ఉండాలి. ఎంపికైన వలంటీర్లకు రూ. 5 వేలు జీతం కూడా ఇస్తారు. కాబట్టి మీ గ్రామంలో మీకే అవకాసం రావచ్చు. గ్రామ సేవ చెయ్యొచ్చు. మీ గ్రామంలో నిరుద్యోగులు అందరి చేత, అప్లికేషన్ పెట్టించి, ప్రభుత్వ సేవ చెయ్యండి. ఇది వైసీపీ పార్టీకి మాత్రమే కాదు, ఎవరైనా అప్లై చెయ్యవచ్చు.

Advertisements

Latest Articles

Most Read