వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, అత్యంత ఆప్తుడు, అన్నిట్లో వెన్ను దన్నుగా ఉంటూ, చివరకు జైలుకు వెళ్ళినప్పుడు కూడా తోడుగా ఉన్న వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి, జగన్‌ మోహన్‌రెడ్డి మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువత, అధికారం లేక ముందు కూడా, జగన్ మోహన్ రెడ్డి తరువాత, అంతా తానే అన్నట్టుగా, విజయసాయి రెడ్డి నడిపించుకుంటూ వచ్చారు. ఆయన చేసిన సేవలకు మెచ్చిన్ జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చారు. అంతే కాదు, ఎన్ని విమర్శలు వచ్చినా, విజయసాయి రెడ్డికి రాజ్యసభ టికెట్ కూడా ఇచ్చి, రాజ్యసభ సభ్యుడిని చేసారు. ఇప్పుడు అధికారం రావటంతో, విజయసాయి రెడ్డికి మరో పదవి కూడా ఇచ్చారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయి రెడ్డిని నియమిస్తున్నట్లు ఈ రోజు సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీని ప్రకారం, ఇక పై విజయసాయి రెడి కేబినెట్ మంత్రి హోదా కలిగి ఉత్నారు.

దీనికి సంబంధించిన జీవోను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొద్ది సేపటి క్రిందట జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసారు. అయితే, ఈ పదవికి సంబధించి, మిగతా విధి విధానాలు, త్వరోలేనే ప్రకటిస్తామని జీఓలో రాసారు. అంటే ఆయన చేసే పని ఏంటి, జీతం ఎంత, ఎంత మంది ఆయన కింద పని చేస్తారు, లాంటి అంశాలు తరువాత చెప్తామంటూ జీఓలో రాసారు. మరో పక్క, ఈ పదవి విజయసాయి రెడ్డికి పెద్ద ఇబ్బందిగా ఏమి ఉండదని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, గత 5 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీని కాదని మరీ, విజయసాయి రెడ్డికి ఢిల్లీలో బీజేపీ పెద్దలు ప్రాధాన్యత ఇచ్చే వారు. ఏకంగా ప్రధాని కార్యాలయంలోకి వెళ్ళిపోయే చనువు ఆయనకు ఉంది. మొన్న ప్రధాని, హాయ్ విజయ్ గారు అని పలకరించటం కూడా చూసాం. ఇంత లాబీయింగ్ తెలిసిన విజయసాయి రెడ్డికి ఈ పదవి కొత్తగా ఏమి ఉండదని, ఎందుకంటే ఆయన ప్రతి రోజు చేసేది ఈ పనే అని విశ్లేషకులు అంటున్నారు.

ఉండవల్లిలోని ప్రజావేదికలో మొన్నటి వరకు సియం హోదాలో పని చేసిన చోట, చంద్రబాబుకు సంబంధించిన వస్తువులను బయట వర్షంలో పడేయడం పై తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేసారు. జగన ప్రభుత్వం చేసిన ఈ అనాగరిక చర్య పై తెలుగుదేశం ఎమ్మల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ప్రతిపక్ష నేతకు ప్రభుత్వమే కార్యాలయం ఇస్తూ ఉంటుందని, అందులో భాగంగా, మొన్నటి దాక పని చేసిన చోటే, ప్రజలను కలుసుకోవడం కోసమే చంద్రబాబు ప్రజావేదికు కేటాయించమని ప్రభుత్వాన్ని కోరారని తెలిపారు. అయితే ఆ లేఖ పై, కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, అక్కడ ఉన్న చంద్రబాబుకు సంబధించిన సామాన్లను బయట పడేశారని ఆవేదన చెందారు. ఇలాంటి కక్షసాధింపు రాజకీయాలు రాజశేఖర్ రెడ్డి హయంలో కూడా లేవని, ఇప్పటివరకూ తమిళనాడులోనే ఇలాంటి రాజకీయం చూశామని అన్నారు. రోజు వారీ పార్టీ కార్యక్రమాల్లో భాగంగా, రోజు వచ్చినట్టే, ప్రజావేదిక వద్దకు వచ్చి, అక్కడ ఆన్న పరిస్థితి చూసి, వైవీబీ షాక్ తిన్నారు.

ప్రజావేదికలో నుంచి ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేతకు సంబంధించిన విలువైన సామాన్లు బయటపడేయడం పైజగన్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న ఉద్యమ వరకు కలెక్టర్ల సదస్సు సచివాలయంలో జరుపుతామని జీఓ కూడా ఇచ్చారని, ఉన్నట్టు ఉండి ఎవరు ఆదేశిస్తే ఇలా చేసారో చెప్పాలని అన్నారు. నిన్న సాయంత్రం ఖాళీ చెయ్యమని చెప్పి, ఉదయం మేము వచ్చే లోపే, ఇలా చెయ్యటం దారుణం అని అన్నారు. చంద్రబాబు ఇంటిని కూల్చేస్తామని చెప్తున్నారని, ప్రజా వేదిక కూడా అక్రమమే అంటున్నారని, మరి అక్రమ కట్టడంలో ఎందుకు కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నారని అని ప్రశ్నించారు. ఇదే ప్రాంతంలో నిన్న కాక మొన్న, నిర్మించిన శారదాపీఠం ఉత్సవాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ తో ఎలా పాల్గున్నారని, ఇది అక్రమం కాదా అని ప్రశ్నించారు. 40 ఏళ్ళు ప్రజా సేవ చేసిన చంద్రబాబుకు ఓ న్యాయం? మీ ఆస్థాన సన్యాసి అయ్యాన స్వరూపానందకు ఇంకో న్యాయమా? అని ప్రశ్నించారు.

40 ఏళ్ళ రాజకీయ జీవితం.. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, జాతీయ స్థాయి నేతగా గుర్తింపు.. తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్త గౌరవం, గుర్తింపు తెచ్చిన నేత.. మొన్న సియంగా చేసినప్పుడు, 11 లక్షల మంది పేదలకు ఇళ్ళు కట్టించి, వారు గౌరవంగా బ్రతికేలా చేసారు. ఇందిరాగాంధీ, రాజశేఖర్ రెడ్డి, మోడీ లాంటి బలమైన నేతలతో పోరాటం చేసిన చరిత్ర. కాని ఈ రోజు ఆయనకు జరిగిన అవమానం మాత్రం, ఎప్పుడూ జరగలేదు. 31 కేసులు ఉన్న ఒక నేతను, సియంగా ఎన్నుకున్న ఏపి ప్రజలు, ఈ రోజు చంద్రబాబుకు జరుగుతున్న అవమానాలు గమనిస్తున్నారు. చంద్రబాబు కంటే, జగన్ ఎక్కువ సేవ చేస్తారని గెలిపించారు కాని, చంద్రబాబుని ఎవరూ అవమానించిన విధంగా అవమానించటానికి కాదు. నిన్న సాయంత్రం, ప్రజా వేదికను స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పిన ప్రభుత్వం, ఈ రోజు ఉదయం వచ్చే సరికి, చంద్రబాబు సామాను అన్నీ ప్రజా వేదిక నుంచి బయట పడేసారు.

అవన్నీ వర్షంలో తడుస్తూ అలా ఉండి పోయాయి. నిన్న సాయంత్రం చెప్పారని, ఈ రోజు బయట పడేశారని, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా చంద్రబాబు వాడిన సామాన్లను బయటపడేయడమేంటని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ప్రజావేదిక చంద్రబాబు ఉంటున్న నివాసానికి అనుబంధంగా ఉంది. ప్రతిపక్ష నేతకు నివాసం ఇచ్చే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దీంతో చంద్రబాబు, ప్రజా వేదిక తన కార్యక్రమాలకు కేటాయించాలని, ప్రభుత్వానికి లేఖ రాసారు. అయితే, దీని పై ఎలాంటి నిర్ణయం ప్రకటించని ప్రభుత్వం, నిన్న సాయంత్రం ఉన్నట్టు ఉండి, ఖాళీ చెయ్యాలని చెప్పింది. అయితే కొంచెం సమయం ఇవ్వాలని, చంద్రబాబు ఊరిలో లేని టైంలో, ఇలా చెయ్యటం కరెక్ట్ కాదని, ఆయన వచ్చిన తరువాత ఆయనకు చెప్పి, చెయ్యాలని తెలుగుదేశం నేతలు కోరగా, ప్రభుత్వం ఇవామీ పట్టించుకోకుండా, నిన్న సాయంత్రం చెప్పి, ఈ రోజు వచ్చి సామాను బయట పడేసారు.

జగన్ మోహన్ రెడ్డి కొత్త పోరాటానికి సిద్ధమయ్యారు... అదే అవినీతి పై పోరాటం.. ఈ రోజు ప్రభుత్వ ఇంజినీరింగ్ నిపుణులతో, ప్రాజెక్ట్ ల పై సమీక్ష నిర్వచించారు. ఆ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఈ చెడిపోయిన వ్యవస్థలను బాగు చెయ్యటం కోసమే నేను ఉన్నానని అన్నారు. వ్యవస్థలను బాగు చెయ్యటానికే కంకణం కట్టుకున్నానని, దేశం మొత్తం మన వైపే చూడాలని అన్నారు. ప్రాజెక్ట్ ల విషయంలో తన పైనే ఒత్తిడి తెచ్చారని, నన్నే చూసీచూడనట్టు పోవాలని చెప్పారని, అయితే నా దగ్గర అవినీతి అనే మాట ఉండదని చెప్పానని జగన్ అన్నారు. అందుకే అవినీతి పై పోరాటం చెయ్యాలని నిర్ణయం తీసుకునన్నాని జగన్ చెప్పారు. అసలు అవినీతి అంటే ఏంటో తన ప్రభుత్వంలో, ప్రజలకు తెలియకూడదని, ఇందుకోసం అధికారులు తనతో కలిసి రావాలని జగన్ అన్నారు. అందుకే రివెర్స్ టెండరింగ్ విధానం తెస్తున్నామని జగన్ అన్నారు.

తన సొంత పత్రిక సాక్షిలో, చంద్రబాబు అవినీతి చేసారంటూ వచ్చిన కధనాలు అధికారులుకు చూపించి, దీని సంగతి చూడండి అని ఆదేశించారు. సాక్షిలో వచ్చిన కధనాలు చూసి, దాని పై నిజానిజాలు వెలికితీయాలని అధికారులను ఆదేశించారు. అయితే జగన్ మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. 31 అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతూ, అవినీతి పై పోరాటం చేస్తానని అంటాడు ఏంటి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు అవినీతి చేసాడు అంటూ హడావిడి చేసి, అధికారంలోకి వచ్చి నెల రోజులు అయినా, ఒక్క రూపాయి అవినీతి నిరూపించలేక, సెక్రటేరియట్ ఉద్యోగులను, మీరు చంద్రబాబు చేసిన అవినీతి ఏమన్నా చెప్తే, సన్మానం చేస్తాను అని చెప్పటం చూస్తుంటే, జగన్ పరిస్థితి అర్ధమవుతుందని అంటున్నారు. అవినీతి లేన పరిపాలన చేస్తే అందరికీ సంతోషమే అని, కాని జగన్ లాంటి వారు ఈ మాటలు చెప్తుంటే, వింతగా ఉందని అంటున్నారు.

Advertisements

Latest Articles

Most Read