గత ఎన్నికల్లో, పోలింగ్ జరిగిన విధానం కౌంటింగ్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవరం మాజీ ఎమ్మల్యే, టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు ఈ అవకతవకలు చాలెంజ్ చేస్తూ హైకోర్ట్ కు వెళ్లారు. ఓట్ల లెక్కింపు సమయంలో, రిటర్నింగ్‌ అధికారి చట్టానికి విరుద్ధంగా, నిబంధనలు పట్టించకుండా ప్రవర్తించిన అతని పై చర్యలు తీసుకువాలని రిట్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే, ఈ పిటీషన్ పై ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పింది. టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు వేసిన పిటిషన్‌కు విచారించే అర్హత లేదని, దాన్ని కొట్టేయ్యాలని ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరించింది. ఎలక్షన్ కమిషన్ తరుపున న్యాయవాది హై కోర్ట్ కు తన వాదనలను వినిపిస్తూ, ఓట్ల కౌంటింగ్‌, ఫలితాల ప్రకటన పై ఏమైనా అభ్యంతరం వుంటే ఎన్నికల పిటిషన్‌ దాఖలు చెయ్యాలి కాని, బొండా ఉమ రిట్‌ వేసారని, ఇది రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనల మేరకు విరుద్ధమని, ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదు అంటూ వాదనలు వినిపించారు.

దీని పై బోండా ఉమామహేశ్వరరావు తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. ఎన్నికల పిటిషన్‌ మాత్రమే వేయాలన్న ఎన్నికల సంఘం ఈసీ వాదన సరికాదన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ నిబంధనలను పాటించక పోవటం వలెనే రిట్ పిటీషన్ దాఖలు చేసామని, దాని పై ఈసీ అభ్యంతరం చెప్పడం వింతగా ఉందని అన్నారు. రిట్‌ దాఖలు వేయకుండా, నిషేధం ఏమి లేదని అన్నారు. రిట్‌ పిటీషన్ ను విచారించొచ్చని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు హైకోర్ట్ దృష్టికి తీసుకువచ్చారు. ఇద్దరు న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో, ఇది విచారణ అర్హత ఉందో లేదో, వచ్చే వారం తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేస్తూ, దీన్ని వాయదా వేసింది. ఈ పిటీషన్ ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ చేసి, తీర్పును వాయిదా వేసింది.

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో, అందరినీ ఆకట్టుకున్న పధకం అమ్మఒడి. బడికి పంపించే పిల్లల తల్లులు అందరికీ 15 వేలు ఇస్తాం అంటూ చేసిన ప్రకటన, జనాల్లోకి బాగా వెళ్ళింది. కొంత మంది ఇది సాధ్యం కాదు అని చెప్పినా, ప్రజలు మాత్రం నమ్మారు, జగన్ ను గెలిపించారు. అయితే ఇప్పుడు ఎన్నికలు గెలిచిన తరువాత, జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చెయ్యాలనుకున్న అమ్మ ఒడి పథకం పై నిన్న ప్రభుత్వం క్లారిటీ వచ్చింది. అమ్మఒడి పథకానికి సంబంధించిన కీలక అంశం పై రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ప్రైవేటు స్కూల్స్ లో చదువుకునే వారు ఎవరు ఉన్నా, ఈ పధకం వారికి వర్తించదని చెప్పారు. ప్రభుత్వ బడులకు పంపించే పిల్లల, తల్లులుకు మాత్రమే ఈ పధకం కింద అర్హులని, వారికి మాత్రమే అమ్మఒడి పథకం కింద, జగన్ చెప్పినట్టు రూ.15వేల ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.

అమ్మ ఒడి పథకాన్ని జనవరి 26 నుంచి అమలు చేస్తామంటూ జగన్ చెప్పిన వెంటనే, అందరూ సంతోష పడ్డారు. తల్లులు అందరికీ 15 వేలు వస్తాయని సంబర పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం, క్లారిటీ ఇవ్వటంతో, ప్రైవేటు స్కూల్స్ లో చదువుతున్న పిల్లల తల్లులు అవాక్కయ్యారు. ప్రైవేటు స్కూల్స్ లో అందరూ గొప్ప వారే ఉండరని, ఎన్నో చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్స్ లో పేదలు తమ పిల్లలను పంపిస్తున్నారని గుర్తు చేస్తున్నారు. పాదయాత్రలో అన్ని స్కూల్స్ కు ఇస్తాం అని చెప్పి, ఇప్పుడు కేవలం ప్రభుత్వ స్కూల్స్ కు మాత్రమే ఇవ్వటం దారుణం అని అన్నారు. ఇదే ప్రాతిపదికిన, కాలేజీల్లో చదివే విద్యార్ధులకు ఎందుకు ఫీజ్ చెల్లిస్తున్నారని, ప్రైవేటు కాలేజీలకు ఎందుకు డబ్బులు ఇస్తున్నారని, దానికి, దీనికి తేడా ఏంటి అంటూ నిలదీస్తున్నారు. మాట తప్పను, మడం తిప్పను అంటే ఇదేనా అని అడుగుతున్నారు. చూద్దాం, ప్రభుత్వం ఏమి చెప్తుందో...

ఈ రోజు ఢిల్లీలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం కొద్ది సేపటి క్రిందట ముగిసింది. సుమారుగా నాలుగు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. జమిలి ఎన్నికలకు మూడు పార్టీలు మినహా అన్నీ మద్దతు పలికాయని, కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అయితే వామపక్షాలు, ఎంఐఎం పార్టీలు మాత్రం ఈ ప్రక్రియను వ్యతిరేకించాయి. మరో పక్క ఈ భేటీకి కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ, డీఎంకే, టీఎంసీ, టీడీపీ దూరంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తన అభిప్రాయాన్ని లేఖ ద్వారా పంపించింది. ఇది ఇలా ఉండగా, అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పార్లమెంటు లైబ్రరీ భవనంలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముగిసిన తర్వాత వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి కోసం అక్కడ వైట్ చేస్తూ ఉన్నారు.

అయతే ఈ లోపు అటుగా వెళ్తున్న ప్రధాని, విజయసాయి రెడ్డి అక్కడ కనిపించడంతో ఆయనను పలకరిస్తూ హాయ్ విజయసాయి అంటూ సంబోధించి వెళ్ళిపోయారు. ఆ సమయంలో విజయసాయి ఎంతో వినయంతో, మోడీకి అభివాదం చేసారు. అయితే ప్రత్యెక హోదా కోసం మెడలు వంచుతాం అంటూ ఆంధ్ర రాష్ట్రంలో ప్రగల్బాలు పలికి, ఢిల్లీలో మాత్రం ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ, కాలం నడిపెస్తున్నారు, జగన్, విజయసాయి. ప్రత్యెక హోదా పై అసెంబ్లీలో తీర్మానం చేస్తూ, మేము ప్రత్యెక హోదా ఇవ్వము అని చెప్తున్న కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనకుండా, మొత్తం చంద్రబాబు మీద నెపం నెట్టేసి, ఆయన పై ఎదురు దాడి చెయ్యటం నిన్న అసెంబ్లీ చూసాం. అసెంబ్లీలో ప్రత్యెక హోదా పై ఇంత హడావిడి చేసి, ఢిల్లీలో మాత్రం ఇలా కేంద్రంతో కాంప్రమైజ్ అయిపోయే కధ నడిపెస్తున్నారు. చూద్దాం ఈ ప్లీజ్ సార్ ప్లీజ్ అనే విధానంతో, ప్రత్యెక హోదా సాధిస్తారేమో...

మొన్నటి వరకు చంద్రబాబు తాగే మినరల్ వాటర్ పై కూడా గోల గోల చేసి, మేము ప్రజలను ఇబ్బంది పెట్టం, మేము అసలు ఖర్చు చెయ్యం అంటూ వైసీపీ నేతల ప్రసంగాలు చూసాం. ట్రాఫిక్ కి ఇబ్బంది అని చెప్పి, చంద్రబాబు ఉండవల్లి నుంచి గన్నవరం వరకు హెలికాప్టర్ వాడితే, ఖర్చు ఖర్చు అంటూ గోల చేసారు. అదే హెలికాప్టర్ కాకుండా వెళ్తే, చంద్రబాబు వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది, సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు అంటూ రాజకీయం చేసారు. అయితే, ఇప్పడు వాళ్ళే అధికారంలోకి వచ్చారు. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేస్తాను అంటూ చెప్తున్న జగన్, తన కోసం ఏర్పాటు చేసిన హెలికాప్టర్ ఎగరటానికి, 42 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన రాకపోకల కోసం, కృష్ణాకెనాల్‌ రైల్వే జంక్షన్‌ సమీపంలో హెలీప్యాడ్‌ ఏర్పాటు చేసారు. దానికి నిన్న ట్రయిల్‌రన్‌ జరిగింది.

హెలీప్యాడ్‌ నుంచి బయటకు వచ్చే జగన్ కాన్వాయ్ కి డివైడర్‌ అడ్డుగా మారింది. దీన్ని వెంటనే తొలగించాలని జగన్ భద్రతా సిబ్బంది మున్సిపల్‌ అధికారులకు ఆదేశించారు. అంతే కాకుండా జగన్ నివాసం నుంచి పడమర వైపు బయటకు వచ్చే మార్గంలో అడ్డుగా ఉన్న మూడు ఇళ్లను తొలగించాలని కడు ఆదేశాలు వెళ్ళాయి. వెంటనే రన్గమ్లొఇ దిగిన అధికారులు ఆ ఇళ్ళ యజమానులతో చర్చిస్తున్నారు. ఈ మూడు ఇల్లు కాకుండా, హెలీప్యాడ్‌ ఉన్న ప్రాంగణ ప్రాంతంలో 42 కుటుంబాలు ఉంటున్నాయి. వారిని కూడా వెంటనే అక్కడ నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. హెలిప్యాడ్ ప్రారంభం అయ్యే లోపు, అత్యవసరంగా 12 ఇళ్లను తొలగించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆ ఇంటి యజమానులుతో మాట్లాడి, వారిని అక్కడ నుంచి వేరే చోటుకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సియం హెలికాప్టర్ ఎగరటం కోసం, ఏళ్ళుగా అక్కడ ఉంటున్న 42 కుటుంబాలను అక్కడ నుంచి పంపించటం దారుణం అని స్థానిక టిడిపి నేతలు వాపోతున్నారు.

Advertisements

Latest Articles

Most Read