గుడివాడ రాజకీయం రోజు రోజుకీ రసవత్తరంగా మారుతుంది. కొడాలి నానిని ఓడించటానికి టిడిపి అనేక పావులు కదుపుతుంది. అయితే ఇక్కడ కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటంతో, అటు నుంచి నరుక్కువచ్చే వ్యూహం కూడా ఇందులో ఉంది. ఈ క్రమంలోనే గుడివాడలో కొడాలి నానికి మొన్నటి వరకు అండగా నిలిచిన వంగవీటి వర్గం, నెమ్మదిగా దూరం జరగటం మొదలు పెట్టింది. తాజాగా కొడాలి నానికి భారీ షాక్ ఇచ్చారు వంగవీటి వర్గీయులు. గుడివాడ టిడిపి ఇంచార్జ్ రావితో కలిసి, రాధా-రావి యుత్ పేరుతో ముందుకు వచ్చారు. రాధా-రావి యూత్ పేరుతో గుడివాడలో అనేక కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఎక్కడ చూసినా రాధా-రావి యూత్ ఫ్లెక్సీలు వెలిచాయి. గత కొంత కాలంగా, వంగవీటి రాధా, రావి వెంకటేశ్వరరావు మధ్య చర్చలు జరిగాయి. అలాగే ఈనెల 26న వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో, రాధా, రావి కలిసి పాల్గుననున్నారు. ఈ కలయికతో కొడాలినాని వర్గంలో కూడా టెన్షన్ మొదలైంది. కొడాలి నానికి అండగా ఉంటూ వచ్చిన వర్గం, ఇప్పుడు దూరం జరుగుతుంది. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
news
ఈ రోజు చంద్రబాబు విజయనగరం మీటింగ్ కు ప్రజలు వెళ్ళకుండా, అనేక ప్లాన్లు వేస్తున్న వైసీపీ
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గారు చేస్తున పర్యటనలకు జనం నుంచి ఊహించని స్పందన వస్తుంది. ఆయన భహిరంగ సభలకు వస్తున్న జనాన్ని చూస్తుంటే వైసిపి నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. చంద్రబాబు నాయుడు పర్యటనలకు జనం రాకుండా ఉండటానికి అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్లాన్ లు అన్నీ ఇన్నీ కాదు. కాని వారి ఒక్క ప్లాన్ కూడా ఫలించడం లేదు.పైగా ఒక జిల్లాకు మించి మరొక జిల్లాలో చంద్రబాబుకి జనం నుంచి వస్తున్న విశేష స్పందన చూసి వారికి మైండ్ బ్లాంక్ అయిపోతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు తాజాగా ఈ రోజు చంద్రబాబు విజయనగరం పర్యటనలో బహిరంగ సభకు ఎక్కువ మంది వెళ్లకుండా చేసేందుకు వైకాపా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. టౌన్ పరిధిలోని 50 వార్డుల్లో ప్రైవేటు మీటింగ్లు పెట్టి ప్రజలను ఆపేందుకు, వైసీపీ నాయకులు ప్లాన్ వేసినట్టు వార్తలు వచ్చాయి. చంద్రబాబు మీటింగ్ కు ఎవ్వరూ వెళ్లొద్దని వార్డుల్లో వైసీపీ నాయకులు ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేఖత రోజురోజుకి పెరిగిపోవడం, అంతే కాకుండా చంద్రబాబు ఇదివరకు చేసిన అభివృద్దిని ప్రజలు గుర్హుచేసుకుంటూ ఆయన సభలకు కేవలం తెలుగుదేశం అభిమానులే కాకుండా, సామాన్య ప్రజానీకం సైతం నీరాజనం పలుకుతున్నారు.
రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న, బాలయ్య-పవన్ భేటీ
నిన్న నందమూరి బాలకృష్ణ ని పవన్ కళ్యాణ్ కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో బాలయ్య బాబుని, పవన్ కల్యాణ్ కలిసారు. దీనితో సినీ రాజకీయ వర్గాల్లో ఇదే హట్ టాపిక్ గా మారింది. అన్నపూర్ణ స్టూడియోస్ లోనే నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ షూటింగ్ గ్యాప్లో పవన్ ,బాలయ్యను కలిసారు. వారిద్దరూ కలిసి దాదాపు 20 నిమిషాల పాటు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. వీరిద్దరూ చాలాసేపు ఏకాంతంగా మాట్లుడు కోవడంతో, ఆంద్రా రాజకీయాలపై చర్చ జరిపారని సమాచారం. అంతే కాకుండా ఈనెల 27న బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కు పవన్ కళ్యాణ్ అతిథిగా వస్తునట్టు సమాచారం.
వెంకయ్య నాయుడు, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ, ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి ఒకే వేదిక పై..
ఈ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెనాలికి విచ్చేయనున్నారు. ఘనంగా జరుగుతున్న ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాల మహోత్సవ సభకు వెంకయ్య రానున్నారు. తెనాలిలో జరుగుతున్న ఈ ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలకు ఈ రోజు చాలా మంది అతిధులు రానున్నారు. ఈ ప్రోగ్రాంలో హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి గారు కూడా పాల్గొననున్నారు. వీళ్ళే కాకుండా ఇదే కార్యక్రమంలో మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ గారు , ఇంకొంత మంది ప్రముఖులు హాజరు కానున్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి గారు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ , జయచిత్రకు ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందించనున్నారు. ఎన్టీఆర్ అభిమాన సత్కార అవార్డు, వై.పాణిరావుకు ప్రదానం చేయనున్నారు.