అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా రాయలసీమని ప్రగతిపథంలోకి తీసుకెళ్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి మాటలు నీటిమూటలేనని మరోసారి స్పష్టమైందని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. మూడేళ్ల క్రితం కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ, మూడేళ్లలో పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. మూడేళ్లు పూర్తి అయినా ఉక్కు కర్మాగారం నిర్మాణంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీనిపై సోషల్మీడియా వేదికగా ప్రతిపక్ష టిడిపి నేతలు వ్యంగ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 15వేల కోట్ల పెట్టుబడితో నిర్మించబోయే స్టీల్ ఫ్యాక్టరీకి 2019 డిసెంబరు 23న సీఎం జగన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేసి 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. పనిలో పనిగా తనకు అస్సలు సూటు అవ్వని చిత్తశుద్ధి, నిజాయితీ, విశ్వసనీయత అంటూ ఏవో కబుర్లు కూడా చెప్పారు. మూడేళ్లు పూర్తయ్యింది. కడప స్టీల్ ఫ్లాంట్ శిలాఫలకం వెక్కిరిస్తోంది. దీనిపై ప్రతిపక్ష టిడిపి నాడు జగన్ ఇచ్చిన హామీలు, నేటి దుస్థితిని వివరిస్తూ పోస్టులతో ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రంలో వైసీపీ రోజు రోజుకీ రెచ్చిపోతుంది. మొన్న మాచర్ల సీన్ మర్చిపోక ముందే, ఈ రోజు తంబళ్లపల్లి ముదివేడు వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుని. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అక్కడ నుంచి మొదలైన రచ్చ చివరకు మాచర్ల లాగే, టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతల రాళ్ల దా-డి వరకు వెళ్ళింది. అక్కడితో ఆగకుండా ముదివేడులోని టీడీపీ సానుభూతిపరుల ఇళ్లలోకి వైసీపీ కార్యకర్తలు చొరబడి దా-డి చేసారు. వైసీపీ కార్యకర్తల దా-డిలో పలువురు టిడిపి కార్యకర్తలకి తీవ్ర గాయాలు అయ్యాయి. దా-డి దృశ్యాలను సోషల్ మీడియాలో లైవ్ ప్రసారం చేసారు వైసీపీ కార్యకర్తలు. ఏకంగా లైవ్ పెట్టి, తాము ఇలా చేస్తాం, ఎవడైనా మాకు లెక్క లేదు అనే విధంగా, వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ఇప్పటికే మాచర్ల ఘటన పై టిడిపి పోరాటాలు చేస్తూ ఉండగానే, ఈ రోజు మళ్ళీ తంబళ్లపల్లిలో రెచ్చిపోయింది వైసీపీ. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉండటంతోనే, ఈ ఇబ్బందులు అని టిడిపి నేతలు వాపోతున్నారు.

ఇద్దరు టాప్ హీరోలు ఒక చోట కలిస్తే ? ఇద్దరు టాప్ నేతలు ఒక చోట కలిస్తే ? తెలుగు రాష్ట్రాలు షేక్ అయ్యే వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని కలిసారు. ఇంకో విధంగా చెప్పాలి అంటే తెలుగు సినీ ఇండస్ట్రీ టాప్ హీరోలు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. బాలకృష్ణ నటిస్తున్న వీరసింహా రెడ్డి సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ రోజు బాలయ్య షూటింగ్ చేస్తున్న వీరసింహా రెడ్డి సెట్ కు, పవన్ కళ్యాణ్ వచ్చి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ భేటీ ఎందుకు జరిగింది అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక పోతే ఇప్పటికే అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ షూటింగ్ కూడా ఈ వారమే జరుగుతుందని చెప్తున్నారు. సంక్రాంతికి ఈ ఎపిసోడ్ వస్తుందని అంటున్నారు. మొత్తం మీద ఇద్దరు టాప్ హీరోలు ఒక్క చోట చేరితే, దబిడి దిబిడే మరి.

Advertisements

Latest Articles

Most Read