ఢిల్లీలో తెలుగుదేశం పార్టీ నిర్వహించతలపెట్టిన ధర్మపోరాట దీక్షకు వెళ్తున్న రైళ్లను రైల్వే అధికారులు భోపాల్ వద్ద నిలిపివేశారు. దీంతో రైల్వే అధికారులతో టీడీపీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ధర్మ పోరాట దీక్షలో పాల్గొనేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున నిన్న రాత్రి రైళ్లల్లో బయలుదేరారు. అయితే... ఈ రైళ్లను భోపాల్ దగ్గర రైల్వే అధికారులు నిలిపివేశారు. కాగా... ఈ సమాచారాన్ని టీడీపీ నేతలు ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో... రైళ్లకు అనుమతివ్వాలని ఢిల్లీలోని ఏపీ భవన్ కమిషనర్ సంబంధిత రైల్వే అధికారులను కోరారు. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నానికే రైళ్లు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా రాత్రి పది గంటలలోగా ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉందని సమాచారం.

deeksha 10022019

మరో పక్క, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఢిల్లీలో రేపు నిర్వహించతలపెట్టిన ధర్మపోరాటదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 7గంటలకు రాజ్‌ఘాట్‌లో చంద్రబాబు నివాళులర్పించనున్నారు. ఆ తర్వాత ఏపీ భవన్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళి అర్పిస్తారు. అనంతరం రేపు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా చంద్రబాబు దీక్ష చేయనున్నారు. కాగా... ఈ దీక్షలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గొననున్నారు. ఈ ఆందోళనా కార్యక్రమానికి 7వేలమందికిపైగా వస్తారని అంచనా వేస్తున్నారు.

deeksha 10022019

ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై చంద్రబాబు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. ధర్మపోరాట దీక్ష సందర్భంగా ఢిల్లీలోని ప్రధాన కూడళ్లలో భారీ హోర్టింగులు ఏర్పాటు చేశారు. దీక్ష కోసం వచ్చేవారికి బస, భోజన ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపే అవకాశం ఉండటంతో.. దీక్షా వేదిక దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు దీక్ష తర్వాత మంగళవారం చంద్రబాబు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోనూ భేటీకాబోతున్నారట. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటూ విభజన హామీల అమలులో జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఏపీకి న్యాయం చేయడం చేతకాని ప్రధాని మోదీ ఇక్కడకొచ్చి తిట్టేసి పోయారని, అవాస్తవాలు మాట్లాడి, ప్రజల ముఖాన ఇంత మన్ను, నీళ్లు కొట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. 'గో బ్యాక్' అంటే మోదీని ఢిల్లీకి పొమ్మనో, మళ్లీ అధికారం చేపట్టమనో కాదని, ఢిల్లీ గద్దె దిగి గుజరాత్‌కు పొమ్మని జనం తెగేసి చెబుతున్నారని అన్నారు. మోదీ గుంటూరులో చేసిన ప్రసంగంలో తనపై చేసిన విమర్శలను అంతే దీటుగా చంద్రబాబు తిప్పికొట్టారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచామని మోదీ తనపై విమర్శలు చేశారని, నిజానికి వెన్నుపోటు పొడిచింది తాను కాదని, గురువుకే వెన్నుపోటు పొడిచిన చరిత్ర మోదీదేనని అన్నారు. తనను చేరదీసి ఆదరించిన అద్వానీకి వెన్నుపోటు పొడిచింది మోదీ కాదా అని ప్రశ్నించారు. గోద్రా అల్లర్ల అనంతరం మోదీని తీసేయాలని వాజ్‌పేయి సిఫారసు చేసినప్పుడు అద్వానీనే అడ్డుపడి మోదీని ఆదుకున్నారని, అలాంటి అద్వానీ ఎదురుపడితే నమస్కారం పెట్టే సంస్కారం కూడా మోదీకి లేదని విమర్శించారు.

moidi 09022019 2

మోదీ చెబుతున్నట్టు తాము పార్టీలేమీ మార్చలేదని, ఎన్టీఆర్ పేరు పెట్టిన పార్టీలోనే ప్రజాసేవ చేస్తున్నామని, ఏరోజూ తాము అవకాశవాద రాజకీయాల జోలికి పోలేదని చెప్పారు. 'ఆయన ఛాయ్ వాలా అంటారు. లక్షలు, కోట్ల రూపాయల సూటు, బూటు వేస్తారు. నేను అప్పడూ ఇప్పుడూ ఒకే తరహా డ్రెస్ వేసుకుంటాను. ఎన్నికల్లో ఓడిపోయిన సీనియారిటీ నాకు లేదని మోదీ చెబుతున్నారు. 1994, 96, 98, 99 ఇలా గెలుచుకుంటూ వెళ్లాం' అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు తాము గౌరవం ఇచ్చామంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, మీరా గౌరవం ఇచ్చింది? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రానికి న్యాయం చేయమని అడిగామే కానీ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే, నాకీ పని చేసి పెట్టమనో ఏరోజూ మోదీని అడగలేదని చంద్రబాబు సమాధానమిచ్చారు.

 

moidi 09022019 3

కాంగ్రెస్‌తో చేతులు కలిపారంటూ మోదే చేసిన వ్యాఖ్యలపైనా చంద్రబాబు ఘాటుగానే స్పందించారు. కేంద్రంలోని కాంగ్రెస్‌తో, అప్పటి ప్రభుత్వ దురహంకారంతో తాము ఆనాడు పోట్లాడామని, ఇవాళ అదే స్థానంలో బీజేపీ న్యాయకత్వంలో అన్యాయం జరుగుతుంటే దేశాన్ని కాపాడేందుకు పోరాడితే తప్పేమిటని ప్రశ్నించారు. పోరాడటమే కాదు....ఇంకా గట్టిగా పోరాడతామన్నారు. లోకేష్ తండ్రి చంద్రబాబు అంటూ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని కూడా సీఎం ఎండగట్టారు. 'మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. అనుబంధాలు, ఆత్మీయతలు తెలియవు' అని మండిపడ్డారు. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని, కానీ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడంతోనే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఎలాంటి బంధాలు లేవని, అసలు ఆయనకు కుటుంబ వ్యవస్థపై గౌరవమే లేదని, మోదీకి భార్య ఉందన్న విషయం ఎవరికీ తెలియదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ట్రిపుల్‌ తలాక్‌ చెల్లదని తెలిసే చట్టాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇక చంద్రబాబును మోదీ తన ప్రసంగంలో పదేపదే లోకేష్ తండ్రి అనడంపై చంద్రబాబు స్పందిస్తూ ‘నన్ను లోకేష్‌ తండ్రి అన్నారు.. దానికి గర్వపడుతున్నా’ అన్నారు. మోదీ గురివింద చందంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాము వ్యక్తిగత జీవితాలను వదులుకొని రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తున్నామని, రాష్ట్రానికి రావాల్సిన డబ్బును రాబట్టి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

cbnquestions 10022019

'మీకు కొడుకుల్లేరు. పెళ్లాన్ని వదిలేశారు. కుటుంబం అక్కర్లేదు. అనుబంధాలు, ఆత్మీయతలు తెలియవు' అని మండిపడ్డారు. తాను వ్యక్తిగత విమర్శలకు దూరమని, కానీ మోదీ వ్యక్తిగత విమర్శలకు దిగడంతోనే తాను సమాధానం ఇవ్వాల్సి వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. జశోదా బెన్ భర్త మోడీ అని నేను సంబోధిస్తే తలకాయి ఎక్కడ పెట్టుకుంటారు అంటూ ఘాటుగా బదులిచ్చారు. "నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్‌ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది." అని చంద్రబాబు అన్నారు.

cbnquestions 10022019

న్యాయం చేయమంటే దాడి చేస్తారా? అంటూ చంద్రబాబు మండిపడ్డారు. తాము కూడా ఎదురుదాడి చేస్తామని అన్నారు. ఏపీకి కొత్తగా ఏమీ ఇవ్వనక్కర్లేదని, అంతకు ముందు ప్రధాని ఇచ్చిన హామీలను నిలబెడితే చాలన్నారు. ఆ పని కూడా మోదీకి చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. తనకు, మోదీకి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. మోదీ హయాంలో గుజరాత్‌లో ముస్లింలను ఊచకోత కోస్తే.. రాజీనామా చేయాలని తానే డిమాండ్‌ చేశానన్నారు. అది మనసులో పెట్టుకుని మోదీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. లౌకిక దేశంలో హింసకు తావులేదని, అది మనసులో పెట్టుకుని మోదీ ఇప్పుడు కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.

ఏపీకి ఎంతో చేశామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ గుంటూరులో చెప్పిన లెక్కలపై సీఎం చంద్రబాబు సమాధానమిచ్చారు. ఆనాడు లోటు బడ్జెట్‌లో ఉన్న ఏపీ ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, రాజకీయాల కోసం కాదని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకపోయి ఉంటే మరో 15 సీట్లు గెలిచేవాళ్లమని అన్నారు. ఏపీకి రూ. 3 లక్షల కోట్లు ఇచ్చామని మోదీ చెబుతున్నారని, ఎక్కడ ఇచ్చారు? దేనికి ఇచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. పెత్తందారీ వ్యవస్థను టీడీపీ ఉపేక్షించదన్నారు. ఎదురు ప్రశ్నిస్తే ఐటీ, ఈడీలతో దాడులు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

moidi 09022019 2

బీజేపీ సభకు మనుషులు రారు కాబట్టి.. వైసీపీ నేతలు జనసమీకరణ చేశారని చంద్రబాబు విమర్శించారు. కేంద్రం ఎలాంటి దాడులు చేసినా తాము భయపడేది లేదని, జగన్‌ భయపడుతారన్నారు. రాజధానికి డబ్బులు ఇవ్వరని, పోలవరానికి ఇంకా రూ. 4 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని, వెనుకబడిన ప్రాంతాలకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలకు డబ్బు ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి తీసుకున్నారని ఆరోపించారు. తాము మోదీకి ఊడిగం చేయడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. ఊడిగం చేయడానికి తాము కేంద్రానికి బానిసలం కాదన్నారు. తనపై నమ్మకంతో రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని సీఎం స్పష్టం చేశారు. రైతులకు ఉన్న స్ఫూర్తి ఈ ప్రధానికి లేదని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

moidi 09022019 3

గతంలో తనపై మోదీకి ఉన్న నమ్మకం ఇప్పుడు ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. ఇవ్వడం చేతకాక తనను విమర్శిస్తున్నారని అన్నారు. విభజన హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని చంద్రబాబు, మోదీని సూటిగా ప్రశ్నించారు. మన గడ్డపైకి వచ్చిన ప్రధాని అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మోదీ ఒక ప్రచార ప్రధాన మంత్రి అని అన్నారు. రాష్ట్రాన్ని దోచుకోవడానికి మోదీ ప్రయత్నిస్తున్నారని, మన గ్యాస్‌ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. నోట్ల రద్దు వల్ల ఎవరికైనా లాభం జరిగిందా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దు పిచ్చి తుగ్లక్‌ చర్యగా చంద్రబాబు అభివర్ణించారు.

 

 

Advertisements

Latest Articles

Most Read