ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 10, 16 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ ఖరారైనట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తిగా ఎన్నికల ప్రచారం కోసమే ఆయన వస్తున్నారని వివరించాయి. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలోను మోదీ కార్యక్రమాలు ఉంటాయని బీజేపీ నేతలు తెలిపారు. దీనికంటే ముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఫిబ్రవరి 4న విజయనగరం వస్తున్నారు. ఉత్తరాంధ్రాలోని 7 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉన్న ‘శక్తి’ కేంద్రాల ప్రతినిధులతో ఆయన భేటీ అవుతారు. అయితే మోడీ రాక సందర్భంగా, ఆయన చేసే విష ప్రచారానికి, అదిరిపోయే కౌంటర్ ప్లాన్ చేసారు చంద్రబాబు. నిజానికి ఇది ప్లాన్ చేసింది కాకపోయినా, అలా కలిసి రావటంతో, మోడీకి మామూలు కౌంటర్ ఉండదు అంటున్నాయి తెలుగుదేశం వర్గాలు.

modi 311012019

ఫిబ్రవరి 10న మోడీ గుంటూరు వచ్చి, మేము మీకు అన్ని వేల కోట్లు ఇచ్చాం, అన్ని లక్షల కోట్లు ఇచ్చాం, చంద్రబాబు అవినీతి చేసాడు, యుసి లు ఇవ్వలేదు అంటూ, ఎప్పటిలాగే విష ప్రచారం చేస్తారు. అందుకే, ఈ విష ప్రచారం సమర్ధవంతంగా తిప్పి కొట్టటానికి చంద్రబాబు ఢిల్లీనే వేదిక చేసుకున్నారు. మోడీ, ఆ రోజు మాట్లాడే అన్ని అబద్ధాలకు, ఆన్ని ఆధారాలతో ఢిల్లీ వేదికగానే కౌంటర్ ఇవ్వనున్నారు. మోడీ 10న గుంటూరు వస్తే, చంద్రబాబు 11న ఢిల్లీ వెళ్తున్నారు. ఫిబ్రవరి 11న సహచర మంత్రులతో కలిసి అక్కడ ఒక రోజు దీక్ష చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిశ్చయించారు. మర్నాడు 12న రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను అఖిల పక్ష నేతలు కలిసి రాష్ట్రానికి జరిగిన అ న్యాయాన్ని వివరిస్తారు.

modi 311012019

మొత్తంగా, అటు ఆందోళన చేస్తూనే, మోడీ అబద్ధపు ప్రచారాలని ఢిల్లీ వేదికగానే, అందరూ చూస్తూ ఉండగా తిప్పి కొట్టనున్నారు చంద్రబాబు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వివిధ రూపాల్లో రాష్ట్రంలో నిరసనలు సాగించాలని సీఎం పిలుపిచ్చారు. దీనికోసం అఖిలపక్షం తరపున కమిటీ వేయాలని నిర్ణయించారు. 1వ తేదీన రాష్ట్రంలో పెద్దఎత్తున నిరసన చేపట్టాలని, 11న ఢిల్లీలో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించా రు. ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని సీఎం తెలిపారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ ఆందోళనల్లో 5 కోట్ల మంది ప్రజలను భాగస్వాములను చేయాలి. అన్ని వర్గాలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తే అది గొప్ప ప్రజాఉద్యమంగా మారుతుంది. దీనిని రాజకీయ పోరాటంగా భావించకూడదు. ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వంపై చేసే పోరాట కార్యక్రమంగానే ఈ ఉద్యమాన్ని తీసుకోవాలి. రాష్ట్రానికి న్యాయం జరగాలి.. తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి. ఆంధ్రతో అనవసరంగా పెట్టుకున్నామనే భయం ఢిల్లీ పెద్దల్లో కలగాలి’ అని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి గుచ్చుడు ఘటనపై ఎన్‌ఐఏ విచారణ, కోడి ఈక కూడా పీకలేక పోయింది. ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన కోడి కత్తి దాడి కేసులో ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో పలు అంశాలు పేర్కొంది. సిట్‌ రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలనే మళ్లీ ఎన్‌ఐఏ చెప్పింది. కోడి కత్తితో శ్రీనివాసరావు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశాడని సెక్షన్‌ 307 ప్రకారం సిట్ అభియోగాలు నమోదు చేసింది. శ్రీనివాసరావు.. జగన్‌ అభిమాని అని తెలిపింది. సానుభూతి రావాలని దాడికి పాల్పడ్డాడని సిట్ రిపోర్ట్ స్పష్టంచేసింది. సిట్ రిపోర్ట్‌తో ఎన్‌ఐఏ దాదాపుగా ఏకీభవించింది. దాడి చేసే ముందు జగన్‌తో శ్రీనివాసరావు మాట్లాడాడని తెలిపింది. సర్.. మన పార్టీ 160 సీట్లు గెలుస్తుందని జగన్‌తో శ్రీనివాసరావు చెప్పాడని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో వెల్లడించింది. జగన్‌పై దాడి చేసే ముందు రోజు ఎయిర్‌పోర్టు ఫుడ్ కోర్టులో తోటి ఉద్యోగులతో జగన్‌ గురించి శ్రీనివాసరావు చర్చించినట్లు చార్జిషీట్‌లో పేర్కొంది.

jagan 31012019

ఈ సందర్భంగా జగన్‌తో సెల్ఫీ తీసుకునే అవకాశం ఇవ్వాలని వారిని కోరినట్లుగా చెప్పింది. ఇందుకోసం వైసీపీలో ఎవరితోనైనా మాట్లాడాలని సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టంచేసింది. సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా తెలిపింది. పార్టీ నేతలతో కలిసి జగన్‌ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక.. వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లినట్లుగా చార్జిషీట్లు స్పష్టం చేసింది. ఎడమ భుజంపై గాయం అయిందని డాక్టర్‌ ఇచ్చిన నివేదికను ఎన్‌ఐఏ ప్రస్తావించింది. సెంటి మీటర్‌ పొడవు.. అర సెంటిమీటర్‌ వెడల్పు.. మూడున్నర సెంటిమీటర్‌ లోతు గాయమైనట్లు తెలిపింది.

jagan 31012019

వైజాగ్ లో కోడి కత్తితో 0.5 cm దాడి చేపించుకున్న తరువాత, వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాడు జగన్. హైదరాబాద్ వెళ్ళగానే 0.5 cm గాయం కాస్తా 9 cm గాయం అయ్యి, కుట్లు కూడా పడ్డాయి. అంతే మనోడు మంచానికి అడ్డం పడుతూ స్టిల్స్ ఇచ్చి, లోటస్ పాండ్ కు వెళ్ళిపోయాడు. దాదపు 20 రోజుల తరువాత వచ్చి మీటింగ్ పెట్టారు. 0.5 cm గాయం అంటే ప్రతి రోజు మన ఇంట్లో ఆడవాళ్ళకు కూరాగయలు కోసే సమయంలో అయ్యే గాయం అంత.. దానికి 20 రోజులు డ్రామా ఆడి, మోడీతో కలిసి ఎన్‌ఐఏకి కేసు బదిలీ అయ్యేలా చేసారు. కాని, అక్కడ ఒక్క సాక్ష్యం కూడా చంద్రబాబు మీద తోయ్యటానికి లేకపోవటంతో, రిస్క్ ఎందుకులే అనుకుని కేసు మూసేసే ప్రయత్నంలో ఉన్నారు. మొత్తానికి, ఎన్‌ఐఏ ని అడ్డు పెట్టుకుని, మరో డ్రామా ఆడాలని చూసిన జగన్ బాబు మరో డ్రామా ఇలా ఫెయిల్ అయ్యింది.

సీఎం చంద్రబాబు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారిగా పోర్టులను తీసుకున్న ఆయన గెలుపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరిలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీఎల్పీ సమావేశంలో వెల్లడించారు. అయితే తాను కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సి ఉందని, ఆ పక్రియ ముగిశాక అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంపై కూడా ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. నెల రోజుల పాటు తనకు సమయం ఉంటుందన్నారు. ఆ సమయంలో ప్రతి రోజు రెండు జిల్లాల్లో పర్యటించడం.. లేదా కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం... లేకపోతే బహిరంగ సభల ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం లాంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు సమాచారం.

bruti 31012019

నెల రోజుల ప్రచారంపై ఎమ్మెల్యే అభిప్రాయాలను తీసుకున్నారు. మీరు కూడా ఆలోచించాలని, మీరు ఎలా చెబితే అలా చేస్తామని వారికి చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంపై రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని నేతలను సీఎం ఆదేశించారు. ఫిబ్రవరి 10వ తేది నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్నారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఈ షెడ్యూల్ ఉంటుందని, ఆ తర్వాత మార్చి మొదటివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో షెడ్యూల్ వల్ల ఎలాంటి కార్యక్రమాలను చేసేందుకు వీలుండదని అందువల్ల షెడ్యూల్ రాకముందే ప్రారంభోత్సవాలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.

bruti 31012019

ఫిబ్రవరి 2,3,4 తేదీలలో పించన్ల పండుగ జరపాలని చంద్రబాబు ఆదేశించారు. ఫిబ్రవరి 5న రైతుల సమస్యలపై చర్చ.. తర్వాత ఓటాన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతామని చంద్రబాబు పేర్కొన్నారు. 9న 4లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేస్తామన్నారు. 17 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేశామని, మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు. 22 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని, కొత్తగా 14 ప్రాజెక్టులు చేపట్టామన్నారు. వీటన్నింటిని శాసనసభ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ఆయన సూచించారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత, కాపు రిజర్వేషన్ల బిల్లును ఆమోదిస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.

 

మోడీ, అమిత్ షా కక్ష కడితే, అది మాములుగా ఉండదు. వారి ఇగో తృప్తి పరుచుకోవటానికి, ఒక రాష్ట్రాన్నే ఇబ్బంది పెడుతున్న చరిత్రకు, మనమే సాక్షులం. వారికి ఎవరు అడ్డు వచ్చినా, ఇలాగే కక్ష తీర్చుకుంటారు. తాజగా సార్వత్రిక ఎన్నికల ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో పాత కుంభకోణాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ హయాం నాటి గనుల తవ్వకాల కుంభకోణంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా మాయావతి అధికారంలో ఉన్న సమయంలో చోటుచేసుకున్న స్మారకాల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనిఖీలు జరిపారు. 2007-12 మధ్య మాయావతి యూపీ సీఎంగా ఉన్న సమయంలో బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్‌, పార్టీ గుర్తు ఏనుగు లాంటి అనేక స్మారకాలను నిర్మించారు.

akhilesh 31012019

అయితే స్మారకాల నిర్మాణాల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నిర్మాణాలతో ప్రభుత్వ ఖజానాకు కొన్ని కోట్ల నష్టం వాటిల్లిందని, కొందరు ప్రభుత్వ అధికారులు, ప్రయివేటు వ్యక్తులు లబ్ధి పొందినట్లు రాష్ట్ర విజిలెన్స్‌ కమిషన్‌లో ఫిర్యాదు దాఖలైంది. ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు గురువారం ఏకకాలంలో 7 చోట్ల తనిఖీలు చేపట్టారు. లఖ్‌నవూలోని కొందరు అధికారులు, ప్రయివేటు వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు జరిపారు. అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల అఖిలేశ్‌ యాదవ్‌ హాయం నాటి మైనింగ్‌ కుంభకోణం కేసులో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

akhilesh 31012019

ఐఏఎస్‌ అధికారిణి నివాసం సహా పలు అధికారుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు జరిపారు. కాగా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించడమే లక్ష్యంగా యూపీలో సమాజ్‌వాదీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ తమ వైరాన్ని సైతం పక్కనబెట్టి చేతులు కలిపాయి. మహాకూటమిగా ఏర్పడి లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేశ్‌, మాయావతి హయాం నాటి కుంభకోణాలపై ఈడీ సోదాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వారికి ఎదురు తిరిగిన, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కేరళ రాష్ట్రాల పై కేంద్రం అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతుంది. అలాగే దేశంలో వివిధ ప్రాంతీయ పార్టీలను కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఒక్క జగన్, కేసీఆర్ ని తప్ప..

Advertisements

Latest Articles

Most Read