గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌ వేదికగా జరిగిన ఏట్‌హోం కార్యక్రమంలో రాజకీయ సందడి నెలకొంది. తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సాంప్రదాయబద్దంగా ఏర్పాటు చేసిన టీనీటి విందు కార్యక్రమంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదట తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీ రామారావు ఆయనతో కాసేపు ముచ్చటిం చారు. అనంతరం రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.చంద్రశేఖర రావుకు శుభాభినందనలు తెలిపిన పవన్‌ ఆయన పక్కనే కూర్చుని దాదాపు 20 నిమి షాల పాటు ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లి ఎన్నికలు, త్వరలో ఏపీలో జరగనున్న శాసనసభ ఎన్నికలపైనా ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

gov 270120199

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటా యన్న కోణంలోనూ సీఎం కేసీఆర్‌ ఏపీ రాజకీయాలపై ఆరా తీసినట్టు సమాచారం. ఫెడరల్‌ ఫ్రంట్‌కు మద్దతు కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబుని దెబ్బ కొట్టటానికి వ్యూహం ఖరారు చేసుకున్న కేసీఆర్‌ పవన్‌తో అత్యంత కీలకాంశాలపై చర్చించారని రాజకీయ వర్గాలు గుసగుస లాడుతున్నాయి. ఎట్‌హోంలో కనిపించిన పవన్‌ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా ముచ్చటించి ఏపీ రాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్‌ ఆరా తీశారు. అంతకు ముందు కేటీఆర్‌ కూడా ఇదే కోణంలో పవన్‌తో చర్చించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో ఏపీలో చంద్రబాబు పరిస్థితి ఏమిటని అడిగారు. అక్కడున్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజల్లో ఉన్న ఆదరణ, అభివృద్ధి తదితర అంశాల గురించి కూడా తెలుసుకున్నారు. సీఎం కేసీఆర్‌తో మాట్లాడుతున్న సందర్భంలోనే గవర్నర్‌ నరసింహన్‌ పవన్‌

gov 270120199

ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపైనే ఎట్‌హోంలో పాల్గొన్న నేతల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఇటీవల జగన్‌తో కేటీఆర్‌ భేటీ, జగన్‌ గృహ ప్రవేశానికి హాజరయ్యేందుకు వచ్చే నెలలో కేసీఆర్‌ అమరావతి పర్యటన తదితర అంశాలు పవన్‌తో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. జగన్‌తో భేటీ అంశాలను పవన్‌తో కేటీఆర్‌ ప్రత్యేకంగా చర్చించి అవసరాన్ని, ఆవశ్యకతను వివరించినట్లు తెలుస్తోంది. తేనేటి విందు ముగింపు సమయంలో అందరూ రాజ్‌భవన్‌ నుంచి బయటకు వెళుతున్న క్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఉద్దేశపూర్వకంగా అన్నారో… యాదృచ్చిక అన్నారో… తెలియదు కానీ ‘కేసీఆరే నాకు ప్రొటెక్షన్‌’ అన్న వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆ సమయంలో అక్కడున్న కొంతమంది రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.

 

రాష్ట్ర ద్రోహుల ఏడుపులు మరోసారి వినాల్సిన పరిస్థితి. ఎందుకంటే, ‘కియ’ కారు ఈనెల 29న రోడ్డెక్కనుంది. తొలి కారును ఆ రోజున ప్రయోగాత్మకంగా పరుగులు తీయిస్తారు. అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని కియ కార్ల ప్లాంటులో దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పరిశ్రమ ప్రాంగణంలో 84.14 ఎకరాల్లో బాడీషాప్‌, పెయింట్‌షాప్‌, అసెంబ్లీ షాప్‌, ఇంజిన్‌ షాప్‌, ప్రెస్‌కు సంబంధించిన భవనాలు నిర్మించారు. ఐరన్‌ ఫ్రేమ్‌ కు సంబంధించిన ఆ నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. అంటే... తొలి కారు తయారీకి రంగం పూర్తిగా సిద్ధమైందన్న మాట. పరిశ్రమ ప్రాంగణంలోనే రైడింగ్‌ ట్రాక్‌ నిర్మించారు. తొలి కారును కియ ఎండీ, సీఎం చంద్రబాబు నడుపుతారు.

kia 27012019 3

ఈ కార్యక్రమంలో దక్షిణ కొరియా రాయబారి కూడా పాల్గొంటారు. లక్ష్యం ప్రకారం 2018 డిసెంబరులోనే కియ ప్లాంటు నుంచి తొలి కారు రావాల్సి ఉంది. కానీ, నెల ఆలస్యమైంది. ఐదు దశల్లో భూమి చదును: 2016 అక్టోబర్‌ నుంచి నవంబర్‌ 15కల్లా ఈ పనులు పూర్తి చేశారు. కొటక్‌ మహీంద్ర, హెచ్‌సీ, 12స్టోన్‌, ఎల్‌ఎన్‌డబ్ల్యు, ఎల్‌ అండ్‌ టీ, హుండయ్‌ ఇంజీరింగ్‌ కంపెనీ, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీలు భూమి చదును పనులను పూర్తి చేశాయి. చెప్పిన సమయానికంటే ముందే కియ కార్ల పరిశ్రమకు అవసరమైన భూమిని ఆ కంపెనీలు చదును చేసి కియకు అప్పగించాయి. కియ పరిశ్రమలో ప్రధానంగా రెండు కంపెనీల తయారీ విభాగాలు ఏర్పాటయ్యాయి. అందులో కియ పరిశ్రమకు చెందిన బాడీషాప్‌, పార్ట్స్‌ షాప్‌, ప్రెస్‌ షాప్‌, అసెంబ్లీ, ఇంజిన్‌ షాప్‌, కాయిల్‌ సెంటర్‌ అనే ఆరు విభాగాలు తమతమ పనులకు సిద్ధంగా ఉన్నాయి.

kia 27012019 3

అదే తరహాలో హుండయ్‌ కంపెనీ కూడా ఆరు విభాగాలను సిద్ధం చేసింది. హుండయ్‌ మోబిస్‌, హుండయ్‌ డైమోస్‌, హుండయ్‌ గ్లోవిస్‌, హుండయ్‌ గ్లోవిస్‌ యుపీసీ, హుండయ్‌ డైమోస్‌ సీట్‌, హుండయ్‌ స్టీల్‌ అనే విభాగాలు కార్ల తయారీ కోసం సిద్ధంగా ఉన్నాయి. అట్లాంటా తరువాత ఇక్కడే..: అనంతపురంలో కియ చేపట్టింది ఎనిమిదో ప్లాంటు. అయినా, కొరియాలో కంటే లేటెస్ట్‌ టెక్నాలజీతో కార్లు ఇక్కడ తయారవుతున్నాయి. జెకోస్లోవేకియా, చైనా, మెక్సికో, అమెరికాలోని అట్లాంటా తదితర దేశాల్లో కియ ప్లాంట్లు ఉన్నాయి. అట్లాంటా ప్లాంటు సాంకేతికపరంగా అత్యాధునికమైందని ఇప్పటిదాకా భావించారు. అందులో ఇప్పటికే బ్యాటరీ కార్లు సిద్ధమయ్యాయి. అనంతపురం ప్లాంట్‌లో కూడా బ్యాటరీ కారు తయారీని అదనపు ఫీచర్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రతి గంటకు 34 కార్లు: ఈ ప్లాంటులో గంటకు 34 కార్లు తయారవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన రోజుకు 821 కార్లు, సంవత్సరానికి 3 లక్షల కార్లు తయారవుతాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ చర్చలు జరిపారు. తొలుత కేటీఆర్‌, పవన్‌ చర్చలు జరపగా.. ఆ తర్వాత 15 నిమిషాలపాటు కేసీఆర్‌ చర్చించారు. ఈ చర్చలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వారి పక్క సీట్లోనే కూర్చుని ఉండడం గమనార్హం. కేసీఆర్‌, కేటీఆర్‌తో భేటీ తర్వాత గవర్నర్‌ నరసింహన్‌ కూడా పవన్‌ కల్యాణ్‌ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. రాజ్‌భవన్లో శనివారం రాత్రి జరిగిన ఎట్‌ హోంలో ఈ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాదాపు గంటపాటు ఎట్‌హోమ్‌ జరిగింది. సీఎం కేసీఆర్‌, గవర్నర్‌ రావడానికి ముందే అక్కడికి పవన్‌, కేటీఆర్‌ చేరుకున్నారు. తొలుత కేటీఆర్‌ ఆయనను ఆలింగనం చేసుకుని, పక్కన కూర్చోబెట్టుకుని ఏపీ రాజకీయాలపై మాట్లాడారు.

gov 27012019

ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ రాగానే ఆయనతోనూ కాసేపు పవన్‌ చర్చలు జరిపారు. ఏపీ రాజకీయాలతో పాటు, ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి కేసీఆర్‌ ప్రస్తావించినట్లు తెలిసింది. ఫ్రంట్‌ ఉద్దేశాన్ని వివరించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల బలాబలాలపై తన వద్ద ఉన్న సమాచారాన్ని కేసీఆర్‌ పవన్‌తో పంచుకున్నారని సమాచారం. ఇప్పటికే పవన్ నా ఫెడరల్ ఫ్రంట్ లో చేరాడు, నువ్వు కూడా చేరాలి అంటూ పవన్ ను కేసీఆర్ కోరినట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెడతామని, చంద్రబాబుకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తామని కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యాఖ్యానించారు కూడా.

gov 27012019

అనంతరం, వైసీపీ అధినేత జగన్‌తో ఇటీవల కేటీఆర్‌ భేటీ అయి చర్చించారు. కేసీఆర్‌ కూడా ఫోన్లో మాట్లాడారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఆ రెండు పార్టీల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే, కేటీఆర్‌, కేసీఆర్‌, పవన్‌ చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌, ఏపీ రాజకీయాలు, పై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబుని టార్గెట్ చేసే ఒక వర్గం అంతా హైదరాబాద్ లో సమావేశం అయ్యింది. ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే మిస్సింగ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై, ఏపి సియం పై ఎలాంటి కుట్రలు పన్నారో, ఈ రోజు పవన్ కళ్యాణ్ గుంటూరులో జరిగే మీటింగ్ చూస్తే తెలిసిపోతుంది. దాదపుగా రెండు నెలల నుంచి చంద్రబాబు పై సైలెంట్ అయిన పవన్, ఈ రోజు గుంటూరు మీటింగ్ లో మళ్ళీ విరుచుకుపడతారా, లేదో చూద్దాం..

కాంగ్రెస్ మాజీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. లోటస్‌పాండ్‌లో జగన్ నివాసానికి తన కుమారుడు హితేష్ చెంచురామ్‌తో కలిసి వెళ్లారు. ఈ భేటీ ప్రస్తుతం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన కుమారుడితో కలిసి వైసీపీలో చేరబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి దగ్గుబాటి వెంకటేశ్వరరావును జగన్ వద్దకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్‌ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం టికెట్‌ను హితేష్‌కు కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

daggubaati 27012019 2

ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ఏలూరు సాంబశివరావు విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి భరత్ ఓటమిపాలవడంతో 2019 ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. దీంతో వైసీపీ సమన్వయకర్తగా రావి రాంబాబును అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో రాంబాబును కాదని హితేష్‌కు టికెట్ కేటాయిస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. చాలా చోట్ల సమన్వయకర్తలను కాదని, కొత్త వారికి టికెట్లు కేటాయిస్తుండడంతో హితేష్‌కు కూడా టికెట్ దక్కవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీలో ఉన్న విషయం విదితమే.

 

daggubaati 27012019 3

ఆవిడ బీజేపీలో ఉంటూ, బీజేపీ బీ టీంలోకి కొడుకుని చేర్పించి, అదిరిపోయే స్కెచ్ వేసిందని అంటున్నారు. పైగా ఇప్పటికీ దగ్గుబాటి వెంకటేశ్వరావు కాంగ్రెస్ లోనే ఉన్నారు, ఆయన కాంగ్రెస్ కి దూరంగా ఉన్నారే కాని, రాజీనామా చెయ్యలేదు అని తెలుస్తుంది. ఇదే నిజం అయితే, తండ్రి కాంగ్రెస్, కొడుకు వైఎస్ఆర్ కాంగ్రెస్, తల్లి బీజేపీలో ఉండి, ఒక రికార్డు సృష్టించారు. మొన్న ఎన్టీఆర్ ఆత్మల గురించి మాట్లాడిన వారు, మరి ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారో. ఎన్టీఆర్ ఆత్మ ఏమో కాని, వైఎస్ఆర్ ఆత్మా మాత్రం, పావురాలగుట్ట మీదుగా ఇడుపులపాయకి చిందులు తొక్కుకుంటూ వెళ్లి ఉంటుంది. కారంచేడు మారణఖాండని అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకెంచి చెంచురామయ్యని దుషించారు వైఎస్ఆర్, ఇప్పుడు అదే చెంచురామయ్య గారి మనవడిని కౌగిలించుకున్నడు జగన్ రెడ్డి, ఇక వైఎస్ఆర్ ఆత్మ ఎంత సంతోషంతో పరవళ్ళు తోక్కుతుందో..

Advertisements

Latest Articles

Most Read