భోగి పండుగ రోజు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఝలక్ తో, జనసేన అభిమానులు అడ్డ్రెస్ లేకుండా పోయారు. అదేంటి పవన్ ని దేవుడిగా కొలిచే, అతని అభిమానులు ఇలా ఏంటి అనుకుంటున్నారా ? ఇక్కడ పవన్ అభిమానులకు, పవన్ మీద ప్రేమ కంటే, చంద్రబాబు అంటే ద్వేషం ఎక్కువ. అందుకే చంద్రబాబుని ద్వేషించే, జగన్ అంటే ఎంతో ఇష్టం. పవన్, చంద్రబాబు పై రివర్స్ అయిన దగ్గర నుంచి, జగన్ మీద ఎక్కడ లేని ప్రేమ వలకబోస్తూ ఉన్నారు. పవన్ సియం అవ్వాడు అని వారికి తెలుసు, అందుకే చంద్రబాబు మీద ద్వేషంతో, జగన్ సియం అవ్వాలని, ఎంతో మంది పవన్ అభిమానులు కోరుకుంటూ ఉంటారు. సోషల్ మీడియాలో, ఇది క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది కూడా. జగన్, పవన్ కలిసి పని చేస్తారు అనే వార్తలు వచ్చిన దగ్గర నుంచి, ఎంతో మంది పవన్ అభిమానులకు పట్టపగ్గాలు లేవు.

pk 15012019

అయితే కొన్ని సందర్భాల్లో, జగన్, నలుగురు నలుగురు పెళ్ళాలు అన్నా, ఎదో ఆ సమయంలో రియాక్ట్ అయ్యారే కాని, తరువాత మళ్ళీ మామూలే. చంద్రబాబు చిన్న రాజకీయ విమర్శ చేసినా, కులం అనే రంగు పులిమే పవన్ అభిమానులు, జగన్ నలుగురు నలుగురు పెళ్ళాలు అన్నా పెద్ద ఇబ్బంది పడరు. ఇది ఇలా ఉంటే, ఇక కేసీఆర్ అంటే, వీళ్ళకు ఎంత ప్రేమో చెప్పే పనే లేదు. చిటికెను వేలు అంత యాక్టర్ గాడు అని కేసీఆర్ అన్నా, సంక్రాంతికి వచ్చే గంగిరెద్దు, కమెడియన్ అంటూ కవిత అన్నా, పవన్ అభిమానులకు పెద్దగా పట్టదు. అందుకే కేసీఆర్ గెలుపుని, ఎంతో మంది ఎంజాయ్ చేసారు. వీరికి జగన్, కేసీఆర్ అంటే అంత ఇష్టం మరి.

pk 15012019

అయితే, భోగి పండుగ రోజు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పవన్ కళ్యాణ్ అభిమానులు, పాపం అడ్డ్రెస్ లేకుండా పోయారు. పవన్ కళ్యాణ్ ఒకేసారి, కేసీఆర్, జగన్ లను విలన్లుగా చూపించి మాట్లాడటంతో, పాపం పవన్ ను ఏమి అనలేక, పవన్ వ్యాఖ్యలు సమర్ధించలేక, జగన్, కేసీఆర్ ను ఏమి అనలేక, అడ్డ్రెస్ లేరు. ‘‘రాజకీయాలు ఎంత అసహ్యంగా, నీచంగా మారిపోతాయంటే.. ఒకప్పుడు జగన్మోహన్‌ రెడ్డి తెలంగాణకు వెళతానంటే, అడుగుపెట్టనవివ్వం అన్న తెలంగాణ నేతలు... జగన్మోహన్‌ రెడ్డికి సపోర్టు చేస్తామంటున్నారంటే... ఐదేళ్లలో రాజకీయాలు ఎలా మారిపోతాయో చూడండి. వాళ్ల్లే ఇప్పుడు ఆయన కొడుక్కు ఓపెన్‌గా సపోర్టు చేస్తారు. చంద్రబాబుపై కక్షసాధింపు కోసం వాళ్లు అంతా చేస్తుంటే...’’ అంటూ గతంలో జరిగిన సంఘటనలకు, వర్తమానంలో జరుగుతున్న వాటికి ముడిపెట్టి పవన్‌ వ్యాఖ్యానించారు. దీంతో పవన్ సడన్ గా, చంద్రబాబుకి అనుకూలంగా మాట్లాడినట్టు ఉండటం, అదే సమయంలో తమకు ఇస్టమైన జగన్, కేసీఆర్ ను తిట్టటంతో, పవన్ అభిమానులు ఇబ్బంది పడుతున్నారు.

నవ్యాంధ్ర అభివృద్ధి కోసం తీరికలేకుండా గడుపుతున్న చంద్రబాబు స్వగ్రామంలో సంక్రాంతిని కుటుంబంతో గడిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగ్రామమైన నారావారిపల్లెలో నారా వారి కుటుంబసభ్యులందరూ రెండు రోజుల పాటు సందడి చేశారు. గత కొన్నేళ్లుగా కొనసాగిస్తున్న ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజు సాయంత్రమే గ్రామానికి చేరుకున్న చంద్రబాబునాయుడు ఆ రాత్రి కుటుంబ సభ్యులు, సన్నిహితులతో గడిపారు. సంక్రాంతి పండగ రోజున ఉదయం కుటుంబసభ్యులతో కలిసి గ్రామదేవత అయిన నాగాలమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఆ పై తన తల్లదండ్రుల సమాధుల వద్దకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు.

nara 15012019 2

ఇంటి వద్ద చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో, బంధువులతో సన్నిహితులు, పార్టీ నాయకులతో కలసి విందును స్వీకరించారు. పంచెకట్టుతో క‌నిపించిన సీఎం, మనవడ్ని కూడా పంచె కట్టులో చూసి మురిసిపోయారు. ఇది ఇలా ఉంటే, ఆరు పదుల వయసులో కూడా, కుటుంబానికి దూరంగా, రాష్ట్రం కోసం అనునిత్యం కష్టపడుతున్న చంద్రబాబు, ఒక రెండు రోజులు అన్నీ పక్కన పెట్టి, కుటుంబ సభ్యులతో గడపటంతో, ఆయన అభిమానులు కూడా సంతోషిస్తున్నారు. ఎప్పుడూ పనిలోనే నిమగ్నమయ్యే చంద్రబాబుకు, ఎట్టకేలకు రెస్ట్ దొరికింది అంటూ, సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

nara 15012019 3

ఈ సందర్భంగా చంద్రబాబు కూడా సరదాగా కనిపించారు. ఆదునిక యుగంలో టెక్నాలజి ఆవశ్యకత ఉన్నదని దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవడం ద్వారా జీవితం ఆనందమయంగా ఉంటుందన్నరు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఆనంద రాష్ట్రంగా నిలుపుకుందామన్నారు. అత్యంత పవిత్రంగా జరుపుకునే సంక్రాంతి విశిష్టతను మరింత పెంచే విధంగా రాష్ట్రపండుగగా నిర్వహిస్తున్నామన్నారు. మన సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు వెలుగులోనికి తీసుకు వచ్చేవిధంగా అందుకు అనుగుణంగా నిర్ణయాలు చేస్తున్నామన్నారు. జన్మభూమి, తల్లితండ్రులు, పెద్దలను మరిచిపోరాదని, పాత గుర్తులను నెమరు వేసుకోవాలన్నారు. రాష్ట్రం బాగుంటే, దేశం బాగుంటుందని నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన ముహర్తం వలన చేపట్టిన ప్రతికార్యక్రమము త్వరితగతిన పూర్తి కావడం శుభసూచికమన్నారు.

తెరాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయవాడలో తలపెట్టాలనుకున్న ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. సోమవారం ఉదయం విజయడవాడ ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆర్కే కాలేజీలో నిర్వహించిన యాదవ ఆత్మీయ సమ్మేళ కార్యక్రమానికి విచ్చేసిన తలసానికి ఆర్కే కాలేజ్‌ ఛైర్మన్‌ ఎం.కొండయ్య, ఇతర యాదవ నేతలు ఘన స్వాగతం పలికారు. ఆర్కే కాలేజ్ నుంచి కనక దుర్గ ఆలయం వరకు నిర్వహించ తలపెట్టిన ర్యాలీకి పోలీసులు నిరాకరించారు. ర్యాలీకి సంబంధించి ముందస్తుగా అనుమతి తీసుకోకపోవడంతో నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఎలాంటి ఆర్భాటం లేకుండా కేవలం ఐదు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.

talasani 14012019 2

తరువాత, బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఇంద్రకీలాద్రి పై మీడియాతో మాట్లాడిన తలసాని... రాజకీయ వ్యాఖ్యలు చేడం వివాదంగా మారుతోంది. దుర్గమ్మ సన్నిధిలో ఇంద్రకీలాద్రి పై తలసాని రాజకీయాలు మాట్లాడడాన్ని దుర్గగుడి పాలక మండలి సభ్యులు తప్పుపడుతున్నారు. తలసాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు పాలక మండలి సభ్యులు.. తలసాని రాజకీయాలు మాట్లాడుతుంటే వారించలేకపోయారంటూ ఆలయ సిబ్బందిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు సభ్యులు.

talasani 14012019 3

దుర్గమ్మ ఆలయంలో తలసాని రాజకీయాలు మాట్లాడతారా..? అంటూ మండిపడ్డారు పాలక మండలి సభ్యులు పెంచలయ్య... ఆలయ పవిత్రత దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించిన ఆయన... తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భీమవరంలో కోడిపందాలు ఆడటానికి వెళ్తూ దుర్గమ్మ ఆలయంలో అడ్డమైన ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన... రాజకీయలు మాట్లాడుతున్నా ఆలయ అధికారులు అడ్డుకొకపోవటం సరికాదన్నారు. తలసాని క్షమాపణలు చెప్పకపోతే పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు పెంచలయ్య.

దేశ చరిత్రలోనే అతి దరిద్రమైన ఆట, కర్ణాటకలో ఆడింది బీజేపీ. కబురులు చెప్పే మోడీ, అమిత్ షా ఆడిన ఆట ఇంకా అందరికీ గుర్తుంది. గాలి జనార్ధన్ రెడ్డి లాంటి వాడిని చేరదీసి, పక్కన పెట్టుకుని, నిస్సిగ్గుగా ప్రచారం చేసారు... మెజారిటీ రాకపోయినా, గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు... చివరకు 150 కోట్లు ఆఫర్ చేసారు... ఆడియో టేప్ లు బయటపడ్డాయి. అర్ధరాత్రి సుప్రీం కోర్ట్ తలుపులు తెరుచుకున్నాయి.. దేశంలో ఎంత దౌర్భాగ్యం లేకపోతే, అర్ధరాత్రి తలుపులు తెరుచుకుంటాయి ? అమిత్ షా, మోడీ కుట్రలని తిప్పి కొడుతూ, సుప్రీం కోర్ట్ ఒక్క రోజే బల నిరూపణకు టైం ఇచ్చింది... దీంతో బేర సరాలకు టైం సరిపోలేదు... చివరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు ఉన్న బీఎస్ యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. అమిత్ షా, మోడీ కుట్రలని తట్టుకుని, దేశం గెలిచింది... అప్పటి నుంచి కుమారస్వామి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు.

amitshah 15012019 2

అయితే, అప్పటి నుంచి బీజేపీ, ఎప్పుడెప్పుడు కర్ణాటక ప్రభుత్వాన్ని పడేద్దామా అని ప్లాన్లు వేస్తూ వస్తుంది. తాజాగా, కర్ణాటకలో మరోసారి రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. కూటమి సర్కార్‌ను కూలదోసేందుకు తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, బేజీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పు ఆరోపిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాల్లో పడ్డాయి. సొంత పార్టీకి చెంది 102 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గురుగావ్ తరలించింది. అక్కడి ఫైస్ స్టార్ హోటల్‌లో వారిని ఉంచినట్టు తెలుస్తోంది. మరోవైపు, తమ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలను బీజేపీ ముంబైకి తరలించిందంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ బెంగళూరులో పార్టీ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

amitshah 15012019 3

అమిత్ షా డైరెక్ట్ గా రంగంలోకి దిగి, ఒక్కో ఎమ్మెల్యేకి 30 కోట్లు ఆఫర్ చేసినట్టు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు తమతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నారంటూ ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలతో కర్ణాటక రాజకీయాల్లో అయోమయం నెలకొంది. బీజేపీకి చెందిన 4 నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్‌గా పేరున్న డీకే శివకుమార్ మీడియాకు తెలిపారు. కాగా, కాంగ్రెస్ నుంచి 10 మంది, జేడీఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని బీజేపీ క్లెయిమ్ చేస్తోంది. మీరు బేరసారాలు జరుపుతున్నారంటే మీరు బేరసారాలు జరుపుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు గుప్పించుకోవడంతో రిసార్ట్ రాజకీయాలకు తెరలేచింది. ప్రశాంతంగా సాగుతున్న కర్ణాటకలో, బీజేపీ చిచ్చు పెట్టి, ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో అనిశ్చితికి కారణం అయ్యింది. తనకు అనుకూలంగా ఉన్న కేసీఆర్ మినహా, దక్షిణ భారత దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో, బీజేపీ ఇదే ఆట ఆడుతుంది.

Advertisements

Latest Articles

Most Read