గన్నవరం నుంచి దుబాయ్ కి డైరెక్ట్ ఫ్లైట్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అధికారులు కొన్ని రోజుల క్రిందట ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఒక బహిరంగ ప్రకటన కూడా ఇచ్చింది. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్ ఎయిర్ పోర్ట్ కి విమానాలను ప్రారంభించే సాధ్యాసాద్యాలను పరీక్షించే ప్రతిపాదన పై, ప్రజల నుంచి అభిప్రాయాన్ని తెలుసుకోవటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అంటూ, ఒక ప్రకటన జారీ చేసింది. అయితే, ఇదేదో ఫోర్మలిటీగా చేసారు. ప్రజల నుంచి ఎదో రెస్పాన్స్ వస్తుందిలే అనుకున్నారు కాని, ప్రజాలు మాత్రం అనూహ్యంగా రెస్పాన్స్ ఇచ్చారు.

gannavaram 14012019 2

సింగపూర్‌కు విమాన సర్వీస్‌ ప్రవేశపెట్టే ముందు కూడా ఇలాంటి ప్రయోగమే చేశారు. అప్పట్లో 60 వేల మందికిపైగా ఆన్‌లైన్‌లో సానుకూలతను వ్యక్తం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి లోటు భర్తీ నిధి (వీజీఎఫ్‌) సమకూర్చే అవకాశం లేకుండానే గన్నవరం నుంచి సింగపూర్‌కు విమాన సర్వీసు నడుస్తోంది. దుబాయ్‌కు ప్రవేశపెట్టే సర్వీసుపైనా ఆన్‌లైన్‌లో ఇప్పటికే లక్ష మందికిపైగా అనుకూలతను వ్యక్తం చేశారు. అంటే సింగపూర్ ఫ్లైట్ కి వచ్చిన రెస్పాన్స్ కంటే డబల్.. విజయవాడ నుంచి దుబాయ్‌ వెళ్లే వారు హైదరాబాద్‌ వెళ్లి ప్రయాణం సాగిస్తున్న పరిస్థితి. గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా వచ్చాక ఇక్కడి నుంచి ఇతర దేశాలకు విమాన సర్వీసులు నడిపేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారు.

gannavaram 14012019 3

సింగపూర్‌ విమాన సర్వీసు విజయవంతం కావడంతో ఇప్పుడు దుబాయ్‌ కోసం ఏపీఏడీసీఎల్‌ ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి అనతి కాలంలో మంచి స్పందన రావడంతో తదుపరి చర్యలపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. లోటు భర్తీ నిధి విధానంలో గన్నవరం నుంచి దుబాయ్‌కు విమాన సర్వీసు నడిపేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ నెలాఖరులో విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలవనుంది. ఈ సేవల ప్రారంభానికి భారత విమానయాన సంస్థ, ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల అనుమతుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇప్పటి వరకు https://www.apadcl.com/ అనే వెబ్సైటులో, 1,02,710 మంది తమ ఇష్టాన్ని తెలియచేసారు.

దేశంలో అంబానీల గ్రూప్‌కి పోటీగా ఎదుగుతున్న మరో గ్రూప్‌ అదానీలది. గుజరాత్ కేంద్రంగా వ్యాపార కార్యకలాపాలు సాగించిన ఈ గ్రూపు ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితం అన్న పేరుంది. ప్రధానిగా మోదీ పదవీ బాధ్యతలు స్వీకరించాక అదానీ గ్రూపు తన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది. అంతేకాదు- అనేక రంగాల్లోకి అడుగుపెట్టింది. తాజాగా అదానీ గ్రూపు దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను ఏర్పాటుచేసే బిజినెస్‌ చేపట్టింది. అదానీ గ్రూపు ఆర్ధిక పరిస్థితి కూడా బాగుండటం, వీటన్నింటికీ మించి అదానీ గ్రూపు రోజురోజుకీ ఎదుగుతుండటంతో ఆ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌ గ్రౌండ్‌వర్కు ప్రారంభించారు. గత ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్ధికవేదిక సదస్సులో అదానీ గ్రూపు ముఖ్యులను లోకేశ్‌ కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితుల గురించి వారికి వివరించారు.

adani 14012019

అప్పట్లో ఆసక్తి ప్రదర్శించినప్పటికీ ఆ తర్వాత అదానీ గ్రూపు ముందుకు రాలేదు. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన విన్‌టెక్ ఫెస్టివల్ సందర్భంగా మరోసారి అదానీ గ్రూపుతో లోకేశ్‌ భేటీ అయ్యారు. అదే సమయంలో అదానీ గ్రూపు డేటా సెంటర్ల బిజినెస్‌లోకి అడుగు పెడుతోందని లోకేశ్‌ తెలుసుకున్నారు. వెంటనే ఆయన రంగంలోకి దిగారు. ఇటీవల అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీని కలుసుకున్నారు. ఏపీలో క్లౌడ్ హబ్ పాలసీ గురించి వివరించి డేటా సెంటర్ల ఏర్పాటుకు ఉన్న అనువైన పరిస్థితులను వివరించారు. భూమి, మౌలిక వసతుల కల్పన, వివిధ శాఖలతో సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వడం వంటి వ్యవహారాలన్నీ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు రావాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. మంత్రి లోకేశ్‌ ఆహ్వానానికి అదానీ గ్రూపు సానుకూలంగా స్పందించింది.

adani 14012019

అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టబోతోందని తెలుసుకున్న మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. అదానీ గ్రూపుని సంప్రదించాయి. ఏపీ కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తామనీ, తక్కువ ధరకు భూములు ఇస్తామని కూడా అదానీ గ్రూపునకు ప్రతిపాదనలు వెళ్లాయి. వత్తిడి కూడా పెరిగింది. ఈలోపు అదానీ గ్రూపు ఏపీలో పరిస్థితులను మరోసారి భేరీజు వేసుకుంది. ఈ రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల గురించి, అనంతపురంలో కియా, చిత్తూరుజిల్లా శ్రీసిటీలో ఏర్పాటవుతున్న పరిశ్రమల గురించి తెలుసుకుంది. వీటితోపాటు అమరావతి అభివృద్ధి చెందుతున్న తీరు, ఐటీ కారిడార్‌గా విశాఖపట్నం ఎదుగుతున్న వైనం వారిని ఆకట్టుకున్నాయి. దీంతో అదానీ గ్రూపు ఏపీ వైపే మొగ్గుచూపింది. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ తమకి పనికి వస్తుందని నమ్మింది.

adani 14012019

ఈ సందర్భంగా అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ ఎవరికీ చెప్పకుండా విజయవాడ ఎయిర్‌పోర్టులో వాలిపోయారు. ఆయన విజయవాడకు వచ్చే విషయం రెండు గంటల ముందు వరకు కూడా ఎవరికీ తెలియదు. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌, ఆ శాఖ అధికారులు స్వయంగా ఎయిర్‌పోర్టుకు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు. వెంటబెట్టుకుని మరీ సీఎం నివాసానికి తీసుకువెళ్లారు. సుమారు గంటసేపు చంద్రబాబుతో చర్చలు జరిగాయి. సుహృద్భావ వాతావరణంలో జరిగిన ఈ చర్చల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోడేటా సెంటర్ల ఏర్పాటుకు వచ్చే అయిదేళ్లలో 70 వేలకోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని అదానీ గ్రూపు చెప్పింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఎం.ఓ.యూ కూడా కుదుర్చుకుంది. పరిశ్రమల ఏర్పాటుకోసం ఏపీ ప్రభుత్వం చేస్తున్న గ్రౌండ్‌వర్క్ చివరి నిముషం వరకూ ఎవరికీ తెలియనివ్వడం లేదు. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితమైన అదానీ గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెట్టడం, స్వయంగా గ్రూపు ఛైర్మన్ అదానీయే ఏపీకి రావడం, చంద్రబాబుతో భేటీ కావడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

హైదరాబద్ లో ఉండే ఒక బ్యాచ్ కి, ఆంధ్రప్రదేశ్ అంటే మరీ చులకన అయిపొయింది. ఇందులో మొదటి స్థానం మాత్రం వైసీపీకే ఇవ్వాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ డాక్టర్లు అంటే నమ్మకం లేదని, ఏపి పోలీస్ అంటే నమ్మకం లేదని, ఏపి కోర్ట్ లు అంటే నమ్మకం లేదని, జగన్ మోహన్ రెడ్డి చేసిన విమర్శలు చూసాం. ఇప్పుడు ఈయనకు తోడు, ఈయన చెల్లలు షర్మిల రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో తన పై వ్యక్తిగతంగా దాడి జరుగుతుందని, దానికి కారణం చంద్రాబాబే అని, అయితే ఏపి పోలీసుల పై నమ్మకం లేదని, హైదరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది షర్మిల.. వీరికి ఏపిలో, దేని పైనా నమ్మకం ఉండదు కాని, ఏపిలో ఉన్న సియం కుర్చీ పై మాత్రం, ఎంతో ప్రేమ ఉంటుంది.

sharmila 14012019

అయితే షర్మిల వ్యాఖ్యల పై, ఏపీ పోలీసు అధికారుల సంఘం స్పందించింది. విజయవాడలో సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏపీ పోలీసు మీద నమ్మకం లేదనడం రాష్ట్ర పోలీసుల మనోభావాలను దెబ్బతీయటమే అని అన్నారు. దేశ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఓ ప్రత్యేకత ఉందని గుర్తు చేశారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తే ఇటువంటి వ్యాఖ్యలే చేస్తారా అని ప్రశ్నించారు. జగన్ పై దాడి కేసులో కూడా ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం విచారకరమని, పదే పదే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాష్ట్రంలోని 60 వేల మంది పోలీసుల మనో స్థైర్యం దెబ్బతీయటమే, ఏపీ పోలీసులు వైఎస్ హయాంలో కూడా పని చేశారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.

sharmila 14012019

ఏ రాష్ట్ర పరిధిలో జరిగితే, అక్కడే కేసులు నమోదవుతాయని చెప్పారు. రానున్న రోజుల్లో వారి ప్రభుత్వం (వైసీపీ) వచ్చినా... రాష్ట్రంలోని అన్ని కేసులను ఏపీ పోలీసులే విచారించాల్సి ఉంటుందని తెలిపారు. దేశంలోనే ఏపీ పోలీసులు బెస్ట్ అనే కితాబులు తామకు చాలా సార్లు వచ్చాయని అన్నారు. మరో పక్క తెలుగుదేశం నేతలు కూడా ఈ వ్యాఖ్యల పై స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ షర్మిళపై సోషల్‌మీడియా ప్రచారానికి టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ఆరోపణలను ప్రోత్సహించరని అన్నారు. వ్యక్తిగత ఆరోపణలు ఏ పార్టీ వాళ్లు చేసినా ఖండించాల్సిందేనని అన్నారు. జగన్‌ను రాజకీయంగా విమర్శించాం గానీ.. షర్మిళను ఏనాడూ ప్రస్తావించలేదని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పింఛన్లు పెంచుతూ సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం 24 గంల వ్యవధిలోన మరో సంచలనాత్మక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలోని రైతాంగానికి ఇక నుంచి 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న 7 గంటల ఉచిత విద్యుత్తును 9 గంటలకు పెంచాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ఇంధన శాఖ, విద్యుత్తు సంస్థలను ఆదివారం ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆమేరకు అవసరమైన ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని చెప్పారు. మార్చి నెలాఖరుకల్లా వ్యవసాయ కనెక్షన్న మంజూరులో పెండింగ్‌ లేకుండా చూడాలని డిస్కంలకు ఆదేశాలు జారీ చేశారు. 9 గంటల ఉచిత విద్యుత్తు వల్ల దాదాపు 17 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని, బంగారం లాంటి పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఆదివారం ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో విద్యుత్‌, ఇంధన శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు.

farmers 14012019

రైతులకు 9 గంటలు ఉచిత సరఫరా చేయడానికి 2, 800 మిలియన్‌ యూనిట్లు అదనంగా విద్యుత్తు కావాల్సి ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేసినట్లు అజయ్‌ జైన్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం వ్యవసాయానికి వినియోగి స్తున్న 10, 831 మిలియన్‌ యూనిట్లకు ఇది అదనమన్నారు. ఇందుకోసం దాదాపు రూ.1200 కోట్ల అదనపు వ్యయమవుతుందని వివరించారు. ఉచిత విద్యుత్తు, కొత్త కనెక్షన్లకు గాను ప్రస్తుతం వ్యవసాయ రంగానికి రాయితీ కింద రూ. 6, 030.17 కోట్లు ఖర్చవుతుండగా..9 గంటలు ఉచిత విద్యుత్తు ఇవ్వడం వల్ల రూ.7230.17 కోట్లకు చేరుతుందని అజయ్‌ జైన్‌ తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం .. తాను సీఎంగా ఉన్న సమయంలో 1994-2004 మధ్యకాలంలో తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తును అమలు చేసానని, మళ్లీ ఇప్పుడు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా 15 రోజుల క్రితమే 9 గంటల ఉచిత విద్యుత్తును ప్రకటించానని చెప్పారు.

farmers 14012019

రైతుల సంక్షేమం తప్ప తనకింకేదీ ప్రధానం కానే కాదని స్పష్టం చేశారు. తమది రైతు హిత ప్రభుత్వమన్నారు. రైతు శ్రేయస్సు కోరే ప్రభుత్వంగా రైతులే ముందు అన్న నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. అన్నదాత లబ్ధి కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనకాడనన్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్తు కోసం ఇంత భారీ మొత్తంలో రాయితీని దేశంలోని ఏ రాష్ట్రం ఇవ్వడం లేదని చెప్పారు. నాణ్యమైన ఉచిత విద్యుత్తు, అనేక ఇతర సంక్షేమ పథకాల ద్వారా రైతుల సాధికారతకు కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ కనెక్షన్లన్నింటినీ 2019 మార్చి నాటికి పూర్తి చేయాలని విద్యుత్తు సంస్థలను ఈ సందర్భంగా ఆదేశీస్తున్నా అని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతోపాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తాను కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు.

Advertisements

Latest Articles

Most Read